Gold Prices: బంగారం ధరలపై మరో బిగ్ బాంబ్.. రూ.2 లక్షల మార్క్‌కు ఛాన్స్..!
బంగారం ధరలు గత ఏడాది నుంచి ఊహించనంత స్థాయిలో పెరుగుతున్నాయి. గత ఏడాది ఆల్ టైం రికార్డ్ నమోదు చేయగా.. ఈ సారి ఆ మార్క్‌ను దాటనున్నాయి. 2026లో గోల్డ్ రేట్లు ఇంకెంతలా పెరుగుతాయనే దానిపై నిపుణులు అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే..

బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల గోల్డ్ రేట్లు లక్షన్నరకు చేరుకుని సరికొత్త రికార్డ్ సృష్టించాయి. ఈ ఏడాది మరింతగా బంగారం రేట్లు పెరుగుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. 2026 చివరి నాటికి గోల్డ్ రేట్లు కొత్త రికార్డ్ దిశగా వెళ్లే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో బంగారం రేట్లు ఇంకెంత పెరుగాయనే చర్చ సర్వత్రా నడుస్తోంది. ఇక బంగారంతో పాటు వెండి ధర కూడా ఇటీవల ఆల్ టైం రికార్డ్ నమోదు చేసింది. 2026లో గోల్డ్, వెండి రేట్ల అంచనాలు ఒకసారి చూద్దాం.
బంగారం రూ.2 లక్షలు
గత ఏడాది బంగారం ధరలు సరికొత్త చరిత్ర సృష్టించాయి. చరిత్రలో ఎప్పుడూ లేనంతంగా రికార్డ్ నమోదు చేశాయి. దీంతో ఇక ఏడాది గోల్డ్ రేట్లు ఎలా ఉంటాయనేది హాట్‌టాపిక్‌గా మారింది. 2026లో గోల్డ్ రేట్లు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని, తులం బంగారం రూ.2 లక్షలకు చేరుకోనుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు ప్రస్తుతం కేజీ రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతుండగా.. 2026 చివరి నాటికి రూ.3 లక్షలు దాటవొచ్చని అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ర్యాలీని గమనిస్తే ధరలు పెరగడం తప్ప తగ్గే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అంచనాలు ఇవే..
2026 చివరి నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.1.7 లక్షలకు చేరుకునే అవకాశముందట. ఇక కేజీ వెండి రూ.2.6 లక్షల వరకు చేరుకునే ఛాన్స్ ఉందంటున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు, డాలర్ బలహీనపడటం, బంగారంపై పెరుగుతున్న పెట్టుబడులే ధరలు పెరగడానికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ఉత్పత్తి తక్కువగా ఉండగా.. డిమాండ్ ఎక్కువగా ఉంంది. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెల్స్ తయారీ లాంటి అనేక వాటిల్లో వెండి ఉపయోగిస్తున్నారు. దీంతో వీటి ధరలు కూడా తారాస్థాయికి చేరుకోనున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇటువంటి పరిస్థితుల్ల్ బంగారంపై పెట్టుబడి పెట్టేవారికి అధిక లాభాలు చూడనున్నారు. అతిగా అంచనాలు వేసుకోకుండా మార్కెట్‌ను అంచనా వేసి బంగారంలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నారు. కాగా ఆదివారం 10 గ్రాముల 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ ధర రూ.1,35,820గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,24,500 వద్ద కొనసాగుతోంది. ఇక కేజీ వెండి రూ.2.57 లక్షల వద్ద కొనసాగుతంది.
