Rakesh Jhunjhunwala: 72 బోయింగ్‌ విమానాలకు ఆకాశ ఎయిర్‌ ఆర్డరు.. వాటి విలువ ఎంతంటే..

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా ఆర్థిక మద్దతు గల కొత్త విమానయాన సంస్థ అకాశ ఎయిర్ మంగళవారం 72 '737 మాక్స్' విమానాల కోసం బోయింగ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందాన్ని ఆకాశ ఎయిర్‌, బోయింగ్‌లు ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి...

Rakesh Jhunjhunwala: 72 బోయింగ్‌ విమానాలకు ఆకాశ ఎయిర్‌ ఆర్డరు.. వాటి విలువ ఎంతంటే..
Boeing
Follow us

|

Updated on: Nov 17, 2021 | 10:14 AM

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా ఆర్థిక మద్దతు గల కొత్త విమానయాన సంస్థ అకాశ ఎయిర్ మంగళవారం 72 ‘737 మాక్స్’ విమానాల కోసం బోయింగ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందాన్ని ఆకాశ ఎయిర్‌, బోయింగ్‌లు ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. ఈ ఆర్డరు విలువ దాదాపు 9 బిలియన్‌ డాలర్లని (సుమారు రూ.67,500 కోట్లు) తెలుస్తుంది. దుబాయ్‌ ఎయిర్‌ షో-2021లో ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. ఆర్డర్‌లో 737-8 అధిక సామర్థ్యం గల విమానాలు, 737-8-200 విమానాలు ఉన్నాయి. “మా మొదటి ఎయిర్‌ప్లేన్ ఆర్డర్ కోసం బోయింగ్‌తో భాగస్వామ్యం కావడానికి మేము సంతోషిస్తున్నాం.

అకాశ ఎయిర్ యొక్క వ్యాపార ప్రణాళిక, నాయకత్వ బృందంపై వారి నమ్మకానికి, విశ్వాసానికి ధన్యవాదాలు.” అని అకాశ ఎయిర్ సీఈఓ వినయ్ దూబే అన్నారు. అందుబాటు ధరలో విమానయాన సేవలు అందించేందుకు, వ్యయ నియంత్రణకు 737 మాక్స్‌ విమానాలు మద్దతు ఇవ్వగలవని ఆయన వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో భారతదేశం ఒకటని సీఈఓ వినయ్ దూబే అన్నారు. మేము ఇప్పటికే విమాన ప్రయాణంలో బలమైన పునరుద్ధరణను చూస్తున్నామని చెప్పారు.

ఇండియాలో కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి గత నెలలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ‘నిరభ్యంతర పత్రాన్ని(ఎన్‌ఓసీ)’ ఆకాశ ఎయిర్‌కు ఇచ్చింది. ఈ సంస్థకు రాకేశ్‌తో పాటు ఇండిగో మాజీ అధ్యక్షుడు ఆదిత్య ఘోష్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ మాజీ సీఈఓ వినయ్‌ దూబేలు మద్దతుగా ఉన్నారు. ప్రస్తుతం స్పైస్‌జెట్‌కు మాత్రమే 737 మాక్స్‌ విమానాలు ఉన్నాయి. ఇపుడు ఆకాశ ఎయిర్‌ ఈ విమానాలను కలిగి ఉండే రెండో భారత విమానయాన సంస్థ అవుతుంది. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మాత్రం ఎయిర్‌బస్‌ విమానాలను మాత్రమే వినియోగిస్తోంది.కస్టమర్ అనుభవం, పర్యావరణ సుస్థిరతపై దృష్టి సారించిన ఒక వినూత్న విమానయాన సంస్థ అకాశ ఎయిర్ అని యింగ్ కమర్షియల్ ఎయిర్‌ప్లేన్స్ ప్రెసిడెంట్, CEO స్టాన్ డీల్ అన్నారు.

737 MAX అత్యుత్తమ సామర్థ్యం, విశ్వసనీయతను అందిస్తుంది. అయితే ఇంధన వినియోగం, కార్బన్ ఉద్గారాలు కనీసం 14% తగ్గుతాయని చెప్పారు. బోయింగ్ 2021 కమర్షియల్ మార్కెట్ ఔట్‌లుక్ సూచన ప్రకారం భారతదేశంలో పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ, మధ్యతరగతి వాణిజ్య విమానాల కోసం బలమైన డిమాండ్‌ను పెంచుతాయని పేర్కొంది. రాబోయే 20 సంవత్సరాల్లో దాదాపు 320 బిలియన్ డాలర్ల విలువైన 2,200 కంటే ఎక్కువ కొత్త విమానాలు దక్షిణాసియాలో అవసరమవుతాయని చెప్పింది.

Read Also… Fixed Deposit: మీకు తెలుసా.. ఏటీఎం నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ ఎకౌంట్ ప్రారంభించవచ్చు.. ఎలాగంటే..