Gold Price Today: స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
దేశంలో బంగారం ధరలు మిన్నంటుతున్నాయి. ఒకరోజు ఉన్న ధర మరోరోజు కొనసాగడంలేదు. పసిడి కొనాలనుకునేవారికి చుక్కలు చూపిస్తోంది. ధరలు తగ్గుతాయని ఎదురు చూస్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది. కొందరైతే గద్యంతరం లేని పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నారు. అంతర్జాతీయంగా డాలర్ విలువలో వచ్చిన మార్పులే బంగారం ధరల్లో మార్పులకు కారణం అవుతోంది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో 24 క్యారెట్ల ప్యూర్ పసిడి ధర రూ. 66,340 గా కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ ఆర్నమెంట్ బంగారం ధర విషయానికొస్తే రూ. 60,810 కు చేరింది. అలాగే వెండి ధరలు కూడా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 80,400 కు చేరింది.
దేశంలోని వివిధ ప్రధానమైన నగరాల్లో బంగారం ధరలు ఎలాగున్నాయో ఇప్పుడు చూద్దాం. వాణిజ్య రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,340గా ఉంది. అదే 22 క్యారెట్ల విషయానికొస్తే 10 గ్రాములు 60,810 కి చేరింది. వెండి విషయానికి వస్తే కిలో వెండి రూ. 77,400 నిన్నటి కంటే కిలోపై రూ. 100 పెరిగింది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 66,940గా ఉంది. అదే 22 క్యారెట్ల విషయానికొస్తే 10 గ్రాముల ధర రూ. 61,360 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 80,400కు చేరింది. నిన్నటి ధరలతో పోలిస్తే రూ. 100 పెరిగింది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 66,340గా ఉంది. అదే 22 క్యారెట్ల విషయానికొస్తే 10 గ్రాముల ధర రూ. 60,810కు చేరింది. కిలో వెండి ధర రూ. 75,800 కు చేరింది. నిన్నటి ధరలతో పోలిస్తే రూ. 100 తగ్గుదల కనిపించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..