Vinfast Klara S: టీవీఎస్ ఐక్యూబ్‌కు పోటీగా మార్కెట్‌లోకి నయా ఈవీ.. రిలీజ్ ఎప్పుడంటే..?
భారతదేశంలో ఈవీ స్కూటర్స్‌లో ఓలా తర్వాత ఎక్కువగా టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. తాజాగా ఐక్యూబ్‌కు పోటీగా మరో కొత్త ఈవీ స్కూటర్ లాంచ్ చేశారు. వియత్నామీస్ కంపెనీ వినోఫాస్ట్ తమ క్లారా ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం భారతదేశంలో కొత్త డిజైన్ పేటెంట్ కోసం దాఖలు చేసింది. ఈ స్కూటర్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో అమ్మకానికి ఉంది. అతి త్వరలో ఈ స్కూటర్ భారతీయ మార్కెట్లోకి కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే క్లారా ఎస్ స్కూటర్ ఎంట్రీకు సంబంధించి కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
ఇటీవల కాలంలో ఈవీ వాహనాల వాడకం గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈవీ స్కూటర్లు పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి సామాన్యుడికి కొంత ఊరటనిస్తున్నాయి. అందువల్ల ఈవీ స్కూటర్లు వాడేవారు కూడా పెరుగుతున్నారు. అయితే భారతదేశంలో ఈవీ స్కూటర్స్‌లో ఓలా తర్వాత ఎక్కువగా టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. తాజాగా ఐక్యూబ్‌కు పోటీగా మరో కొత్త ఈవీ స్కూటర్ లాంచ్ చేశారు. వియత్నామీస్ కంపెనీ వినోఫాస్ట్ తమ క్లారా ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం భారతదేశంలో కొత్త డిజైన్ పేటెంట్ కోసం దాఖలు చేసింది. ఈ స్కూటర్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో అమ్మకానికి ఉంది. అతి త్వరలో ఈ స్కూటర్ భారతీయ మార్కెట్లోకి కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే క్లారా ఎస్ స్కూటర్ ఎంట్రీకు సంబంధించి కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఇటీవల భారతదేశ విన్ఫాస్ట్ తమిళనాడు ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం తమిళనాడులోని తూత్తుకుడిలో 400 ఎకరాల తయారీ ప్లాంట్ కలిగి ఉంది. ఈ నేపథ్యంలో క్లారా ఎస్ స్కూటర్‌కు సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
ఆధునిక స్కూటర్ అయినప్పటికీ క్లారా ఎస్ కొంచెం రెట్రో డిజైన్ థీమ్‌తో వస్తుంది.. ఆప్రాన్ కోసం డ్యూయల్-టోన్ థీమ్ హెడ్ ల్యాంప్ ఎల్ఈడీతో వస్తుంది. విన్‌ఫాస్ట్ క్లారా ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఐదు పెయింట్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఆకుపచ్చ, ముదురు నీలం-నలుపు, పెర్ల్ తెలుపు-నలుపు, మాట్ నలుపు, ముదురు ఎరుపు-నలుపు ఉన్నాయి. విన్‌ఫాస్ట్ క్లారా ఎస్ 1.8 కేడబ్ల్యూ మోటారు ద్వారా పవర్ అవుట్పుట్ పొందుతుంది. అలాగే 3 కేడబ్ల్యూ బ్యాటరీ ద్వారా గరిష్ట శక్తి ఉత్పత్తిని చేస్తుంది. టీవీఎస్ ఐక్యూబ్ లాగానే ఈ స్కూటర్ 78 కేఎంపీహెచ్ గరిష్ట వేగంతో దూసుకెళ్తుంది.
విన్‌ఫాస్ట్ క్లారా ఎస్ కోసం ఎల్ఎఫ్‌వై బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తుండగా టీవీఎస్ ఐక్యూబ్ మాత్రం లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తోంది. అయితే ఈ స్కూటర్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 194 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. బ్యాటరీ ప్యాక్ పూర్తిగా ఛార్జ్ కావడానికి ఆరు గంటలు పడుతుంది. సస్పెన్షన్ విధులు ముందు భాగంలో ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్లతో వస్తుంది. అలాగే ముందు, వెనుక కూడా డిస్క్ బ్రేక్‌లు ఈ స్కూటర్ ప్రత్యకత. విన్‌ఫాస్ట్ బ్రాండ్ ఇటీవలే వారి వీఎఫ్3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోసం డిజైన్ పేటెంటు కూడా దాఖలు చేసింది. ఇది ఎంజీ కామెట్ ఈవీకి వ్యతిరేకంగా ఉండే ఫంకీ లిటిల్ ఎస్‌యూవీతో వస్తుంది. గ్లోబల్ మార్కెట్లో వీఎఫ్ 3 ఎకో, ప్లస్ అనే రెండు వేరియంట్లలో విక్రయిస్తున్నారు. వీఎఫ్3తో ఒకే మోటారు కాన్ఫిగరేషన్ మాత్రమే అందుబాటులో ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..