RBI: గుడ్‌న్యూస్‌.. రూ.2 వేల నోట్ల మార్పిడికి గడువు పెంపు

తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పెద్ద నోట్లను ఉపసంహరణ కోసం నోట్లను వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని రిజర్వ్‌ బ్యాంక్‌ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నోట్లు ఉన్నవారు బ్యాంకులో డిపాజిట్‌ చేసుకోవడం లేదా వాటి స్థానంలో వేరే నోట్లను మార్పిడి చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. అయితే సెప్టెంబర్ 30తో గడువు ముగియనున్న నేపథ్యంలో గడువు పొడిగిస్తుందా..? లేదా అనే సందేహం చాలా మందిలో..

RBI: గుడ్‌న్యూస్‌.. రూ.2 వేల నోట్ల మార్పిడికి గడువు పెంపు
Rs 2000 Notes
Follow us
Subhash Goud

|

Updated on: Sep 30, 2023 | 5:22 PM

రూ.2000 నోట్ల ఉపసంహరణకు గడువు సెప్టెంబర్‌ 30తో ముగియనున్న విషయం తెలిసిందే. అయితే గడువు పొడిగిస్తారా? లేదా అనేది సందిగ్ధంలో ఉండేది. కానీ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వినియోగదారులకు గుడ్‌న్యూస్‌ చెబుతూ కీలక నిర్ణయం తీసుకుంది.రూ2000 నోట్లను మార్పిడి చేసుకునేందుకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 7వ తేదీ వరకు రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది రిజర్వ్‌ బ్యాంక్‌.

కాగా, మే 19, 2023న 2000 రూపాయల నోట్లను చెలామణి నుంచి తొలగించేందుకు ఆర్బీఐ వినియోగదారులకు నాలుగు నెలల సమయం ఇచ్చింది. అయితే దీని గడువు ఈరోజుతో ముగుస్తుంది. తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పెద్ద నోట్లను ఉపసంహరణ కోసం నోట్లను వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని రిజర్వ్‌ బ్యాంక్‌ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నోట్లు ఉన్నవారు బ్యాంకులో డిపాజిట్‌ చేసుకోవడం లేదా వాటి స్థానంలో వేరే నోట్లను మార్పిడి చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. అయితే సెప్టెంబర్‌ 30తో గడువు ముగియనున్న నేపథ్యంలో గడువు పొడిగిస్తుందా..? లేదా అనే సందేహం చాలా మందిలో కలిగింది. అయితే ముందుగా ఆర్బీఐ ఈ నోట్ల మార్పిడికి గడువు పొడిగించేది లేదని భావించినా.. ఇతరుల నుంచి విజ్ఞప్తుల మేరకు తేదీని పొడిగిస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్‌ 30 వరకు ఉన్న గడువును అక్టోబర్‌ 7 వరకు పొడిగించడం ఈ పెద్ద నోట్లు ఉన్నవారికి కొంత ఊరట కలించినట్లయ్యింది. అయితే ఈ నోట్లు కలిగిన వారు వెంటనే సమీపంలోని ఏదైనా బ్యాంకుకు వెళ్లి కూడా నోట్లను మార్పిడి చేసుకునే వెసులు బాటు ఉంది. గతంలో ఈ నోట్లను మార్పిడి చేసుకోవడం లేదా డిపాజిట్‌ చేయడం లాంటివి చేసినా ఆధారాలు ఇవ్వాలని, బ్యాంకు సిబ్బంది అడిగిన పత్రాలు ఇవ్వాలని వార్తలు వచ్చాయి. అలాంటి సమయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఎలాంటి ఆధారాలు అంటే ఆధార్‌, పాన్‌ కార్డు వంటి వివరాలు అందించకుండానే బ్యాంకులో సులభంగా నోట్లను మార్పిడి చేసుకోవడం, లేదా డిపాజిట్‌ చేసుకోవడం చేయవచ్చని స్పష్టం చేసింది.

రోజుకు రూ.20 వేల చొప్పున ఈ రెండు వేల రూపాయల నోట్లను మార్చుకునేందుకు అవకాశం ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. సెప్టెంబర్‌ 1వ తేదీ వరకు 93 శాతం వరకు ఈ రెండు వేల రూపాయల నోట్లు బ్యాంకులకు వచ్చాయని ఆర్బీఐ నివేదికలు తెలిపాయి. ఇప్పుడు గడువు పొడిగించడంతో కేవలం మరో వారం మాత్రమే ఉంది. ఈ రూ.2 వేల నోట్లు కలిగిన వారు వెంటనే బ్యాంకులో మార్పిడి చేసుకోవడం చాలా ముఖ్యం. లేకుండే గడువు తీరిన తర్వాత ఈ నోట్లు చిత్తు కాగితాలతో సమానంగా మారనున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?