Petrol, Diesel Rates Today: దేశంలో ఇటీవల తగ్గిన చమురు ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో.. ఇంత కాలంగా స్థిరంగా కొనసాగిన ధరలకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. నెలక్రితం అడ్డు అదుపు లేకుండా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ వైపు పెట్రోల్, డీజిల్ ధరలు.. మరోవైపు వంట గ్యాస్ ధరలు రోజుకో తీరుగా పెరగడంతో అందరినుంచి ఆందోళన వ్యక్తమైంది. అయితే ఇన్ని రోజుల పెట్రోల్ ధరల నుంచి కొంచెం ఊరట లభించగా.. తాజాగా మళ్లీ భారీగా పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.100 మార్క్ కూడా దాటడం కలవరపెడుతోంది. దేశంలో ఎన్నికలు ముగిసిన నాటినుంచి పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే.. సోమవారం కూడా ధరలు భారీగానే పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 26 పైసలు, డీజీలై 33 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ 91.53కు చేరగా.. డీజిల్ ధర 82.06కి పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..
దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు..
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.53 కి చేరగా.. డీజిల్ ధర రూ.82.06కి పెరిగింది.
ముంబైలో పెట్రోల్ ధర రూ.97.86 ఉండగా, డీజిల్ ధర రూ.89.17 గా ఉంది.
చెన్నైలో పెట్రోల్ ధర రూ.93.38 ఉండగా, డీజిల్ ధర రూ.86.93 గా ఉంది.
కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.66 ఉండగా, డీజిల్ ధర రూ.84.90 గా ఉంది.
బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.94.57 ఉండగా, డీజిల్ ధర రూ.86.99 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.65 గా ఉంది. డీజిల్ ధర రూ.91.43 గా ఉంది.
విశాఖపట్నంలో పెట్రోల్ ధర 96.74 ఉండగా.. డీజిల్ ధర రూ.90.54 గా ఉంది.
విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.36 గా ఉండగా, డీజిల్ ధర రూ.91.11 గా ఉంది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.95.13 గా ఉండగా.. డీజిల్ ధర రూ.89.47 కి చేరింది.
వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.71 ఉండగా, డీజిల్ ధర రూ.89.06 ఉంది.
కరీంనగర్‌లో పెట్రోల్ రూ.95.28 ఉండగా, డీజిల్ ధర రూ.89.59 గా ఉంది.
Also Read: