AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Scheme: బంపర్ స్కీమ్‌.. కేవలం 10 ఏళ్లలో రూ.25 లక్షలకుపైగా సంపాదించే మార్గం గురించి మీకు తెలుసా?

Best Scheme: మదుపరులకు నమ్మకమైన, సురక్షితమైన పెట్టుబడి మార్గాల్లో పోస్ట్ ఆఫీస్‌ అందించే స్కీమ్‌. ముఖ్యంగా మధ్యతరగతి, జీతాలు వచ్చే వారికి ఇది ఒక అద్భుతమైన పొదుపు సాధనంగా నిలుస్తోంది. ప్రభుత్వ మద్దతు ఉండటంతో ఇందులో రిస్క్ ఉండదు, పైగా స్థిరమైన రాబడిని పొందవచ్చు..

Best Scheme: బంపర్ స్కీమ్‌.. కేవలం 10 ఏళ్లలో రూ.25 లక్షలకుపైగా సంపాదించే మార్గం గురించి మీకు తెలుసా?
ఒకవేళ వీరే ప్రైవేట్ రంగ ఉద్యోగులైతే 60 ఏళ్ల తర్వాత వారి నెలసరి జీతం ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ పరిస్థితిలో పదవీ విరమణ తర్వాత ప్రజలకు ఆర్థిక సమస్యలు రాకుండా ఉండేందుకు అనేక రకాల పింఛను పథకాలు అమలులో ఉన్నాయి. అటువంటి పథకాలలో ఒకటి అటల్ పింఛను యోజన (APY). ఈ పథకంలో ప్రతిరోజూ రూ.7 పెట్టుబడి పెట్టి, నెలకు రూ.5,000 పింఛను ఎలా పొందాలో చూద్దాం..
Subhash Goud
|

Updated on: Mar 23, 2026 | 8:58 AM

Share

Best Scheme: భద్రతతో కూడిన పెట్టుబడులను కోరుకునే వారికి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకం ఇప్పటికీ అత్యంత విశ్వసనీయమైన ప్రభుత్వ మద్దతు ఉన్న సేవింగ్ ఆప్షన్‌గా నిలుస్తోంది. చిన్న మొత్తాలతో ప్రారంభించి, దీర్ఘకాలంలో పెద్ద నిధిని సృష్టించుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశాన్ని అందిస్తుంది.

రూ.25 లక్షలకు చేరుకునే పెట్టుబడి ప్రణాళిక

దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు 10 సంవత్సరాల కాలపరిమితి అత్యధిక లాభాలను ఇస్తుంది. ప్రతి నెల కేవలం రూ.15,000 చొప్పున డిపాజిట్ చేస్తే 120 నెలల తర్వాత మొత్తం మెచ్యూరిటీ విలువ సుమారు రూ.25,68,107కి చేరుతుంది.

ఇది కూడా చదవండి: Lifestyle: రూ.35 వేల కోట్లకుపైగా ఆస్తులు.. భార్యా పిల్లలతో నార్మల్ లైఫ్.. కారణం తెలిస్తే అవాక్కవుతారు!

ఇవి కూడా చదవండి
  • మొత్తం పెట్టుబడి: రూ.18,00,000
  • వడ్డీ ఆదాయం: రూ.7,68,107

త్రైమాసిక కాంపౌండింగ్ వల్ల ఈ భారీ వడ్డీ లభిస్తుంది. మొదట పోస్టాఫీస్ RD కాలపరిమితి 5 సంవత్సరాలే అయినప్పటికీ, మరో 5 సంవత్సరాలు పొడిగించడం ద్వారా ఈ ప్రయోజనం పొందవచ్చు.

5 ఏళ్లలో కూడా మంచి రాబడి:

కేవలం 5 సంవత్సరాల పాటు ప్రతి నెల రూ.15,000 చెల్లించినా, మంచి రాబడిని పొందవచ్చు.

  • మొత్తం పెట్టుబడి: రూ.9,00,000
  • మెచ్యూరిటీ విలువ: సుమారు రూ.10,71,545
  • వడ్డీ ఆదాయం: రూ.1.7 లక్షలకు పైగా

ముఖ్య ప్రయోజనాలు:

  1. చిన్న మొత్తంతో ప్రారంభం: ఈ పథకంలో నెలకు కేవలం రూ.100తో కూడా ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి లేకపోవడం వల్ల ఆదాయం పెరిగే కొద్దీ పెట్టుబడిని కూడా పెంచుకోవచ్చు.
  2. లోన్ సౌకర్యం: 12 నెలల పాటు క్రమంగా డిపాజిట్ చేసిన తర్వాత ఖాతాలో ఉన్న మొత్తం నుండి 50% వరకు లోన్ తీసుకునే అవకాశం ఉంది.
  3. అడ్వాన్స్ చెల్లింపులు: ప్రతి నెల చెల్లింపుల ఇబ్బందిని తగ్గించేందుకు, ముందుగానే 5 సంవత్సరాల వరకు ఇన్‌స్టాల్‌మెంట్లు చెల్లించవచ్చు.
  4. గ్యారంటీడ్ రిటర్న్స్: మార్కెట్‌పై ఆధారపడని ఈ స్కీమ్‌లో రాబడులు ముందుగానే నిర్ధారితమవుతాయి. దీంతో మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం ఉండదు.

పోస్టాఫీస్ RD పథకం క్రమశిక్షణతో కూడిన సేవింగ్స్ అలవాటు పెంపొందించడమే కాకుండా, భవిష్యత్తుకు బలమైన ఆర్థిక భద్రతను అందిస్తుంది. చిన్న మొత్తాలతో ప్రారంభించి, నిరంతర పెట్టుబడితో 10 ఏళ్లలో రూ.25 లక్షలకు పైగా సంపాదించడం సాధ్యమవుతుంది. సురక్షితమైన, స్థిరమైన రాబడులు కోరుకునే వారికి ఇది ఉత్తమ ఎంపికగా నిలుస్తోంది.

  1. నెలవారీ పెట్టుబడి: రూ.15,000
  2. కాలపరిమితి: రూ.10 ఏళ్లు (120 నెలలు)
  3. మొత్తం పెట్టుబడి: రూ.18,00,000
  4. వడ్డీ ద్వారా వచ్చే లాభం: రూ.7,68,107
  5. మెచ్యూరిటీ మొత్తం: రూ.25,68,107

ఇది కూడా చదవండి: Gold Price Today: ఎన్నడు లేని విధంగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పెట్రోల్బైకు వీడ్కోలు.. సింగిల్‌ ఛార్జింగ్‌తో 212 కి.మీ. మైలేజీ!
పెట్రోల్బైకు వీడ్కోలు.. సింగిల్‌ ఛార్జింగ్‌తో 212 కి.మీ. మైలేజీ!
యాంకరమ్మ బ్యాడ్ లక్.. స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్సయ్యింది.
యాంకరమ్మ బ్యాడ్ లక్.. స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్సయ్యింది.
మీ పెంపుడు జంతువు మాట్లాడితే?సరికొత్త పెట్ ట్రాన్స్‌లేటర్ మీ కోసం
మీ పెంపుడు జంతువు మాట్లాడితే?సరికొత్త పెట్ ట్రాన్స్‌లేటర్ మీ కోసం
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. అక్కడ కూడా దర్శనం టికెట్లు
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. అక్కడ కూడా దర్శనం టికెట్లు
నిజమా.. గర్భిణీ స్త్రీలను పాము కరవదా..? అసలు వాస్తవాలు..
నిజమా.. గర్భిణీ స్త్రీలను పాము కరవదా..? అసలు వాస్తవాలు..
మృగశిర నక్షత్రంలోకి బుధుడు.. వీరికి పట్టింది బంగారమే!
మృగశిర నక్షత్రంలోకి బుధుడు.. వీరికి పట్టింది బంగారమే!
వంటగదిలో బొద్దింకలా? వాస్తు ప్రకారం ఇది ఆర్థిక సమస్యలకు సంకేతమట!
వంటగదిలో బొద్దింకలా? వాస్తు ప్రకారం ఇది ఆర్థిక సమస్యలకు సంకేతమట!
ఆ జట్టుతో ప్లేఆఫ్స్ ఆడడం కంటే బౌలర్లకు రిటైర్మెంట్ ఇవ్వడం బెటర్
ఆ జట్టుతో ప్లేఆఫ్స్ ఆడడం కంటే బౌలర్లకు రిటైర్మెంట్ ఇవ్వడం బెటర్
మీకు రూ.50 లక్షల ఎస్‌బీఐ హోమ్‌ లోన్‌ పొందడానికి ఎంత జీతం ఉండాలి?
మీకు రూ.50 లక్షల ఎస్‌బీఐ హోమ్‌ లోన్‌ పొందడానికి ఎంత జీతం ఉండాలి?
రౌడీ జనార్ధనలో ఆ క్రేజీ హీరోయిన్ స్పెషల్ సాంగ్..
రౌడీ జనార్ధనలో ఆ క్రేజీ హీరోయిన్ స్పెషల్ సాంగ్..