5G Mobile: మొదటి దేశీయ 5జీ మొబైల్ వచ్చేసింది.. ధర ఎంతంటే.. ఎలా బుక్ చేసుకోవాలంటే..
మన మార్కెట్లో 5జీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని మనకు తెలుసు.. కానీ వాటిలో దేశీయ కంపెనీ తయారు చేసిన 5జీ ఫోన్ ఒక్కటి కూడా లేదు. అయితే ఇప్పుడు ఆ లోటును ఓ కంపెనీ భర్తీ చేసింది...
మన మార్కెట్లో 5జీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని మనకు తెలుసు.. కానీ వాటిలో దేశీయ కంపెనీ తయారు చేసిన 5జీ ఫోన్ ఒక్కటి కూడా లేదు. అయితే ఇప్పుడు ఆ లోటును ఓ కంపెనీ భర్తీ చేసింది. భారత మార్కెట్లోకి 5జీ స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చిన తొలి స్వదేశీ సంస్థగా లావా ఇంటర్నేషనల్ అరుదైన ఘనత సాధించింది. అగ్ని 5జీ పేరుతో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
ప్రపంచంలో ‘మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్’పై 5జీ స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చిన రెండో కంపెనీ లావాయేనని సంస్థ అధ్యక్షుడు, బిజినెస్ హెడ్ సునీల్ రైనా చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్ నొయిడాలోని సంస్థ ప్లాంట్‌లో దీన్ని తయారు చేశారు. భారత వినియోగదారులకు స్వదేశంలో రూపొందించిన 5జీ మొబైల్‌ను అందుబాటులోకి తీసుకురావాలనే అగ్నిని లాంచ్ చేసినట్లు తెలిపారు.
నవంబరు 18 నుంచి రిటైల్ ఔట్లెట్లతో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో లావా అగ్ని ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఆలోపు లావా ఈ-స్టోర్‌లో ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. అమెజాన్‌లోనైతే రూ.500 చెల్లించి ప్రీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 9-17 మధ్య ప్రీ బుకింగ్స్ అందుబాటులో ఉన్నాయి.
అగ్ని ధర రూ.19,999గా నిర్ణయించినట్లు లావా పేర్కొంది. ప్రస్తుతం భారత మార్కెట్‌ను శాసిస్తున్న చైనా మొబైల్ సంస్థలకు దీటుగా ఉండాలనే ఇంత తక్కువకు 5జీ స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చినట్లు చెప్పింది. ప్రీబుకింగ్ చేసుకునేవారికి ధర.. రూ.17,999లకే ఈ మొబైల్‌ను అందించనున్నారు.
ఫోన్ ఫీచర్స్:
- గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో 6.78 అంగుళాల డిస్ప్లే
- మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్
- 8జీబీ రామ్, 128 జీబీ మెమొరీ
- 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపీ డెప్త్ కెమెరా, 2ఎంపీ మాక్రో కెమెరా
- 16మెగాపిక్సెల్ ఫ్రంట్(సెల్ఫీ) కెమెరా5000mAh బ్యాటరీ30W సూపర్ ఫాస్ట్ ఛార్జర్
Read also.. Stock Markets: జోరులో స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడి పెట్టేముందు స్టాక్స్ గురించి పూర్తిగా తెలుసుకోండి!