జియో ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ ఆఫర్‌పై మల్టీప్లెక్స్‌ల గరం

జియో మాతృసంస్థ రిలయన్స్ తాజాగా జియో ఫైబర్ తో అత్యాధునిక టెక్నాలజీని భారత వినియోగదారుల ముందుంచుతోంది. ఇందులో భాగంగా ప్రీమియం కస్టమర్లకు కొత్త సినిమాలను రిలీజ్ రోజునే ఇంట్లో కూర్చుని వీక్షించే సౌలభ్యం కల్పిస్తున్నారు. దీనిపై మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు ఐనాక్స్, పీవీఆర్ మల్టీప్లెక్స్ లు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశాయి. కొత్త సినిమాలను థియేటర్లలో చూడడం అనేది ఎన్నో ఏళ్లుగా ఓ సంప్రదాయంగా మారిందని, ఇది నిర్మాతలకు, […]

జియో 'ఫస్ట్ డే ఫస్ట్ షో' ఆఫర్‌పై మల్టీప్లెక్స్‌ల గరం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 13, 2019 | 5:45 PM

జియో మాతృసంస్థ రిలయన్స్ తాజాగా జియో ఫైబర్ తో అత్యాధునిక టెక్నాలజీని భారత వినియోగదారుల ముందుంచుతోంది. ఇందులో భాగంగా ప్రీమియం కస్టమర్లకు కొత్త సినిమాలను రిలీజ్ రోజునే ఇంట్లో కూర్చుని వీక్షించే సౌలభ్యం కల్పిస్తున్నారు. దీనిపై మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు ఐనాక్స్, పీవీఆర్ మల్టీప్లెక్స్ లు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశాయి.

కొత్త సినిమాలను థియేటర్లలో చూడడం అనేది ఎన్నో ఏళ్లుగా ఓ సంప్రదాయంగా మారిందని, ఇది నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభదాయకమైన విధానమని ఆ నోట్ లో పేర్కొన్నారు. భారత్ లోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా మొదట థియేటర్లలో, ఆ తర్వాతే డీవీడీలు, ఇతర డిజిటల్ కంటెంట్ రూపాల్లో వస్తుందని తెలిపారు. భారత్‌లో 8 వారాలపాటు థియేటర్లలో ప్రదర్శించిన తర్వాతే డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సినిమా కంటెంట్ రావాలని నిర్ణయం తీసుకున్నారని ప్రెస్ నోట్ లో వివరించారు. ఇప్పుడు ‘జియో ఫస్ట్ డే ఫస్ట్ షో’ నిర్ణయం విచారకరం అని, అయితే, సినిమాకు నిర్మాతే యజమాని కాబట్టి తుది నిర్ణయం నిర్మాతదేనని మల్టీప్లెక్స్ లు స్పష్టం చేశాయి.