Petrol and Diesel Price : ఇంధన ధరల్లో స్వల్ప మార్పులు.. దేశ వ్యాప్తంగా లీటర్ పెట్రోల్‌, డీజిల్‌ రేట్‌ ఎంతుందంటే..?

Petrol and Diesel Price : గతకొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒకానొక సమయంలో ఆకాశమే హద్దుగా పెరిగిన ఇంధన ధరలకు ప్రస్తుతం కాస్త బ్రేక్‌ పడడంతో

Petrol and Diesel Price : ఇంధన ధరల్లో స్వల్ప మార్పులు.. దేశ వ్యాప్తంగా లీటర్ పెట్రోల్‌, డీజిల్‌ రేట్‌ ఎంతుందంటే..?
Follow us
uppula Raju

|

Updated on: Apr 09, 2021 | 6:31 AM

Petrol and Diesel Price: గతకొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒకానొక సమయంలో ఆకాశమే హద్దుగా పెరిగిన ఇంధన ధరలకు ప్రస్తుతం కాస్త బ్రేక్‌ పడడంతో అది సామాన్య ప్రజలకు కాస్త ఊరట కలిగించే అంశంగానే చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇంధన ధరలు పెరుగుతాయని అందరూ భావించినా ధరల పెరుగుదలకు చెక్‌ పడడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈరోజు పెట్రోల్‌ డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి..

* దేశరాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.56 ఉండగా, డీజిల్‌ ధర రూ.80.87గా ఉంది.

* కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.77 ఉండగా, డీజిల్‌ ధర రూ.83.75 ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.98 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.96 ఉంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.92.58 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.88 ఉంది.

* కర్నాటక రాజధాని బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.59 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.75 ఉంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సోమవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.16 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.20 ఉంది.

* కరీంనగర్‌లో పెట్రోల్‌ ధరలో కాస్త పెరుగుదల కనిపించింది ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ రూ.93.92 (గురువారం రూ.94.04) ఉండగా, డీజిల్‌ ధర రూ.87.97 (గురువారం రూ.88.08)గా ఉంది.

* వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.74 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.80 ఉంది.

* ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే విజయవాడలో విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.46 ఉండగా, డీజిల్‌ ధర రూ.89.99గా ఉంది.

* సాగరనగరం విశాఖపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.55 (గురువారం రూ.95.87) ఉండగా, డీజిల్‌ ధర రూ.89.09 (గురువారం రూ. 89.38)గా ఉంది.

* విజయనగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.85 (గురువారం రూ. 96.04) ఉండగా, డీజిల్‌ ధర రూ.89.37 (గురువారం రూ.89.55)గా ఉంది.

దేశంలోని ఇతర నగరాల్లో పెట్రోల్‌ ధరల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

https://tv9telugu.com/business/petrol-price-today.html

దేశంలోని ఇతర నగరాల్లో డీజిల్‌ ధరల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

https://tv9telugu.com/business/diesel-price-today.html

సూసైడ్ అటెంప్ట్ చేసిన బిగ్‏బాస్ కంటెస్టెంట్.. హస్పిటల్ బెడ్ పై అలా.. సోషల్ మీడియాలో ఫోటోస్ వైరల్..

CM KCR Review on Corona : తెలంగాణలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష.. కోవిడ్ టెస్ట్‌లను భారీగా పెంచాలని నిర్ణయం