Rare Pink Diamond: అమ్మకానికి అరుడైన పింక్‌ డైమండ్‌.. ప్రత్యేకతలు, ధర తెలిస్తే గుడ్లు తేలేయాల్సిందే..!

|

Apr 05, 2023 | 5:37 PM

మండ్‌లో గులాబీ రంగు ఎక్కడి నుంచి వస్తుందనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. భూమి లోపల రాతి ఏర్పడే ప్రక్రియలో ఇది వస్తుందని నమ్ముతారు. వేలంలో ఇప్పటివరకు అమ్ముడైన మొదటి ఐదు వజ్రాల్లో మూడు పింక్ డైమండ్‌లు ఉన్నాయి.

Rare Pink Diamond: అమ్మకానికి అరుడైన పింక్‌ డైమండ్‌..  ప్రత్యేకతలు, ధర తెలిస్తే గుడ్లు తేలేయాల్సిందే..!
Pink Diamond
Follow us on

ప్రపంచంలో చాలా రకాల వజ్రాలు ఉన్నాయి. కానీ, వాటిలో చాలా ప్రత్యేకమైన వజ్రం గులాబీ రంగు వజ్రం.. అదే రేర్ పింక్ డైమండ్. ఈ వజ్రం కనిపించడంలోనూ అంతే అరుదైనది. అయితే, త్వరలోనే ఈ వజ్రాన్ని వేలం వేయనున్నారు. ఈ అరుదైన పింక్ డైమండ్ 35 మిలియన్లకు పైగా అత్యంత ఖరీదైన ధరకు అమ్ముడవుతుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మార్కెట్‌లో ఇప్పటివరకు విక్రయించిన క్యారెట్‌కు అత్యంత ఖరీదైన ధరగా రికార్డులు బద్దలుకొడుతోంది. ఈ పింక్ డైమండ్ పేరు ది ఎటర్నల్ పింక్. ఈ వజ్రం 10.57 క్యారెట్లు. ఇది (పింక్ డైమండ్) మొదట హాంకాంగ్‌లో ప్రదర్శించబడుతుంది. దీని తర్వాత వజ్రాన్ని దుబాయ్, సింగపూర్, షాంఘై, తైవాన్, జెనీవాలో ప్రదర్శించనున్నారు. ఇది జూన్ 8న న్యూయార్క్‌లో జరిగే సోథెబీస్ నగల వేలంలో షోపీస్ లాట్‌గా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

ఈ వజ్రం అత్యంత నాణ్యమైనది కావడం విశేషం. ఈ వజ్రం రసాయనికంగా అత్యంత స్వచ్ఛమైనది. ఈ వజ్రం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. చూసేవాళ్లు చూస్తూనే ఉండిపోతారు.. ఈ వజ్రాన్ని న్యూయార్క్‌లోని కళాకారులు తయారు చేశారు. దీన్ని సిద్ధం చేయడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టింది. ఈ వజ్రం అంచనా ధర సుమారు US$ 3.3 మిలియన్లు. ఇది 2022లో హాంకాంగ్‌లోని సోథెబైస్‌లో క్యారెట్‌కు US$5.2 మిలియన్లకు విక్రయించబడింది. అయితే, పింక్ డైమండ్ రహస్యాన్ని నిపుణులు కూడా ఇంకా అర్థం చేసుకోలేదని సమాచారం. డైమండ్‌లో గులాబీ రంగు ఎక్కడి నుంచి వస్తుందనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. భూమి లోపల రాతి ఏర్పడే ప్రక్రియలో ఇది వస్తుందని నమ్ముతారు.

వేలంలో ఇప్పటివరకు అమ్ముడైన మొదటి ఐదు వజ్రాల్లో మూడు పింక్ డైమండ్‌లు ఉన్నాయి. అమెరికాలోని జెమోలాజికల్ ఇన్‌స్టిట్యూట్‌కు జమ చేసిన మొత్తం వజ్రాల్లో 3 శాతం కంటే తక్కువ రంగులు ఉన్నాయి. కాగా, ఇలాంటి గులాబీ రంగు చాలా అరుదైనది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..