AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

POCO F3 GT: పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్‌.. ముందే లీకైన స్పెసిఫికేషన్స్ వివరాలు.. విడుదల ఎప్పుడంటే

POCO F3 GT: కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలు కొత్త కొత్త మోడళ్ల ఫోన్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. తాజాగా ..

POCO F3 GT: పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్‌.. ముందే లీకైన స్పెసిఫికేషన్స్ వివరాలు.. విడుదల ఎప్పుడంటే
POCO F3 GT
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 15, 2021 | 2:35 PM

Share

POCO F3 GT: కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలు కొత్త కొత్త మోడళ్ల ఫోన్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. తాజాగా పోకో ఎఫ్‌3 జీటీ పేరుతో మార్కెట్లో విడుదల కానుంది. అయితే ఈ స్మార్ట్​ఫోన్​ను ఆగస్టు 10 లోపు విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఖచ్చితమైన విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. ఇటీవల చైనాలో లాంచ్​ అయిన రెడ్​మీ కే 40 గేమ్​ ఎన్​హేన్స్​డ్ ఎడిషన్​కు రీ బ్రాండెడ్​ వెర్షన్​గా ఈ ఫోన్​ విడుదల కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన టీజర్​ వీడియోలో కూడా సంస్థ ఇదే విషయాన్ని పేర్కొంది. అయితే స్పెసిఫికేషన్స్ వివరాలు ముందుగానే లీకయ్యాయి.

ఐదు వేరియంట్లలో లభ్యం:

కాగా, ఈ ఫోన్‌ ఐదు వేరియంట్లలో లభించనుంది. విడుదలకు సిద్దంగా ఉన్న పోకో ఎఫ్​3 జిటి (POCO F3gt)మోడల్​ కూడా రెడ్​మీ కే 40 ధరతో సమానంగా లభించే అవకాశం ఉంది. చైనా మార్కెట్​లో రెడ్​మీ కే40 ధర.. 6 జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్ బేస్​ వేరియంట్ ధర సుమారు రూ. 23,000కు లభిస్తుంది. పోకో ఎఫ్ 3 జిటి ఇండియా ధర రూ.25 వేల నుంచి రూ .30,000 మధ్య ఉండే అవకాశం ఉంది.

POCO F3 GT స్పెసిఫికేషన్లు:

పోకో ఎఫ్‌ 3జీటీ (POCO F3 GT) స్మార్ట్​ఫోన్​లో 6.67 అంగుళాల ఫుల్​ హెచ్‌డీ+AMOLED డిస్‌ప్లేను అందించనున్నారు. ఇది ఆక్టాకోర్​ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 SoC ప్రాసెసర్​పై పనిచేస్తుంది. దీనిలో12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వరకు అందించింది. ఇక దీనిలో 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,065 mAh బ్యాటరీని అందించింది.

కెమెరా విషయానికి వస్తే.. దీని వెనుకవైపు, ట్రిపుల్ కెమెరా సెటప్​ను చేర్చింది. ఇది 64MP ప్రైమరీ లెన్స్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ సెన్సార్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 2 ఎంపి మైక్రో కెమెరాను కూడా ప్యాక్ చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్​ కోసం 16 మెగాపిక్సెల్​ కెమెరాను చేర్చింది. 5జీ, వైఫై, జీపీఎస్​, ఎన్​ఎఫ్​సీ, యూఎస్​బీ టైప్​సీ పోర్ట్​లను అందించింది. ఇది ఆండ్రాయిడ్ 11 బేస్డ్ MIUI 12.5తో రన్‌ అవుతుంది.

ఇవీ కూడా చదవండి:

Samsung Galaxy A22: సాంసంగ్‌ నుంచి గెలక్సీ ఏ22 మొబైల్‌.. అదిరిపోయే ఫీచర్స్‌.. విడుదల ఎప్పుడంటే..!

Infosys: గ్రాడ్యుయేట్ల‌కు గుడ్ న్యూస్‌.. 35వేల మందికి ఉద్యోగ అవకాశాలు: ఇన్ఫోసిస్‌

ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి