AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: ఈ బిజినెస్‌కు ఇప్పుడు భారీ డిమాండ్‌.. నష్టం లేని వ్యాపారం.

ముఖ్యంగా చిన్న కుటుంబాలు, స్వంత గ్రామాలకు దూరంగా నివసిస్తున్న వారు చిన్నారులను ప్రీ స్కూల్స్‌లో వేస్తున్నారు. వృత్తిరీత్య ఇంట్లో భార్యభర్తలిద్దరూ బయటకు వెళ్లడంతో పిల్లల్ని సాయంత్రం వరకు ప్రీ స్కూల్స్‌లో జాయిన్‌ చేస్తున్నారు. వీటినే డే కేర్ సెంటర్లుగా కూడా పిలుస్తుంటారు. ఇటీవల వీటికి డిమాండ్‌ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం పెద్ద పెద్ద పట్టణాలకే పరిమితమైన ఈ ట్రెండ్ ఇప్పుడు చిన్న పట్టణాలకూ వచ్చేసింది...

Business Idea: ఈ బిజినెస్‌కు ఇప్పుడు భారీ డిమాండ్‌.. నష్టం లేని వ్యాపారం.
Business Idea
Narender Vaitla
|

Updated on: Nov 23, 2023 | 10:12 AM

Share

ప్రస్తుతం కాలం మారుతోంది, రోజురోజుకీ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో రెండు చేతులా సంపాదించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక భార్య, భార్తలిద్దరూ ఉద్యోగం చేయడం అనివార్యంగా మారింది. ఒకప్పటిలా కాకుండా మహిళలు కూడా ఉన్నత చదువులు చదువుతున్నారు. దీంతో భర్తలతో సమానంగా, ఆమాటకొస్తే భర్తలకంటే ఎక్కువ ఆర్జించే వారు కూడా ఉన్నారు. దీంతో పిల్లల సంరక్షణ కోసం పేరెంట్స్‌ ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాల్సి పరిస్థితి వచ్చింది.

ముఖ్యంగా చిన్న కుటుంబాలు, స్వంత గ్రామాలకు దూరంగా నివసిస్తున్న వారు చిన్నారులను ప్రీ స్కూల్స్‌లో వేస్తున్నారు. వృత్తిరీత్య ఇంట్లో భార్యభర్తలిద్దరూ బయటకు వెళ్లడంతో పిల్లల్ని సాయంత్రం వరకు ప్రీ స్కూల్స్‌లో జాయిన్‌ చేస్తున్నారు. వీటినే డే కేర్ సెంటర్లుగా కూడా పిలుస్తుంటారు. ఇటీవల వీటికి డిమాండ్‌ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం పెద్ద పెద్ద పట్టణాలకే పరిమితమైన ఈ ట్రెండ్ ఇప్పుడు చిన్న పట్టణాలకూ వచ్చేసింది. దీనిని మంచి బిజినెస్‌ ఐడియాగా మార్చుకుంటే మంచి లాభాలు పొందొచ్చు.

డే కేర్‌ సెంటర్స్‌లో ఎన్నో ప్రముఖ సంస్థలకు చెందిన ఫ్రాంచైజీలు అందుబాటులో ఉన్నాయి. ఫ్రాంచైజీలపై ఆధారపడకుండా సొంత బ్రాండ్‌పై కూడా డే కేర్‌ సెంటర్లను స్థాపించుకోవచ్చు. రానున్న రోజుల్లో ప్రీ స్కూల్స్ బిజినెస్‌ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్ఉన్నారు. ఒకవేళ ఏదైనా బ్రాండ్‌కు చెందిన ఫ్రాంచైజీని తీసుకుంటే ప్రీ స్కూల్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలు, డిజటల్‌ మార్కెటింగ్‌ వంటి అన్ని వారే చూసుకుంటారు. మంచి నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులను సైతం వారే అందిస్తారు.

ఇక సొంతంగా ప్రీ స్కూల్‌ను ప్రారంభిస్తే మాత్రం అన్ని మీరే చూసుకోవాల్సి ఉంటుంది. ప్రీ స్కూల్ ఏర్పాటు చేయడానికి ఒక ఇండిపెండెంట్‌ ఇల్లు అందుబాటులో ఉంటే సరిపోతుంది. సుమారు రూ. 5 లక్షల ప్రాథమిక పెట్టుబడితో ప్రీ స్కూల్‌ను ప్రారంభించవచ్చు. అయితే చిన్నారుల భద్రత విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం సెక్యూరిటీ గార్డ్‌ను నియమించుకోవాలి. ప్రీ స్కూల్స్‌ నుంచి పేరెంట్స్‌ ఆశించేది కూడా ఇదే.

ప్రీ స్కూల్‌ను ఒకసారి ఏర్పాటు చేస్తే.. నిరంతరం లాభాలు పొందొచ్చు. ఇక ప్రీ స్కూల్స్‌లో ఉపాధ్యాలయుతో పాటు ఆయాలు కూడా కచ్చితంగా ఉండాలి. ఆరేళ్లలోపు చిన్నారులనే ఇందులో చేర్పిస్తారు కాబట్టి వారికి అవసరమైన అన్ని రకాల పనులను చూసుకోవడానికి, చిన్నారుల సంఖ్య ఆధారంగా ఆయాలను నియమించుకోవాలి. పిల్లల సంరక్షణ చూసుకోవడంలో వీరిదే కీలకపాత్ర ఉంటుంది. చిన్నారుల సంరక్షణకు పెద్దపీట వేస్తూ, వారికి నైపుణ్యాలు నేర్పించే ప్రీస్కూల్స్‌కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని గుర్తించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..