Petrol Price: మళ్లీ పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గనున్నాయా? పెట్రోలియం శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు

పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మరోసారి కీలక ప్రకటన చేశారు. మార్కెట్‌ పరిస్థితులు, లాభదాయకతను పరిశీలించిన తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత తగ్గింపుపై ప్రభుత్వ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. ఓఎంసీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రూ.2 తగ్గించిన నేపథ్యంలో మంత్రి ఈ ప్రకటన చేశారు.

Petrol Price: మళ్లీ పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గనున్నాయా? పెట్రోలియం శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు
Minister
Follow us
Subhash Goud

|

Updated on: Mar 16, 2024 | 2:48 PM

పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మరోసారి కీలక ప్రకటన చేశారు. మార్కెట్‌ పరిస్థితులు, లాభదాయకతను పరిశీలించిన తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత తగ్గింపుపై ప్రభుత్వ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. ఓఎంసీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రూ.2 తగ్గించిన నేపథ్యంలో మంత్రి ఈ ప్రకటన చేశారు.

అయితే కొత్త రేట్లు మార్చి 15 నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. చమురు కంపెనీల నిర్ణయం చాలా సాహసోపేతమైనదని పూరీ అభివర్ణించారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు అస్థిరంగా ఉన్నాయని అన్నారు. మే 2022 తర్వాత ధర తగ్గింపు కనిపించింది. మే 2022లో వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.

కంపెనీలకు భారీగా లాభాలు

ఇవి కూడా చదవండి

ఇండియన్ ఆయిల్ అవుట్‌లెట్ నుండి ‘ఇథనాల్ 100’ని ప్రారంభించిన సందర్భంగా పూరి మాట్లాడుతూ, OMC గత మూడు త్రైమాసికాల్లో పటిష్టంగా పనిచేసింది. అలాగే నాల్గవ త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలపై ఆశాజనకంగా ఉన్నాము. గత మూడేండ్లలో దేశంలోని మూడు ప్రభుత్వ చమురు కంపెనీలు రూ.69 వేల కోట్ల లాభాలను ఆర్జించాయి. మొత్తం ఆర్థిక సంవత్సరంలో కంపెనీల మొత్తం లాభం రూ.85 వేల నుంచి రూ.90 వేల కోట్ల మధ్య ఉండవచ్చని అంచనా. అయితే నాలుగో త్రైమాసికంలో కంపెనీల లాభం రూ.15 నుంచి 20 వేల కోట్లుగా చూడొచ్చు. ఇది మూడు త్రైమాసికాల్లో వచ్చిన లాభం కంటే తక్కువే.

ఢిల్లీలో ధరలు ఎంత?

దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను రూ.2 తగ్గించాయి. కొత్త రేట్లు మార్చి 15 నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.72కి, డీజిల్ ధర లీటరుకు రూ.87.62కి తగ్గింది. దీని వినియోగదారులకు ఖచ్చితంగా కొంత ఉపశమనం లభించింది. మరోవైపు రాజస్థాన్ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించింది. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.5 తగ్గాయి. పెట్రోల్, డీజిల్ అత్యంత ఖరీదైన ధరలు రాజస్థాన్‌లో మాత్రమే ఉన్నాయి. చమురు కంపెనీలు రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను మరింత తగ్గించవచ్చని తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి