Electric Scooter: సమయం లేదు మిత్రమా.. ఈ-స్కూటర్ కొనాలంటే ఇప్పుడే కొనేయండి..
ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ద్వారా మీరు ఏడాదికి రూ. 16,200 వరకూ ఆదా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలా అంటే మీరు ప్రతి రోజూ 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వారైతే.. అందుకయ్యే ఖర్చును లెక్కిస్తే ఇది తెలుస్తోంది. ఒక యూనిట్ విద్యుత్ చార్జి రూ. 10 అనుకుంటే.. ఒక లీటర్ పెట్రోల్ రేటు రూ. 100గా ఉంది. ఈ నేపథ్యంలో ఒక ఏడాదిలో భారీగా ఖర్చు తగ్గించుకోవచ్చు.

భారతదేశంలో విద్యుత్ శ్రేణి వాహనాలు తమ ముద్ర వేస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు గత కొన్నేళ్లుగా మార్కెట్లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇవి పర్యావరణ హితం కావడంతో పాటు వీటి నిర్వహణ, రన్నింగ్ ఖర్చు చాలా పరిమితం కావడం. ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ద్వారా మీరు ఏడాదికి రూ. 16,200 వరకూ ఆదా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలా అంటే మీరు ప్రతి రోజూ 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వారైతే.. అందుకయ్యే ఖర్చును లెక్కిస్తే ఇది తెలుస్తోంది. ఒక యూనిట్ విద్యుత్ చార్జి రూ. 10 అనుకుంటే.. ఒక లీటర్ పెట్రోల్ రేటు రూ. 100గా ఉంది. ఈ నేపథ్యంలో ఒక ఏడాదిలో భారీగా ఖర్చు తగ్గించుకోవచ్చు. అంతేకాక ప్రభుత్వం ఈ పర్యావరణ హిత వాహనాలను ప్రోత్సహించేందుకు ఫేమ్ 2 పేరిట సబ్సిడీలను అందిస్తోంది. దీంతో తక్కువ ధరకు ఈ ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సబ్సిడీలు మార్చి నెలాఖరుతో ముగిసిపోతున్నాయి. ఫలితంగా ఈ వాహనాల ధరలు పెరగనున్నాయి. అందుకే మీరు కనుక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనే ఆలోచనలో ఉంటే ఇదే సరైన సమయం.
రానున్న కొత్త స్కీమ్..
మార్చి 31తో ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్ర ప్రభుత్వ ఫేమ్ 2 సబ్సిడీ ముగిసిపోతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అది ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్(ఈఎంపీఎస్) 2024 ను తీసుకొచ్చింది. ఇది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్కీమ్ అందుబాటులో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న ధరల కంటే కొంత మేర ధరలు పెరిగే అవకాశం ఉంది.
కొత్త స్కీమ్ ప్రయోజనాలు ఇవి..
ఈఎంపీఎస్ 2024ను మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ ప్రవేశపెట్టింది. దీని కోసం దాదాపు రూ. 333.39 కోట్లు కేటాయించింది. అది కూడా కేవలం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మాత్రమే ఈ మొత్తాన్ని కేటాయించింది. 333,387 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఈ పథకం ద్వారా ప్రయోజనాలు పొందుతుందని, ప్రతి స్కూటర్ రూ. 10,000 ప్రయోజనాన్ని అందుకుంటుందని పేర్కొంది. ఈ స్కీమ్ కేవలం నాలుగు నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూలై 31 వరకూ మాత్రమే అవకాశం ఉంటుంది.
మరిన్ని సర్వీస్ స్టేషన్లు..
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు ఎదుర్కొంటున్న సమస్య అది చార్జింగ్ స్టేషన్లు. సంప్రదాయ పెట్రోల్ ఇంజిన్ వాహనాలకు ఉన్న వెసులుబాటు ఎక్కడైనా పెట్రోల్ బంకులు ఉంటాయి. కాని ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు ఆ మాదిరి లేకపోవడం. దీనిపై ఫోకస్ పెట్టిన కంపెనీలు దేశ వ్యాప్తంగా చార్జింగ్ స్టేషన్లు తీసుకొచ్చేందుకు సమాయత్తమవుతున్నాయి. అంతేకాక ఇళ్లలో కూడా సులభంగా చార్జింగ్ పెట్టుకునే సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








