Car Problems: వేసవిలో కార్లల్లో ఆ సమస్యలతో నరకం.. ముందుగానే గుర్తిస్తే మీ సొమ్ము పదిలం
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అధికంగానే ఉంటాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల మనుషులకే కాదు వాహనాలకు కూడా సమస్యలు తెచ్చిపెడతాయి. వేసవి కాలంలో మీరు మీ కారును సరిగ్గా చూసుకోకుంటే అది మీ కారు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే కారు జీవితకాలాన్ని తగ్గిస్తుంది. వేసవి కాలంలో మీ కారును సరైన స్థితిలో ఉంచడానికి అనుసరించాల్సిన కొన్ని కీలక చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు.

భారతదేశంలో వేసవి కాలం ప్రారంభ దశలో ఉంది. ఈ ఏడాది ఎండలు ఎలా ఉంటాయో? అని చాలా మంది భయపడుతున్నారు. రాబోయే రోజుల్లో వేడిని ఎదుర్కోవడానికి మనమందరం సిద్ధం అవుతున్నాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అధికంగానే ఉంటాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల మనుషులకే కాదు వాహనాలకు కూడా సమస్యలు తెచ్చిపెడతాయి. వేసవి కాలంలో మీరు మీ కారును సరిగ్గా చూసుకోకుంటే అది మీ కారు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే కారు జీవితకాలాన్ని తగ్గిస్తుంది. వేసవి కాలంలో మీ కారును సరైన స్థితిలో ఉంచడానికి అనుసరించాల్సిన కొన్ని కీలక చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు. ఆ చిట్కాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
ఏసీ
వేసవి కాలంలో మీ వాహనం యొక్క ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుంది. అందువల్ల కారు ఏసీకు సాధారణ నిర్వహణ అవసరం. స్లో కూలింగ్ వంటి సమస్యలను నివారించడానికి ట్రాప్ చేసిన వేడిని విడుదల చేయడానికి మీరు కారులోకి ప్రవేశించినప్పుడు విండోస్‌ను కిందకు తిప్పాలి. ఏసీను అత్యధిక ఫ్యాన్ సెట్టింగ్‌కు మార్చాలి. సరైన పనితీరు కోసం దాన్ని ఆన్ చేయడానికి ముందు కొంత సమయం వేచి ఉండం మంచిది.
శీతలీకరణ స్థాయి
వేసవి కాలంలో మీ కారులో సరైన లిక్విడ్ స్థాయిలను నిర్వహించడం చాలా అవసరం. వేసవిలో సాధారణ సమస్య అయిన ఇంజిన్ వేడెక్కడాన్ని నివారించడానికి శీతలకరణ చాలా ముఖ్యం. శీతలకరణ స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ముఖ్యంగా పాత కార్లలో, రేడియేటర్ సర్వీస్ చేయించి, లీక్స్ లేకుండా చూసుకోవాలి.
ఇంజిన్ ఆయిల్
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇంజిన్ ఆయిల్ తక్కువ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా మన ఇంజిన్ ఆయిల్ పాతదయితే ఈ సమస్య అధికంగా ఉంటుంది. కాబట్టి సరైన చమురు స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం, అవసరమైనప్పుడు రీఫిల్ చేయడం చాలా ముఖ్యం. అలాగే పవర్ స్టీరింగ్, బ్రేక్, ట్రాన్సమిషన్ ఫ్లూయిడ్ లెవల్స్ని తనిఖీ చేయాలి. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే బాగు చేయించడం ఉత్తమం.
టైర్ ఒత్తిడి
వేసవి కాలంలో మీ కారు టైర్లకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. మీ కారు టైర్లను సరిగ్గా నిర్వహించకపోతే అవి త్వరగా పాడైపోతాయి. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రత వల్ల టైర్లు పేలిపోయే ప్రమాదం ఉంది. రోడ్లు వేడిగా ఉండడం వల్ల మన కారు టైరులోని గాలి నిర్వహణ చాలా ముఖ్యం.
బ్యాటరీ
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు బ్యాటరీ వేడెక్కిపోతుంది. అందువల్ల మీ కారు బ్యాటరీ జీవితకాలాన్ని తగ్గిస్తుంది. అందువల్ల బ్యాటరీ సరిగ్గా ఛార్జ్ అవుతుందో లేదో తనిఖీ చేయడం మంచింది. బ్యాటరీ వాటర్ స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ప్రత్యేకించి పాత బ్యాటరీలలో తరచుగా వాటర్ టాప్-అప్స్ అవసరమవుతాయి. కొత్త వాహనాలు సాధారణంగా జీరో మెయింటెనెన్స్ బ్యాటరీలతో అమర్చి ఉంటే ఆవర్తన తనిఖీలు అవసరమవుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








