PF Withdrawal: పీఎఫ్ విత్ డ్రాకి బ్యాంక్‌ అకౌంట్ అప్‌డేట్ చేసుకోండిలా… వివరాలివే.!

PF Withdrawal Update: ప్రావిడెంట్ ఫండ్ నుంచి డబ్బు విత్‌డ్రా చేయడానికి సబ్‌స్క్రైబర్లకు ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్ ఫండ్...

PF Withdrawal: పీఎఫ్ విత్ డ్రాకి బ్యాంక్‌ అకౌంట్ అప్‌డేట్ చేసుకోండిలా... వివరాలివే.!
Follow us
Ravi Kiran

|

Updated on: May 07, 2021 | 3:40 PM

PF Withdrawal Update: ప్రావిడెంట్ ఫండ్ నుంచి డబ్బు విత్‌డ్రా చేయడానికి సబ్‌స్క్రైబర్లకు ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ నిబంధనలు రూపొందించింది. యూనివర్సల్ అకౌంట్ నెంబర్‌ ఎంటర్‌ చేసిన తర్వాత సబ్‌స్క్రైబర్లు ఆన్‌లైన్‌లో పీఎఫ్ మొత్తాన్ని చాలా ఈజీగా ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించింది. యుఎన్ఏ 12 అంకెలతో కూడిన ప్రత్యేక నెంబర్. సబ్‌స్క్రైబర్లు ఒక్కొక్కరికి ఒక్కో యుఎన్ఏ నెంబర్ ఉంటుంది. ఉద్యోగాలు మారినప్పటికీ యుఎన్ఏ ఒక్కటే ఉంటుంది. యుఎన్ఏనెంబ‌ర్ ద్వారా ఈపీఎఫ్ పోర్ట‌ల్‌లోకి లాగిన్ కావడం ద్వారా పీఎఫ్ మొత్తాన్ని నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఉపసంహరించుకోవచ్చు.

అయితే క్లెయిమ్స్ ఆల‌స్యమవుతున్నాయ‌ని, తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌వుతున్నాయ‌ని ఫిర్యాదులు వచ్చాయి. ఇందుకు కార‌ణం స‌రైన బ్యాంక్ ఖాతా వివ‌రాలు ఇవ్వ‌క పోవ‌డ‌మేన‌ని ఈపీఎఫ్ఓస్పష్టం చేసింది. బ్యాంక్ ఖాతా నెంబర్ IFSC కోడ్ వివ‌రాల్లో త‌ప్పులుంటే మీ క్లెయిమ్స్ తిర‌స్కరించే అవకాశముంది. ఆన్ లైన్ ద్వారా ఈపీఎఫ్ఓ ఖాతాలో మీ బ్యాంకు వివరాలు అప్ డేట్ చేసుకోవడం సులభం. అయితే దీనికి కంపెనీ యాజమాన్యం ఆమోదం అవసరం. ఆన్‌లైన్‌లో లాగిన్‌ అయిన తర్వాత కేవైసీ విషయంలో మీ సంస్థ ఆమోదం కోసం డాక్యుమెంట్ ఫ్రూఫ్స్ సమర్పించాలి. ఈ వివరాల‌ను సంస్థ య‌జ‌మాని వెరిఫై చేసి అప్రూవ్ చేస్తారు. ఆ తర్వాత మీకు కేవైసీ డిజిట‌ల్ అప్రూవ్ అయిన‌ట్లుగా చూపిస్తుంది. ఆ తర్వాత మీకు టెక్స్ట్ మెసేజ్ రూపంలో మొబైల్‌ నెంబర్ కు సందేశం వ‌స్తుంది.

ఇవి చదవండి:

ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్.. బ్యాంక్ టైమింగ్స్ లో మార్పులు.. వివరాలివే..

Viral News: గగుర్పొడిచే దృశ్యం.. ఒకే చోట కుప్పలు తెప్పలుగా చేరిన పాములు.. వీడియో వైరల్.!

ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు చిరుతపులి నక్కింది.. అది ఎక్కడ ఉందో కనిపెట్టగలరా.?