India Post: సీనియర్‌ సిటిజన్స్‌కు గుడ్‌న్యూస్‌.. పోస్టాఫీసుకు వెళ్లకుండా కుటుంబ సభ్యులు ఈ పనులు చేయవచ్చు

India Post: సీనియర్‌ సిటిజన్స్‌కు పోస్టల్‌ శాఖ గుడ్‌న్యూస్‌ తెలిపింది. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌( పీపీఎఫ్‌), సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ ఫండ్స్‌ (ఎస్‌ఈఎస్‌ఎస్‌)..

India Post: సీనియర్‌ సిటిజన్స్‌కు గుడ్‌న్యూస్‌.. పోస్టాఫీసుకు వెళ్లకుండా కుటుంబ సభ్యులు ఈ పనులు చేయవచ్చు
India Post
Follow us
Subhash Goud

|

Updated on: Sep 12, 2021 | 12:52 PM

India Post: సీనియర్‌ సిటిజన్స్‌కు పోస్టల్‌ శాఖ గుడ్‌న్యూస్‌ తెలిపింది. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌( పీపీఎఫ్‌), సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ ఫండ్స్‌ (ఎస్‌ఈఎస్‌ఎస్‌)ను విత్‌ డ్రా చేసుకోవాలంటే ఖాతాదారుడు ఇక నుంచి పోస్టాఫీసుకు రావాల్సిన అవసరం లేదని ఇండియన్‌ పోస్ట్‌ ఆఫీస్‌ ప్రకటించింది. సాధారణంగా పీపీఎఫ్‌, ఎస్‌ఈఎస్‌ఎస్‌ ఫండ్‌ను విత్‌ డ్రా చేసుకోవాలంటే పోస్టాఫీస్‌కు వెళ్లాల్సి వచ్చేది. వీటితో పాటు ట్రాన్సాక్షన్లు నిర్వహించని అకౌంట్లు, లేదంటే అత్యవసర పరిస్థితుల్లో ఖాతాలను క్లోజ్‌ చేయాలంటే పోస్టాఫీసులకు రావాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో 60 సంవత్సరాలు దాటిన సీనియర్‌ సిటిజన్లు వయస్సు రిత్యా పోస్టాఫీస్‌లకు రావాలంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇండియన్‌ పోస్ట్‌ ప్రకటనతో సీనియర్‌ సిటిజన్లకు ఊరటనిచ్చినట్లయింది.

ఈ రెండు స్కీమ్‌లలో విత్‌డ్రా, క్లోజ్‌..

కాగా, రెండు స్కీమ్‌ల నుంచి లావాదేవీల ఉపసంహరణ, ఖాతాను క్లోజ్‌ చేయడం చేసుకోవాలంటే సీనియర్‌ సిటిజన్స్‌ పోస్టా్‌ఆఫస్‌కు రావాల్సిన అవసరం లేదని, వారికి బదులు కుటుంబ సభ్యులు ఉంటే సరిపోతుందని తెలిపింది. ఖాతాలను క్లోజ్‌ చేయడంతో పాటు డబ్బులను ఉపసంహరించుకోవడం లాంటివి వారి కుటుంబ సభ్యులు చేసుకోవచ్చని తెలిపింది. కుటుంబసభ్యులు విత్‌ డ్రా చేసిన నగదును చెక్కుద్వారా, ఖాతదారుడు భద్రత కోసం పోస్ట్‌ ఆఫీస్‌ సేవింగ్స్‌ అకౌంట్‌ లేదా, బ్యాంక్‌ అకౌంట్‌లో జమ చేస్తున్నట్లు తెలిపింది.

పోస్టాఫీస్‌కు వెళ్లకుండా నగదును విత్‌డ్రా ఎలా చేసుకోవాలి..?

పోస్ట్‌ఆఫీస్‌ నుంచి పీపీఎఫ్‌ లేదా ఎస్‌సీఎస్‌ఎస్‌ నిధులను సేకరించేలా కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చేందుకు ఈ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. వయసు రిత్యా తాము పోస్టాఫీసుకు వెళ్లలేకపోతున్నామని, తనకు బదులుగా మనీ విత్‌డ్రా చేసే హక్కు భార్య లేదంటే ఇంట్లో కుటుంబ సభ్యులకు హక్కు ఉందని నిర్ధారిస్తూ పోస్టాఫీసులో ఫారమ్‌SB-12 పై సీనియర్‌ సిటిజన్‌ సంతకం చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ఖాతాదారుని అకౌంట్‌ క్లోజ్‌ చేసేందుకు, పాక్షిక నగదు ఉపసంహరణకు SB-7ఫారమ్‌ పై,SB-7B ఫారమ్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. అలాగే సీనియర్‌ సిటిజన్‌ ఐడీ ఫ్రూఫ్‌, అడ్రస్‌ ఫ్రూప్‌తో పాటు సీనియర్‌ సిటిజన్‌ కుటుంబ సభ్యుడి వివరాలు తెలుపుతూ జత చేయాల్సి ఉంటుంది. ఇక మనీ విత్‌డ్రా చేసే వ్యక్తి పాస్‌ బుక్‌ కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇక లావాదేవీలను ప్రాసెస్‌ చేసే ముందు పోస్టల్‌ అధికారులు చెక్‌ చేస్తారు. అనంతరం నగదు విత్‌డ్రా చేసేందుకు అనుమతి ఇస్తారు. ఇలాంటి ప్రాసెస్‌తో సీనియర్‌ సిటిజన్స్‌ ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యుల ద్వారా లావాదేవీలకు సంబంధించిన పనులు చేసుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి:Atal Beemit Vyakti Kalyan Yojana: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. నిరుద్యోగులకు గూడ్‌న్యూస్‌

PF Customers: పీఎఫ్‌ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఆ గడువు డిసెంబర్‌ 31 వరకు పొడిగింపు..!

Lic Housing Loan: హోమ్‌ లోన్‌ కావాలనుకునే వారికి ఎల్‌ఐసీ బంపర్‌ ఆఫర్‌.. వారికి మాత్రమే..!