Petrol, Diesel prices: వాహనదారులకు షాక్.. ఈవారంలోనే పెట్రో మంట.. లీటరుపై రూ.15 పెరిగే అవకాశం!!
గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ముండుతున్నాయి. ఇక రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం కావడంతో క్రూడాయిల్ రోజురోజుకు ఎగబాకుతోంది.
గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ముండుతున్నాయి. ఇక రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం కావడంతో క్రూడాయిల్ రోజురోజుకు ఎగబాకుతోంది. అయితే మన దేశంలో మాత్రం గత కొన్నినెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. అయితే ఇకపై అవకాశం లేదు. వాహనదారులకు భారీగా పెట్రోమంట తగిలేలా ఉంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఏర్పడిన సంక్షోభ పరిస్థితులు ఇప్పట్లో ముగిసేలా కనిపించకపోవడం, దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగియడం, గురువారం ఫలితాలు వెలువడుతుండడంతో ఈ వారంలోనే పెట్రో వడ్డన తప్పకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం కాకముందు క్రూడాయిల్ బ్యారెల్ ధర 95 డాలర్లుగా ఉంటే ఇప్పుడు ఏకంగా 125 డాలర్లకు ఎగబాకింది. ఈ నేపథ్యంలో ఇంధన రిటైలర్లకు బ్రేక్ ఈవెన్ కావాలంటే దేశీయంగా లీటర్ పెట్రోలుపై సుమారు రూ.15, డీజిల్‌పై రూ.22 పెరగవచ్చని తెలుస్తోంది.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.07గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.49గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.29గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.47గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.37గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.71గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.62 ఉండగా.. డీజిల్ ధర రూ.95.01గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.51కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.59లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.21 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.33గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.10946 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.95.57గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.12గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.22గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.51లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.59లకు లభిస్తోంది.
Chiranjeevi: నేను హీరోగా నిలదొక్కుకున్నానంటే ఆమే కారణం.. మహిళా దినోత్సవంలో మెగాస్టార్ చిరంజీవి..