LIC Loan: మీరు ఎల్ఐసీ పాలసీదారా.. అయితే తక్కువ వడ్డీకే రుణం తీసుకోవచ్చు.. ఎలాగంటే..
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ. ఈ సంస్థకు లక్షల్లో పాలసీదారులు ఉన్నారు. అయితే LIC తన పాలసీదారులకు రుణ సౌకర్యంతో సహా అనేక సదుపాయాలను అందిస్తుంది...
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ. ఈ సంస్థకు లక్షల్లో పాలసీదారులు ఉన్నారు. అయితే LIC తన పాలసీదారులకు రుణ సౌకర్యంతో సహా అనేక సదుపాయాలను అందిస్తుంది. మీకు ఎల్‌ఐసీ పాలసీని ఉంటే సులభంగా పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. దీని వడ్డీ రేటు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల కంటే తక్కువగా ఉంది. వ్యక్తిగత రుణంపై ఎల్‌ఐసీ వడ్డీ రేటు 9 శాతం నుంచి ప్రారంభమవుతుంది. మీ ఎల్‌ఐసీ పాలసీపై మీరు ఎంత రుణం పొందుతారు అనేది మీ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది.
రుణ కాల వ్యవధి 5 సంవత్సరాలు ఉంటుంది. లోన్ మొత్తం పాలసీ సరెండర్ విలువపై ఆధారపడి ఉంటుంది. అందులో 90% వరకు లోన్ పొందవచ్చు. మీ పాలసీ సరెండర్ విలువ రూ. 5 లక్షలు అయితే మీరు దానిపై 4.5 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. దీని అతి పెద్ద ఫీచర్ ఏమిటంటే.. మీరు లోన్ కాలపరిమితికి ముందు చెల్లిస్తే ప్రత్యేక ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనిని ఫోర్‌క్లోజర్ ఛార్జ్ అని కూడా అంటారు.
అయితే LIC పర్సనల్ లోన్‌పై వడ్డీ రేటు ఎంత అనేది పూర్తిగా దరఖాస్తుదారు క్రెడిట్ ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రొఫైల్‌లో రుణదాత ఆదాయం, అతను చేసే ఉపాధి పను, లోన్ మొత్తం ఎంత, రుణం తిరిగి చెల్లించే వ్యవధి ముఖ్యమైనవి. రుణ రేటు ఈ అంశాలన్నింటిపై ఆధారపడి ఉంటుంది. రుణంపై వడ్డీ రేటు ఫ్లాట్ రేట్ లేదా ఫ్లాట్ బ్యాలెన్స్ పద్ధతిని ఉపయోగించి లెక్కిస్తారు. దీనిలో రుణం మొత్తంపై వడ్డీ వసూలు చేస్తారు. మీరు 5 లక్షల రుణం తీసుకుని క్రమంగా దాన్ని తిరిగి చెల్లించి 2 లక్షలకు తీసుకొచ్చారనుకోండి, అప్పుడు ఆ 2 లక్షలకు మాత్రమే వడ్డీ వసూలు చేస్తారు.
EMI ఎంత ఉంటుంది
సంవత్సరకాలానికి ఒక వ్యక్తి 9% చొప్పున రూ.1 లక్ష రుణం తీసుకుంటే అతను నెలకు రూ. 8,745 EMI చెల్లించాల్సి ఉంటుంది. రుణాన్ని 2 సంవత్సరాల కాలవ్యవధికి తీసుకుంటే అప్పుడు రూ. 4,568 EMI ఉంటుంది. 3 సంవత్సరాల పాటు రుణంపై రూ. 3,180 EMI ఉంటుంది. రుణాన్ని 4 సంవత్సరాల కాలవ్యవధికి తీసుకుంటే, అప్పుడు రూ. 2,489 EMI ఉంటుంది. 5 సంవత్సరాల పాటు రుణం తీసుకుంటే, 2,076 EMI ఉంటుంది.
మీరు 5 లక్షల వ్యక్తిగత రుణం తీసుకున్నట్లయితే, 1 సంవత్సరం కాలానికి నెలకు రూ. 44,191 EMI ఉంటుంది. 2 సంవత్సరాల లోన్ కాలవ్యవధిలో 23,304 EMI ఉంటుంది.3 సంవత్సరాల కాలవ్యవధితో రుణంపై EMI రూ. 18,472 అవుతుంది. 4 సంవత్సరాలకు రూ. 15,000 EMI, 5 సంవత్సరాల కాలవ్యవధితో రుణంపై రూ. 12,917గా ఉంటుంది.
రుణం ఎలా తీసుకోవాలి
మీరు లోన్ తీసుకోవడానికి LIC వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు. మీరు ఈ వెబ్‌సైట్‌లో రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ఫారమ్‌లో వివరాలు నమోదు చేసిన తర్వాత, దాన్ని డౌన్‌లోడ్ చేయండి. ఈ ఫారమ్‌ను ప్రింట్ అవుట్ తీసుకుని, సంతకం చేసిన తర్వాత స్కాన్ చేసి ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయండి. ఇలా చేసిన తర్వాత రుణ దరఖాస్తు పూర్తవుతుంది. దీని తర్వాత, LIC మీ దరఖాస్తును ధృవీకరించి, లోన్ జారీ ప్రక్రియను ప్రారంభిస్తుంది. ప్రక్రియ పూర్తయిన తర్వాత, లోన్ మొత్తం మీ బ్యాంక్ ఖాతాకు ఆన్‌లైన్‌లో బదిలీ చేస్తారు.
Read Also.. Digital Payments: దేశ ప్రజలకు షాక్ ఇవ్వనున్న ఆర్‌బీఐ.. ఆ చెల్లింపులపై ‘ఛార్జీల వడ్డన’కు రంగం సిద్ధం..!