భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. భారతదేశంలో ఉద్యోగుల్లో ఎక్కువ శాతం మంది ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగులకు రిటైర్‌మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కల్పించడానికి ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ద్వారా పెట్టుబడులకు అనుమతి ఇచ్చింది. ఈ పథకంలో ఉద్యోగులతో పాటు కంపెనీ కూడా నెలనెలా సమాన వాటాను చెల్లించాల్సి ఉంటుంది. అయితే పీఎఫ్ డేటా ఎంట్రీ సమయంలో జరిగిన తప్పులు విత్‌డ్రాతో పాటు మరికొన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా పీఎఫ్ డేటా స్పెల్లింగ్ మిస్టేక్స్ మార్చుకోవడం చాలా కష్టమని అందరూ భావిస్తూ ఉంటారు. అయితే కొంతకాలం నుంచి పెరిగిన టెక్నాలజీ కారణంగా ఈపీఎఫ్ డేటా కరెక్షన్ కూడా సులభంగా మారింది. ఆన్‌లైన్‌లోనే ఈ డేటాను సరిచేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ డేటాను సరి చేసుకోవాలంటే ఎలాంటి పత్రాలు అవసరమో? ఓ సారి తెలుసుకుందాం.
పేరులో మూడు కంటే ఎక్కువ అక్షరాలను మార్చాల్సి ఉంటే దాన్ని మేజర్ మిస్టేక్‌గా పరిగణిస్తారు. మొదటి సారి పేరు మొత్తం మార్చాలన్నా మేజర్ మిస్టేక్ కింద పేర్కొంటారు. అలాగే పూర్తి పేరు కావాల్సి వచ్చినా మేజర్ మిస్టేక్ కింద పేర్కొంటారు. 3 కంటే తక్కువ అక్షరాలను మార్చాల్సి ఉంటే మైనర్ మిస్టేక్స్‌గా పేర్కొంటున్నారు. శ్రీ, డాక్టర్, శ్రీ, శ్రీమతి, మిస్ మొదలైన గౌరవార్థాలన తొలగించాల్సి ఉన్నా వాటిని కూడా మైనర్ మిస్టేక్స్ అంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే మేజర్ మిస్టేక్స్ కరెక్ట్ చేయడానికి మూడు ప్రూఫ్‌లు కావాల్సి ఉంటుంది. అయితే మైనర్ మిస్టేక్స్ సరి చేయడానికి ఏవైనా రెండు ప్రూఫ్స్ అందిస్తే సరిపోతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..