AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office: ఈ పోస్టాఫీసు పథకాలలో పెట్టుబడి మీ భవితకు రాబడి.. తక్కువ సమయంలో రెట్టింపు ఆదాయం..

Post Office: పోస్ట్ ఆఫీస్ అనేక చిన్న మొత్తాల పొదుపు పథకాలను అమలు చేస్తుంది. ఇందులో పెట్టుబడిదారులు కొంత డబ్బును డిపాజిట్ చేయడం ద్వారా బంపర్ రాబడిని

Post Office: ఈ పోస్టాఫీసు పథకాలలో పెట్టుబడి మీ భవితకు రాబడి.. తక్కువ సమయంలో రెట్టింపు ఆదాయం..
Post Office
uppula Raju
|

Updated on: Nov 09, 2021 | 10:16 PM

Share

Post Office: పోస్ట్ ఆఫీస్ అనేక చిన్న మొత్తాల పొదుపు పథకాలను అమలు చేస్తుంది. ఇందులో పెట్టుబడిదారులు కొంత డబ్బును డిపాజిట్ చేయడం ద్వారా బంపర్ రాబడిని పొందవచ్చు. తపాలా శాఖ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నందున పోస్టాఫీసు పొదుపు పథకాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. దీని వడ్డీ రేట్లను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. తాజా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ఇన్వెస్టర్లు ఇప్పటికే ఆర్జిస్తున్న వడ్డీ ఈ త్రైమాసికంలో కూడా కొనసాగుతుంది. చిన్న పొదుపు పథకాలపై ప్రభుత్వం రాబడికి హామీ ఇస్తుంది. దీని కారణంగా పెట్టుబడిదారులు ఆందోళన చెందకుండా డబ్బును డిపాజిట్ చేస్తారు. పెద్ద బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ లభించే అనేక పథకాలు ఇందులో ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు కూడా పోస్టాఫీసు పొదుపు పథకాలతో పోటీ పడలేవు. అలాంటి కొన్ని పథకాలను తెలుసుకుందాం.

1. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD) అనేది భారతదేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు అందించే ఒక రకమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ లాంటిది. పెట్టుబడిదారులు 5.5 శాతం వడ్డీని పొందాలంటే 1 నుంచి 3 సంవత్సరాల కాలానికి ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఐదేళ్ల డిపాజిట్‌పై పెట్టుబడిదారులు 6.7 శాతం వడ్డీని పొందవచ్చు. అంటే ఈ పథకంలో పెట్టుబడిదారుల డబ్బు దాదాపు 10.75 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది.

2. పోస్టాఫీసు సేవింగ్స్ బ్యాంక్ ఖాతా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా పెట్టుబడిదారులకు తమ డబ్బును బ్యాంకు ఖాతాలో పొదుపు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే పెట్టుబడిదారులు తమ పెట్టుబడిపై వార్షిక రాబడిని 4% మాత్రమే పొందుతారు. అంటే వారి పెట్టుబడి 18 సంవత్సరాలలో దాదాపు రెట్టింపు అవుతుంది.

3. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అత్యంత ప్రజాదరణ పొందిన పెట్టుబడి పథకాలలో ఒకటి. ఇందులో పెట్టుబడులపై 5.8% వార్షిక వడ్డీని అందిస్తోంది. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన మొత్తం 12.41 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది.

4. పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం (MIS) పోస్ట్ ఆఫీస్ ప్రస్తుతం నెలవారీ ఆదాయ పథకం (MIS)లో 6.6% వార్షిక వడ్డీని అందిస్తోంది. పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకంలో పెట్టుబడిదారుల డబ్బు సుమారు 10.91 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది.

5. పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ప్రస్తుతం సీనియర్ల కోసం పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)లో పెట్టుబడిదారులు 7.4% వడ్డీని పొందుతారు. ప్రస్తుత వడ్డీ రేట్ల ప్రకారం దాదాపు 9.73 ఏళ్లలో పెట్టుబడి మొత్తం రెట్టింపు అవుతుంది.

అలసట, నీరసం తరచుగా వస్తే ఆ వ్యాధికి గురైనట్లే..! వెంటనే ఈ విషయాలు తెలుసుకోండి..

NPCIL Recruitment 2021: ఐటీఐ విద్యార్థులకు గమనిక.. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..

చలికాలంలో మీకు దాహం వేయకపోవచ్చు.. కానీ కచ్చితంగా నీరు తాగాలి.. లేదంటే మీ పని అంతే..