Petrol-Diesel Price Today: వరుసగా 23వ రోజూ అదే పరిస్థితి.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజీల్ రేట్లు ఎంతంటే..

దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు నిశ్చలంగా ఉన్నాయి. వరుసగా 23వ రోజు కూడా వాటి రేట్లలో ఎలాంటి మార్పులు లేవు. డిసెంబర్ 7వ తేదీకి ముందు వరుసగా..

Petrol-Diesel Price Today: వరుసగా 23వ రోజూ అదే పరిస్థితి.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజీల్ రేట్లు ఎంతంటే..
Petrol diesel rates
Follow us

|

Updated on: Dec 30, 2020 | 12:13 PM

Petrol-Diesel Price Today: దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు నిశ్చలంగా ఉన్నాయి. వరుసగా 23వ రోజు కూడా వాటి రేట్లలో ఎలాంటి మార్పులు లేవు. డిసెంబర్ 7వ తేదీకి ముందు వరుసగా డీజీల్, పెట్రోల్ రేట్లు పెరిగిన విషయం తెలిసిందే. వరుస పెరుగుదలతో సామాన్య ప్రజానికం హడలిపోయింది. ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు రెండేళ్ల గరిష్టానికి చేరాయి. ఆ కారణంగానే వరుసగా ఇంధన ధరలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో దేశీయ మార్కెట్‌లో ఇంధన ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.

కాగా, బుధవారం నాడు దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 83.71గా ఉంది. ఇక డీజీల్ ధర రూ. 73.87 స్థిరంగా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ అదే పరిస్థితి. పెట్రోల్ ధర రూ.90.34 ఉండగా, డీజిల్ ధర రూ.80.51గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. పెట్రోల్, డీజీల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో బుధవారం లీటర్ పెట్రోల్ ధర రూ.87.06 ఉండగా, డీజిల్ ధర రూ.80.60 గా ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇంధన రేట్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. విజయవాడలో బుధవారం నాడు లీటర్ పెట్రోల్ ధర రూ.89.44 వద్ద స్థిరంగా ఉండగా, డీజిల్ ధర రూ.82.54 వద్ద ఉంది. ఇక అమరావతిలో పెట్రోల్‌ లీటర్ ధర రూ.89.92 కాగా, డీజిల్‌ ధర రూ.82.98 వద్ద నిలకడగా ఉంది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.45 శాతం పెరుగుదలతో 51.49 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.65 శాతం పెరుగుదలతో 48.31 డాలర్లకు ఎగసింది.

Also read:

Tirumala News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల..

పోతిరెడ్డిపాడు గేట్ల నుంచి భారీగా నీరు లీక్..తాత్కాలిక మరమ్మతులు చేస్తున్న సిబ్బంది..

ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మితిమీరిన సంబరాలతో అడ్డంగా బుక్కైన ఢిల్లీ పేసర్..!
మితిమీరిన సంబరాలతో అడ్డంగా బుక్కైన ఢిల్లీ పేసర్..!
ఏపీలో విచిత్ర వాతావరణం.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
ఏపీలో విచిత్ర వాతావరణం.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
వేసవిలో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా IRCTC ప్యాకేజీ
వేసవిలో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా IRCTC ప్యాకేజీ
అదరగొట్టిన కోహ్లీ, పాటిదార్.. హైదరాబాద్ టార్గెట్ 207
అదరగొట్టిన కోహ్లీ, పాటిదార్.. హైదరాబాద్ టార్గెట్ 207
Viral: చెరువు దగ్గర మట్టిలో వింత ఆకారం.. తవ్వి చూడగా.!
Viral: చెరువు దగ్గర మట్టిలో వింత ఆకారం.. తవ్వి చూడగా.!
చిరంజీవి మృగరాజు సినిమాలో ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..
చిరంజీవి మృగరాజు సినిమాలో ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..
రోడ్డు పై భారీగా ట్రాఫిక్ జామ్.. జేసీబీ డ్రైవర్ నిర్వాకంతో..
రోడ్డు పై భారీగా ట్రాఫిక్ జామ్.. జేసీబీ డ్రైవర్ నిర్వాకంతో..