Unsafe Cars: ఈ కార్లలో భద్రత డొల్ల! క్రాష్ టెస్ట్‌లో దారుణమైన రేటింగ్..
ఇటీవల కాలంలో భారతదేశంలో కారుల భద్రత గణనీయంగా మెరుగుపడినప్పటికీ.. ఇంకా కొన్ని మోడల్‌లు కీలకమైన భద్రతా ఫీచర్ల విషయంలో వెనుకబడి ఉన్నాయి. సాధారణంగా కారు భద్రతకు సంబంధించి క్రాష్ టెస్టింగ్ ఏజెన్సీ అయిన గ్లోబల్ ఎన్‌క్యాప్(న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) రేటింగ్స్ ఇస్తుంది. ఈ రేటింగ్ ఆధారంగానే కార్ల భద్రతను నిర్ణయిస్తారు.
కారు కొనుగోలు చేసే ముందు కొన్ని ప్రాధాన్య అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా దాని ధర, పనితీరు, మైలేజీ వంటివి ముందుగానే తనిఖీ చేసుకోవాలి. వీటితో పాటు చాలా మంది పట్టించుకోని మరొక అంశం ఆ కారు భద్రత(సేఫ్టీ). వాస్తవానికి కారు కొనుగోలు చేసే అంశంలో ఇదే ప్రాధాన్యమైన అంశమని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో భారతదేశంలో కారుల భద్రత గణనీయంగా మెరుగుపడినప్పటికీ.. ఇంకా కొన్ని మోడల్‌లు కీలకమైన భద్రతా ఫీచర్ల విషయంలో వెనుకబడి ఉన్నాయి. సాధారణంగా కారు భద్రతకు సంబంధించి క్రాష్ టెస్టింగ్ ఏజెన్సీ అయిన గ్లోబల్ ఎన్‌క్యాప్(న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) రేటింగ్స్ ఇస్తుంది. ఈ రేటింగ్ ఆధారంగానే కార్ల భద్రతను నిర్ణయిస్తారు. ఇది పెద్దలకు, పిల్లల భద్రతకు విడివిడిగా రేటింగ్ ఇస్తుంది. ఈ రేటింగ్ మంచిగా ఉంటే ఆ కారు భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుంది. మన దేశంలోని ప్రముఖ మోడళ్లు ఈ రేటింగ్‌లో చాలా వెనుకబడి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
మారుతి ఈకో..
ఈ కారుకు 2016లో క్రాష్ టెస్ట్ నిర్వహించారు. ఆ సమయంలో ఈ కారులో పెద్దల ఆక్యుపెంట్ రక్షణకు సున్నా స్టార్ రేటింగ్ వచ్చింది. పిల్లల భద్రతలో స్వల్పంగా 2 స్టార్ రేటింగ్ వచ్చింది. అందుకే ఈ జాబితాలో ఇది మొదటి స్థానంలో నిలిచింది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ 5 సీట్ మినీ వ్యాన్. ఇది రోజువారీ ప్రయాణ అవసరాల కోసం విశాలమైన క్యాబిన్ కలిగి ఉంటుంది. శక్తివంతమైన 1.2-లీటర్, 4-సిలిండర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజన్‌ను అందిస్తుంది.ఈ మోడల్ ధరలు రూ. 5.32 లక్షల(ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.
మారుతీ సుజుకి ఎస్-ప్రెస్సో..
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ప్రముఖ మైక్రో-ఎస్యూవీ, తాజా ఎన్ క్యాప్ పరీక్షలలో 1-స్టార్ రేటింగ్‌ను పొందింది. ఇది పెద్దల రక్షణ కోసం సాధ్యమయ్యే 34 పాయింట్లలో 20.03 పాయింట్లను, పిల్లల భద్రతలో 3.52 పాయింట్లను స్కోర్ చేసింది. ఎస్-ప్రెస్సో పాత వేరియంట్ అయితే అది సున్నా రేటింగ్ ను పొందింది. ఈ కారు నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. దీని ధరలు రూ. 4.26 లక్షల(ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభమవుతాయి.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్..
జనాదరణ పొందిన హ్యుందాయ్ హ్యాచ్‌బ్యాక్ జీఎన్ క్యాప్ భద్రతా అంచనా పరీక్షలలో 2-స్టార్ రేటింగ్ను అందుకుంది. పెద్దల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కోసం 49కి 15 స్కోర్ వచ్చింది.మొత్తంగా, ఇది 66 పాయింట్లలో 22.05 సంపాదించింది. దీని ధర రూ. 5.92 లక్షల(ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.
మారుతి సుజుకి ఆల్టో కె10..
ఈ హ్యాచ్‌బ్యాక్, బడ్జెట్ కార్ సెగ్మెంట్‌లో ప్రముఖ మోడల్. తాజా ఎన్‌సీఏపీ పరీక్షల్లో కొంచెం మెరుగైన 2-స్టార్ రేటింగ్‌ను సాధించింది. పెద్దల భద్రత కోసం 21.67/34 పాయింట్లను, పిల్లల రక్షణ కోసం 3.52/49 పాయింట్లను స్కోర్ చేసింది. దీని ధరలు రూ. 4 లక్షల(ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభమవుతాయి.
రెనాల్ట్ క్విడ్..
తక్కువ బడ్జెట్ విభాగంలో మరొక ప్రసిద్ధ హ్యాచ్ బ్యాక్ ఇది. క్విడ్ ఎన్సీఏపీ రేటింగ్ లో 2 స్టార్లను సాధించింది. పెద్దల రక్షణలో7.78 పాయింట్లు, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్లో 19.68 పాయింట్లు సాధించింది.
మారుతి సుజుకి వ్యాగన్ ఆర్..
ఇదొక ప్రముఖ బడ్జెట్ కారు. ఆల్టో కే10 మాదిరిగానే ఇది కూడా క్రాష్ టెస్ట్ లో 2-స్టార్ రేటింగ్ను అందుకుంది. పెద్దల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కోసం 19.69 పాయింట్లు, పిల్లల భద్రత కోసం 3.40 పాయింట్లు సాధించింది. ఈ మోడల్ ధరలు రూ. 5.55 లక్షల ఎక్స్-షోరూమ్ నుంచి ప్రారంభమవుతాయి.
మారుతి సుజుకి స్విఫ్ట్..
హ్యాచ్ బ్యాక్ విభాగంలో బాగా స్థిరపడిన మారుతి సుజుకి స్విఫ్ట్ గ్లోబల్ ఎన్సీఏపీ నుంచి 1-స్టార్ రేటింగ్ అందుకుంది. ఇది ఫీచర్-రిచ్ ప్యాకేజీ, స్పోర్టీ పెర్ఫార్మెన్స్ ని అందిస్తోంది. అయితే ఈ కారు పెద్దల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కోసం 19.9 పాయింట్లు మరియు పిల్లల భద్రత కోసం 16.68 పాయింట్లను స్కోర్ చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..