AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. పెట్రోల్‌ బంకుల్లో ఇన్ని రకాల మోసాలు ఉంటాయా? తెలియకుండానే మీ జేబుకు చిల్లు..

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, పెట్రోల్ పంపుల వద్ద జరిగే మోసాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. షార్ట్ ఫ్యూయలింగ్, ఎలక్ట్రానిక్ చిప్‌ల ద్వారా మోసం, సింథటిక్ ఆయిల్ నింపడం, పెట్రోల్ నాణ్యత తనిఖీ చేయడం వంటి అంశాలను ఈ వ్యాసం వివరిస్తుంది. మీ హక్కులను కాపాడుకోవడానికి మరియు మోసాలకు గురికాకుండా ఉండటానికి ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం.

వామ్మో.. పెట్రోల్‌ బంకుల్లో ఇన్ని రకాల మోసాలు ఉంటాయా? తెలియకుండానే మీ జేబుకు చిల్లు..
Petrol Pump
SN Pasha
|

Updated on: Jul 04, 2025 | 4:02 PM

Share

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల సామాన్యులకు పెను భారంగా మారాయి. భారీగా పెరిగిన ధరలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ధరలతో ఒకవైపు జేబులు గుల్ల చేసుకుంటుంటే.. మరోవైపు కొన్ని పెట్రోల్‌ బంకుల వాళ్లు చేసే మోసాలకు కూడా బలవుతున్నారు. మరీ పెట్రోల్ పంపుల వద్ద మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి. అసలు వాళ్లు ఎలా మోసం చేస్తారు? అనే విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

1) షార్ట్ ఫ్యూయలింగ్

షార్ట్ ఫ్యూయలింగ్ అనేది ఒక సాధారణ మోసపూరిత పద్ధతి, ఇది కస్టమర్లు అప్రమత్తంగా లేకుంటే సులభంగా చేయవచ్చు. కస్టమర్ తమ వాహనానికి కొంత మొత్తానికి ఇంధనం నింపాలనుకున్నప్పుడు ఇది జరుగుతుంది. కానీ ఇంధన కేంద్రంలోని అటెండెంట్ మీటర్‌ను రీసెట్ చేయనప్పుడు మీరు పూర్తి మొత్తాన్ని చెల్లించి తక్కువ ఇంధనాన్ని పొందుతారు. ఉదాహరణకు – మీరు రూ.1,000 పెట్రోల్ కొట్టమన్నప్పుడు.. అటెండెంట్ మీటర్‌ను సున్నాకి రీసెట్ చేయకుండా ఇప్పటికే 200 వద్ద ఉన్నదాన్ని.. కొనసాగిస్తూ.. మీకు పెట్రోల్‌ కొట్టేశాడు. రూ.1000 నంబర్‌ రాగానే పెట్రోల్‌ కొట్టేయడం ఆపేస్తాడు. మీరు రూ.1000 ఇచ్చేసి వెళ్లిపోతారు. కానీ, నిజానికి అతను మీ వాహనంలో కేవలం రూ.800 పెట్రోల్‌ మాత్రమే నింపాడు. మిగతా రూ.200 అతను మిమ్మల్ని జీరో రీ సెట్‌ చేయకుండా మోసం చేశాడు. అందుకే కచ్చితంగా రీడింగ్‌పై పెట్రోల్‌ కొట్టే ముందు జీరో ఉందో లేదో చూసుకోండి.

2) మెషీన్లో ఎలక్ట్రానిక్ చిప్‌లు

కొన్నిసార్లు ఇంధన పంపిణీ యంత్రాలలో ఎంటర్‌ చేసిన దాని కంటే తక్కువ పెట్రోల్‌, డీజిల్‌ వచ్చేలా ముందే ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చుతారు. కానీ మీటర్ పూర్తి మొత్తాన్ని చూపుతుంది. 2020లో తెలంగాణలో ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చాయి. అక్కడ పెట్రోల్ పంపులకు చిప్‌లను ఏర్పాటు చేసి, ప్రతి 1,000 ml పెట్రోల్/డీజిల్‌కు 970 ml ఇంధనాన్ని పంపిణీ చేస్తున్నారు. పెట్రోల్ పరిమాణం గురించి మీకు అనుమానం ఉంటే, మీరు ఐదు లీటర్ల పరిమాణ పరీక్ష కోసం అడగవచ్చు. పెట్రోల్ పంపులు 5-లీటర్ కొలతను కలిగి ఉంటాయి.

3) సింథటిక్ ఆయిల్

ఈ రోజుల్లో కొన్ని పెట్రోల్ పంపులు మీ వాహనాన్ని సాధారణ ఇంధనానికి బదులుగా సింథటిక్ ఆయిల్‌తో నింపే కొత్త ఉపాయాన్ని ఉపయోగించడం ప్రారంభించాయి. వారు తరచుగా కస్టమర్ అనుమతి లేకుండా లేదా వారికి చెప్పకుండానే దీన్ని చేస్తారు. సింథటిక్ ఆయిల్ సాధారణ ధర కంటే 5 నుండి 10 శాతం ఖరీదైనది కాబట్టి, మీరు అనుకున్న దానికంటే ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు. ముందుగానే అలాంటిదేం అవసరం లేదని ముందే చెప్తే మంచిది.

4) పెట్రోల్ నాణ్యత

మీ వాహనంలో నింపబడుతున్న పెట్రోల్ నాణ్యతపై మీకు అనుమానం ఉంటే, మీరు ఇంజిన్ ఫిల్టర్ పేపర్ పరీక్ష కోసం అడగవచ్చు. వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం ప్రతి పెట్రోల్ పంపులో ఫిల్టర్ పేపర్లు ఉండాలి. అవసరమైనప్పుడు వాటిని వినియోగదారులకు అందించాలి. పెట్రోల్ కల్తీ చేయబడిందో లేదో తెలుసుకోవడానికి ఫిల్టర్ పేపర్‌పై కొన్ని చుక్కల పెట్రోల్ వేయండి, అది మరకలు వదిలితే పెట్రోల్ కల్తీ అవుతుంది. లేకపోతే పెట్రోల్ స్వచ్ఛమైనది. నాణ్యత లేని ఇంధనం మీ వాహనాన్ని అనేక విధాలుగా దెబ్బతీస్తుంది.

5) పెట్రోల్ ధర

పెట్రోల్‌ బంక్‌లోకి వెళ్లగానే పెట్రోల్ ధరను తనిఖీ చేయండి. ఇంధన పంపిణీ యంత్రంపై ప్రదర్శించబడిన ధరతో వాస్తవ ధరను లెక్కించడం మంచిది. అలాగే మీ పెట్రోల్ కొనుగోలుపై బిల్‌ తీసుకోవడం మర్చిపోకండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి