PF Account: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఖాతా బదిలీ మరింత సులభం
భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారికి రిటైర్‌మెంట్ తర్వాత ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) పథకాన్ని అమలు చేస్తుంది. మన దేశంలో కోట్లల్లో పీఎఫ్ ఖాతాదారులు ఉన్నారు.

మన దేశంలో ఉద్యోగస్తుల్లో చాలా మందికి పీఎఫ్ ఖాతా ఉంటుంది. అయితే అనుకోని సందర్భంలో ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగంలో చేరాలంటే ఈ పీఎఫ్ ఖాతా బదిలీ పెద్ద ప్రహసనంగా మారుతుంది. ముఖ్యంగా గతంలో ఉద్యోగం చేసే కంపెనీ పీఎఫ్ ఖాతా బదిలీలో అలసత్వం చూపించడంతో సగటు ఉద్యోగి చాలా ఇబ్బందిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి కష్టాలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ మార్పుపై ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతా బదిలీని సులభతరం చేసింది. ఇకపై యజమాని ధ్రువీకరణ లేకుండానే పీఎఫ్ ఖాతా బదిలీ చేసుకునే అవకాశం ఇచ్చింది. ఈపీఎఫ్ఓ అప్‌డేటెడ్ ఫారమ్-13 ద్వారా బదిలీ క్లెయిమ్‌లకు యజమాని ఆమోద అవసరాన్ని తొలగించిందని ఈపీఎఫ్ఓ అధికారులు ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
ఇప్పటివరకు ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను బదిలీ చేయడంలో రెండు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) కార్యాలయాలు పాల్గొన్నాయి. పీఎఫ్ మొత్తాన్ని బదిలీ చేసిన సోర్స్ ఆఫీస్, డెస్టినేషన్ ఆఫీస్ రెండింటి ద్వారా పీఎఫ్ ఖాతా బదిలీ చేయాల్సి వచ్చేది. అయితే ఇక నుంచి బదిలీదారు (మూలం) కార్యాలయంలో బదిలీ క్లెయిమ్ ఆమోదించాక మునుపటి ఖాతా ఆటోమెటిక్‌గా బదిలీదారు (గమ్యస్థానం) కార్యాలయంలో సభ్యుని ప్రస్తుత ఖాతాకు తక్షణమే బదిలీ అవుతుందని ఈపీఎఫ్ఓ అధికారులు చెబుతున్నారు. ఈ అప్‌డేటెడ్ సిస్టమ్ పన్ను విధించదగిన పీఎఫ్ వడ్డీపై టీడీఎస్‌కు సంబంధించిన కచ్చితమైన గణనను సులభతరం చేస్తుందని పేర్కొంటున్నారు. అలాలే పీఎఫ్ ఖాతాలోని పన్ను విధించదగిన, పన్ను విధించబడని భాగాల విభజన చేసుకోవచ్చని వివరిస్తున్నారు. ఈ అప్‌డేట్ వల్ల 25 కోట్ల మంది సభ్యులు లాభపడతారని, ఇక నుంచి ఖాతా బదిలీ ప్రక్రియ మొత్తం బదిలీ వేగవంతం అవుతుందని పేర్కొంటున్నారు.
సభ్యుల ఖాతాలకు నిధులను సకాలంలో జమ చేయడానికి సభ్యుల ఐడీ, అందుబాటులో ఉన్న ఇతర సభ్యుల సమాచారం ఆధారంగా యూఏఎన్ లను బల్క్ జనరేట్ చేసే సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు. ఆ మేరకు ఒక సాఫ్ట్‌వేర్ రూపొందించి ఎఫ్ఓ ఇంటర్‌ఫేస్ ద్వారా ఫీల్డ్ ఆఫీసులకు అందుబాటులో ఉంచారు. అలాంటి సందర్భాల్లో యూఏఎన్‌లను బల్క్ జనరేట్ చేయడానికి, ఈపీఎఫ్ఓ అప్లికేషన్‌లో ఆధార్ అవసరం లేకుండా గత సంచితాలను లెక్కించడానికి వీలు కల్పిస్తుంది. అయితే పీఎఫ్ నిల్వలను రక్షించడానికి రిస్క్ తగ్గింపు చర్యగా అలాంటి అన్ని యూఏఎన్‌లను స్తంభింపచేసిన స్థితిలో ఉంచుతారు. అలాగే ఆధార్‌ను సీడింగ్ చేసిన తర్వాత మాత్రమే వాటిని అమలులోకి తెస్తారు. ఈ చర్యలన్నీ సభ్యులకు సేవలను గణనీయంగా మెరుగుపరుస్తాయని, దీర్ఘకాలిక ఫిర్యాదులను తగ్గిస్తాయని ఈపీఎఫ్ఓ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








