AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: బంగారం ధరలపై మరో అప్డేట్.. పెట్టుబడులకు ఇదే గోల్డెన్ ఛాన్స్..! ఎంతవరకు పెరుగుతాయంటే..?

బంగారం ధరలు మళ్లీ పడిపోతున్నాయి. ప్రస్తుతం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ వారంలో ధరలు ఎలా ఉంటాయనే చర్చ నడుస్తోంది. అయితే ధరలు తగ్గడంతో బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయంగా నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ధరలు పెరుగుతాయని అంచనాలు వేస్తున్నారు.

Gold Prices: బంగారం ధరలపై మరో అప్డేట్.. పెట్టుబడులకు ఇదే గోల్డెన్ ఛాన్స్..! ఎంతవరకు పెరుగుతాయంటే..?
Gold 2
Venkatrao Lella
|

Updated on: Feb 08, 2026 | 8:56 PM

Share

బంగారం, వెండి ధరలు గత కొద్దిరోజులుగా పతనమవుతున్నాయి. గత నెలలో రూ.1.80 లక్షల మార్క్‌కు చేరుకుని ఆల్ టైం రికార్డ్ సృష్టించగా.. ఈ నెలలో వరుసగా కుప్పకూలుతూ వస్తున్నాయి. అమెరికా-ఇండియా మధ్య ట్రేడ్ డీల్ జరగడంతో మళ్లీ స్టాక్ మార్కెట్లు పుంజుకుంటున్నాయి. దీంతో బంగారం నుంచి స్టాక్ మార్కెట్ల వైపు పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ కారణంతో పాటు యూఎస్ డాలర్ మళ్లీ బలపడుతుండటంతో దాని ప్రభావం గోల్డ్ రేట్లపై పడింది. ఇక భారత రూపాయి విలువ గత నెలలో అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే 92 రూపాయిలకు చేరుకుంది. దీంతో గోల్డ్ రేట్లు కూడా దేశంలో పెరిగాయి. ఇప్పుడు రూపాయి విలువ కూడా బలపడటంతో దేశంలో బంగారం రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి.

స్థిరంగా ధరలు

గత నెల జనవరి 29వ తేదీన మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,93,096ని తాకింది. ప్రస్తుతం రూ.లక్షా 55 వేల మధ్య కొనసాగుతున్నాయి. అప్పటి ధరలో పోలిస్తే ఏకంగా బంగారం ధర 20 శాతం వరకు పడిపోయింది. ఇక సిల్వర్ ధరలు కూడా డౌన్ అయ్యాయి. ఎంసీఎక్స్‌లో గత నెలలో కేజీ సిల్వర్ రూ.4 లక్షలకుపైగా పెరగ్గా.. ప్రస్తుతం రూ.2.85 లక్షల వద్ద కొనసాగుతున్నాయి. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 77.33 డాలర్ల వద్ద ఉంది. ఈ వారంలో 8.7 శాతం తగ్గింది. గత నెలలో గోల్డ్ రేట్ల పెరగడంతో చాలామంది అమ్మేశారు. దీంతో ధరలు పడిపోతుండగా.. ఇప్పుడు పసిడి కొనుగోలు చేయవచ్చా.. లేదా అనే అనుమానాలు చాలామందికి వస్తున్నాయి. ఇప్పుడు ధరలు తక్కువగా ఉండటంతో భవిష్యత్తులో పెరిగే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో చాలామంది పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ధరలు పెరుగుతాయా..?

నిపుణుల సమాచారం ప్రకారం ఎంసీఎక్స్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. రూ.1.80 లక్షల వరకు భవిష్యత్తులో మళ్లీ చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక రూ.1.55 లక్షల వద్ద బలమైన డిమాండ్ ఉండగా.. రూ.1.60 లక్షల వరకు స్థిరంగా ఉండొచ్చని చెబుతున్నారు. దీంతో బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే సరైన అవకాశంగా నిపుణులు అంచనా వేస్తారు. కానీ పెట్టుబడులు పెట్టేముందు మార్కెట్ అంచనాలు, రిస్క్‌లను దృష్టిలో పెట్టుకుని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.56 లక్షల వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1.43 లక్షలుగా ఉంది.

Follow Us
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..