Gold Loans: బంగారంపై రుణాల్లో మోసం! ఆర్బీఐ కీలక ఉత్తర్వులు..
ఫైనాన్స్ ఇండస్ట్రీ డెవలప్ మెంట్ కౌన్సిల్ డేటాలో తెలిపిన సమాచారం ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలోని మొదటి త్రైమాసికంలో 32 శాతం పెరిగాయి. గతేడాదితో పోల్చితే 26 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. అయితే బంగారంపై రుణాలు తీసుకునేవారు పెరిగిపోవడంతో, దానిపై రుణాలు ఇస్తున్న కొన్ని సంస్థలు అక్రమ పద్దతులు అవలంభిస్తున్నాయని ఆర్బీఐ గుర్తించింది.
వైద్య సంబంధిత ఖర్చులు, అనుకోని సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ రుణాలు తీసుకుంటారు. ముఖ్యంగా బ్యాంకులపై ఆధారపడతారు. తక్కువ వడ్డీతో పాటు రుణం త్వరగా చెల్లించే అవకాశం ఉండడంతో బ్యాంకులవైపు మొగ్గుచూపుతారు. బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణాలు తీసుకోవాలంటే కొంచెం సమయం పడుతుంది. కానీ బంగారంపై రుణాలు మాత్రం త్వరతిగతిన మంజూరవుతాయి. దీంతో బ్యాంకులలో బంగారాన్ని తాకట్టు పెట్టి, రుణాలు తీసుకునేవారు విపరీతంగా పెరిగారు. బ్యాంకులు, వివిధ ఫైనాన్షియల్ సంస్థలు విరివిగా వీటిని మంజూరు చేస్తున్నాయి.ఈ రుణాల మంజూరులో రికార్డు వృద్ధి నెలకొంది. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. బంగారు రుణాల మంజూరు, లోపాలలో ఏవైనా తేడాలుంటే మూడు నెలల్లో సరిచూసుకోవాలని బ్యాంకులు, నాన్ ఫైనాన్స్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
నివేదిక ప్రకారం..
ఫైనాన్స్ ఇండస్ట్రీ డెవలప్ మెంట్ కౌన్సిల్ డేటాలో తెలిపిన సమాచారం ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలోని మొదటి త్రైమాసికంలో 32 శాతం పెరిగాయి. గతేడాదితో పోల్చితే 26 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. అయితే బంగారంపై రుణాలు తీసుకునేవారు పెరిగిపోవడంతో, దానిపై రుణాలు ఇస్తున్న కొన్ని సంస్థలు అక్రమ పద్దతులు అవలంబిస్తున్నాయని ఆర్బీఐ గుర్తించింది. దీంతో రుణగ్రహీతలకు నష్టం కలగకుండా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా రుణ మంజూరు పాలసీలను మార్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే రుణ గ్రహీతలు రుణాలను తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
లోపాలపై సమీక్ష..
బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు తమ బంగారు రుణాల పాలసీలు, విధానాలను సమీక్షించుకోవాలని ఆర్బీఐ ఆదేశించింది. వాటిలో ఏవైనా లోపాలుంటే మూడు నెలల్లో సరి చేసుకోవాలని తెలిపింది. ముఖ్యంగా రుణాల మంజూరు విధానాలు, రుణ ఖాతాలను మళ్లీ సమీక్షించుకోవాలని కోరింది. రుణాలను జారీ చేసే విధానంలో ఉన్న లోపాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. రుణ గ్రహీతలు లేకుండానే బంగారం విలువను మదింపు చేస్తున్నారని, రుణాలపై పర్యవేక్షణ ఉండడం లేదని, రుణాల చెల్లించని వారి బంగారు ఆభరణాలను వాయిదా వేసే సమయంలోనూ పారదర్శక ఉండడం లేదని వెల్లడించింది.
ఆదేశాలు జారీ..
బంగారు రుణాల విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని, రుణ గ్రహీతలకు నష్టం కలిగేలా వ్యవహరించరాదని ఆర్బీఐ ఆదేశించింది. అక్రమ పద్ధతులు, లోపాలను సత్వరం సరిదిద్దుకోవాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలను ఆదేశించింది. ఈ విషయంలో తీసుకున్న చర్యలను సీనియర్ సూపర్ వైజర్ మేనేజర్ కు తెలియజేయాలని స్పష్టం చేసింది. ఒక వేళ నిబంధనలు పాటించని బ్యాంకులు, నానా బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..