AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Loan Tips: హోమ్ లోన్ తీసుకునేటప్పుడు జాగ్రత్త.. ఈ చిన్న మిస్టేక్స్ చేస్తే రూ.లక్షల్లో నష్టం.. చేయకూడని పనులివే..

సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు చాలామంది హోమ్ లోన్ తీసుకుంటారు. అయితే సరైన అవగాహన లేక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. దీని వల్ల మీకు రూ.లక్షల్లో నష్టం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల మీరు డబ్బులు పొదుపు చేసుకోవచ్చు.

Home Loan Tips: హోమ్ లోన్ తీసుకునేటప్పుడు జాగ్రత్త.. ఈ చిన్న మిస్టేక్స్ చేస్తే రూ.లక్షల్లో నష్టం.. చేయకూడని పనులివే..
Home Loan
Venkatrao Lella
| Edited By: |

Updated on: Apr 17, 2026 | 1:08 PM

Share

సొంతిల్లు నిర్మించుకోవాలనేది ప్రతీఒక్కరి కల. ఇందుకోసం తాము సంపాదించే సొమ్మును కూడబెట్టుకుంటారు. అయితే సొంతిల్లు కట్టుకోవాలంటే లక్షలతో కూడుకున్న పని. అంత డబ్బులు సామాన్య, మధ్యతరగతి ప్రజల దగ్గర ఉండవు. దీంతో బ్యాంకుల నుంచి హోమ్ లోన్ తీసుకుంటూ ఉంటారు. ఈఎంఐ రూపంలో నెలనెలా చెల్లిస్తూ ఉంటారు. 20 ఏళ్ల లోపల చెల్లించే సౌకర్యం ఉండటంతో హోమ్ లోన్ ఎక్కువమంది తీసుకుంటూ ఉంటారు. అయితే హోమ్ లోన్ తీసుకునే సమయంలో చేసే కొన్ని పొరపాట్లు మీకు నష్టం చేకూరుస్తాయి. చిన్న తప్పుకు మీరు రూ.లక్షల్లో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. హోమ్ లోన్ తీసుకునేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

వడ్డీ రేటును నిర్ణయించుకోండి..

హోమ్ లోన్‌కు ఫ్లోటింగ్ లేదా ఫిక్స్ డ్ వడ్డీ రేటులో ఏదైనా ఎంచుకోవచ్చు. ఆర్బీఐ రెపో రేట్లలో మార్పులు చేస్తూ ఉంటుంది. ఫ్లోటింగ్ వడ్డీ రేటును ఎంచుకుంటే ఆర్బీఐ రెపో రేటును తగ్గించినప్పుడు మీకు వర్తించే వడ్డీ రేటు కూడా తగ్గుతుంది. దీని వల్ల మీ నెలవారీ ఈఎంఐ కూడా తగ్గుతుంది. అదే రెపో రేటును పెంచితే మీకు కూడా ఈఎంఐ పెరుగుతుంది. అదే ఫిక్స్ డ్ వడ్డీ రేట్లను ఎంచుకుంటే.. రెపో రేటును తగ్గించినా మీరు ప్రయోజనాలను పొందలేరు. దీని వల్ల మీకు అధిక ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో హోమ్ లోన్ తీసుకునే సమయంలో ఏ ఆప్షన్ తీసుకోవాలి అనేది సరైన నిర్ణయం తీసుకోండి.

ప్రీ పేమెంట్ చేయండి

ఇక భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరిగే ఛాన్స్ ఉందని మీకు అనిపిస్తే మీ లోన్‌లో కొంతమొత్తం ప్రీ పేమెంట్ చేయండి. దీని వల్ల మీరు చెల్లించాల్సిన అసలు తగ్గడం వల్ల వడ్డీ కూడా తగ్గుతుంది. ఇక కొంత కన్వర్షన్ ఛార్జీలు చెల్లించి ఫ్లోటింగ్ రేటుకు మారండి. దీని వల్ల మీకు లాభం జరుగుతుంది. ప్రస్తుతం రెపో రేటును ఆర్బీఐ 5.25 శాతం వద్ద ఉంచింది. గత ఏడాదిలో 1.25 శాతం తగ్గించింది. దీని వల్ల హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గాయి. కొత్తగా హోమ్ లోన్ తీసుకునేవారికి, ఫ్లోటింగ్ రేటు ఆప్షన్ ఎంచుకున్నవారికి లాభం జరుగుతోంది. ఇక మీరు చెల్లించాల్సిన ఈఎంఐను పెంచుకోవడం వల్ల కూడా మీకు బెనిఫిట్ జరుగుతోంది. దీని వల్ల మీకు వడ్డీ అనేది తగ్గుతూ వస్తోంది. ఈ కారణం వల్ల మీ లోన్ కాలపరిమితి కంటే ముందే చెల్లించవచ్చు. ఈ టిప్స్ పాటించడం వల్ల మీరు డబ్బులు ఆదా చేసుకుంటారు.

Follow Us
ఆ నెంబర్ పండ్లను కొంటే డేంజర్ జోన్‌లో పడ్డట్లే..
ఆ నెంబర్ పండ్లను కొంటే డేంజర్ జోన్‌లో పడ్డట్లే..
టీమిండియాకు గుడ్‌బై చెప్పనున్న ఐదుగురు స్టార్ క్రికెటర్లు..!
టీమిండియాకు గుడ్‌బై చెప్పనున్న ఐదుగురు స్టార్ క్రికెటర్లు..!
ఆపిల్, అరటిపండు తినేముందు ఈ వాస్తవాలు తెలుసుకోండి..
ఆపిల్, అరటిపండు తినేముందు ఈ వాస్తవాలు తెలుసుకోండి..
శ్రావణ మాసంలో పాములు ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయి?దీని వెనక కథ ఇదే
శ్రావణ మాసంలో పాములు ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయి?దీని వెనక కథ ఇదే
అందమైన చెలికత్తే.. అప్పట్లో లవర్ బాయ్.. ఫాలోయింగ్ చూస్తే..
అందమైన చెలికత్తే.. అప్పట్లో లవర్ బాయ్.. ఫాలోయింగ్ చూస్తే..
ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. సోమవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. సోమవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్యం చెప్పే 5 రాశులు ఇవే..
దిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్యం చెప్పే 5 రాశులు ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు పెరిగాయా? తగ్గాయా? తాజా రేట్లు
ఈ రోజు బంగారం, వెండి ధరలు పెరిగాయా? తగ్గాయా? తాజా రేట్లు
ఉదయాన్నేఇది సబ్జా సీడ్స్ ఈ ఒక్క గ్లాస్ తాగితే చాలు..
ఉదయాన్నేఇది సబ్జా సీడ్స్ ఈ ఒక్క గ్లాస్ తాగితే చాలు..
ఉదయం ఈ 5 ఫుడ్స్ తింటే రోజంతా ఫుల్ ఎనర్జీ.. కానీ ఈ ఆహారాలను మాత్రం
ఉదయం ఈ 5 ఫుడ్స్ తింటే రోజంతా ఫుల్ ఎనర్జీ.. కానీ ఈ ఆహారాలను మాత్రం