AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్యాసింజర్‌ ఆటోమొబైల్ సేల్స్ ఢమాల్!

దేశంలో ఆటోమొబైల్ విక్రయాలు గణనీయంగా తగ్గుతున్నాయి. వరుసగా తొమ్మిదో నెల కూడా ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు పడిపోయాయి. జులైలో కేవలం 2,00,790 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 2018లో జులైలో విక్రయమైన 2,90,931 యూనిట్లతో పోలిస్తే ఇది 30.98శాతం తక్కువ అని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మానుఫాక్చరర్స్‌(సియామ్‌) వెల్లడించింది. దేశీయ కార్ల విక్రయాలు 35.95శాతం తగ్గి 1,22,956 యూనిట్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది జులై నెలలో ఈ విక్రయాలు 1,91,979 యూనిట్లుగా నమోదయ్యాయి. 2018 జులై నెలలో […]

ప్యాసింజర్‌ ఆటోమొబైల్ సేల్స్ ఢమాల్!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 13, 2019 | 8:19 PM

Share

దేశంలో ఆటోమొబైల్ విక్రయాలు గణనీయంగా తగ్గుతున్నాయి. వరుసగా తొమ్మిదో నెల కూడా ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు పడిపోయాయి. జులైలో కేవలం 2,00,790 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 2018లో జులైలో విక్రయమైన 2,90,931 యూనిట్లతో పోలిస్తే ఇది 30.98శాతం తక్కువ అని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మానుఫాక్చరర్స్‌(సియామ్‌) వెల్లడించింది.

దేశీయ కార్ల విక్రయాలు 35.95శాతం తగ్గి 1,22,956 యూనిట్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది జులై నెలలో ఈ విక్రయాలు 1,91,979 యూనిట్లుగా నమోదయ్యాయి. 2018 జులై నెలలో 18,17,406యూనిట్ల ద్విచక్రవాహనాలు అమ్ముడవగా.. గత నెలలో ఆ సంఖ్య 16.82శాతం తగ్గి 15,11,692 యూనిట్లుగా ఉంది. కమర్షియల్‌ వాహనాల విక్రయాలు కూడా 25.71శాతం తగ్గి 56,866 యూనిట్లుగా నమోదయ్యాయి. అన్ని కేటగిరిల్లో కలిపి జులైలో వాహన విక్రయాలు 18.71శాతం తగ్గాయి.

అయితే… ఆటోమొబైల్‌ రంగంలో ఇంత తక్కువ స్థాయిలో అమ్మకాలు జరగడం 19ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరిసారిగా 2000 సంవత్సరం డిసెంబరులో ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు 35శాతం పడిపోయాయి. గిరాకీ లేకపోవడంతో ఆటోమొబైల్‌ సంస్థల వద్ద నిల్వలు పేరుకుపోతున్నాయి. దీంతో ఉత్పత్తిని తగ్గించాలని కంపెనీలు భావిస్తున్నాయి. మరోవైపు ఆటోమొబైల్‌ వాహనాలపై జీఎస్‌టీని తగ్గించాలని పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Follow Us
చింతగింజలు పారేస్తున్నారా? అందులోని పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు
చింతగింజలు పారేస్తున్నారా? అందులోని పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు
యాపిల్‌ వాచ్‌ లవర్స్‌కి మతిపోగొట్టే న్యూస్
యాపిల్‌ వాచ్‌ లవర్స్‌కి మతిపోగొట్టే న్యూస్
తొలి టీ20కు ముందే భారత్‌కు డేంజర్ బెల్.. డేంజర్ ప్లేయర్ ఎంట్రీ..!
తొలి టీ20కు ముందే భారత్‌కు డేంజర్ బెల్.. డేంజర్ ప్లేయర్ ఎంట్రీ..!
బంగారం ధరలకు మళ్లీ బూస్ట్? 2027లో భారీగా పుంజుకునే అవకాశం..
బంగారం ధరలకు మళ్లీ బూస్ట్? 2027లో భారీగా పుంజుకునే అవకాశం..
వెస్టిండీస్‌తో తొలి టీ20లో భారత ఓపెనింగ్ జోడీ ఇదే: శ్రేయాస్
వెస్టిండీస్‌తో తొలి టీ20లో భారత ఓపెనింగ్ జోడీ ఇదే: శ్రేయాస్
మోసపూరిత వాటర్ బిల్లులను గుర్తించడం ఎలా?
మోసపూరిత వాటర్ బిల్లులను గుర్తించడం ఎలా?
దీపావళికి బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? చౌకైన 5 బైక్‌లు ఇవే!
దీపావళికి బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? చౌకైన 5 బైక్‌లు ఇవే!
Video: బాల్కనీ నుంచి జారిపడిన బాలుడు.. క్షణాల్లో కాపాడిన యువకుడు
Video: బాల్కనీ నుంచి జారిపడిన బాలుడు.. క్షణాల్లో కాపాడిన యువకుడు
'రామాయణ’ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. అసలేం జరిగిందంటే?
'రామాయణ’ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. అసలేం జరిగిందంటే?
హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సామ్ కోషి
హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సామ్ కోషి