AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pan Card: ఈ ట్రాన్సాక్షన్లకు ఇకపై పాన్ కార్డు తప్పనిసరి.. కఠిన రూల్స్ తీసుకొచ్చిన కేంద్రం..

కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డుల విషయంలో కీలక మార్పులు చేసింది. గతంలో ఉన్న నిబంధనలను పూర్తిగా మార్చేసింది. అలాగే ఆర్దిక లావాదేవీలకు పాన్ కార్డులను తప్పనిసరి చేసింది. గతంలో ఉన్న నిబంధనలను మరింత కఠినతరం చేసింది. కొత్త రూల్స్ ఏంటి అనేది చూద్దాం.

Pan Card: ఈ ట్రాన్సాక్షన్లకు ఇకపై పాన్ కార్డు తప్పనిసరి.. కఠిన రూల్స్ తీసుకొచ్చిన కేంద్రం..
Pan Card
Venkatrao Lella
|

Updated on: Apr 28, 2026 | 2:54 PM

Share

పాన్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్. కేంద్రం ప్రభుత్వం రూల్స్‌లో భారీ మార్పులు చేసింది. అధిక విలువ గల ఆర్ధిక లావాదేవీలకు కార్డు అందించడాన్ని తప్పనిసరి చేసింది. నగదు ట్రాన్సాక్షన్లలో పారదర్శకత కోసం కేంద్రం కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇక నుంచి రూ.50 వేలు దాటిన లావాదేవీలకు తప్పనిసరిగా పాన్ అందించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025, ఆదాయపు పన్ను నియమావళి-2026లో కొత్త నియమాలు ప్రవేశపెట్టింది. ఈ మార్గదర్శకాల ప్రకారం పరిమితి దాటిన ఆర్ధిక లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. ఎలాంటి ట్రాన్సాక్షన్లకు కార్డు అవసరం..? పరిమితులు ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఈ పరిమితి దాటితే..

కారు, బైక్, బంగారం, భూమి, ఇల్లు, ఇతర పెట్టుబడులు కొనుగోలుకు సంబంధించి రూ.50 వేలకుపైగా చేసే ట్రాన్సాక్షన్లకు పాన్ కార్డు అవసరం. పాన్ కార్డు లేనప్పుడు గతంలో బంగారం కొనుగోలు, డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్‌కు ఫామ్ 60 ఇస్తే సరిపోయేది. దీని ద్వారా కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలో ఫామ్ 97 తీసుకొచ్చారు. అయితే ఇక నుంచి రూ.50 వేలు దాటిన లావాదేవీలకు ఈ ఫామ్ ఇస్తే సరిపోదు. పాన్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. అలాగే గతంలో పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న పాత అప్లికేషన్ల స్ధానంలో కొత్త వాటిని ప్రవేశపెట్టారు. దీంతో ఈ కొత్త పాన్ నిబంధనల గురించి ప్రతీఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరముంది. దీని వల్ల ఆర్దిక లావాదేవీల విషయంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

వీటికి పాన్ తప్పనిసరి

-క్రెడిట్ కార్డు దరఖాస్తులకు పాన్ తప్పనిసరి చేశారు

-రూ.5 లక్షలకుపైగా విలువైన మోటార్ వెహికల్ కొనుగోలు చేసేటప్పుడు అందించాలి

-డీమ్యాట్ అకౌంట్ తెరిచేందుకు పాన్ తప్పనిసరి చేశారు

-మ్యూచువల్ ఫండ్స్‌, బాండ్లు, డిబెంచర్స్‌లో రూ.50 వేలకు మించి చేసే పెట్టుబడులకు పాన్ తప్పనిసరి

-రూ.10 లక్షలు దాటి చేసే క్యాష్ డిపాజిట్లు, విత్ డ్రాలకు పాన్ అందించాలి

-రూ.లక్ష దాటి చేసే విక్రయ కాంట్రాక్టులు, సెక్యూరిటీ కొనుగోళ్లకు పాన్ అందించాలి

-విదేవీ కరెన్సీ కొనుగోలు, పే ఆర్డర్స్, బ్యాండ్ డ్రాఫ్ట్స్ కొనుగోళ్లు, బ్యాంక్ చెక్కులును ఫామ్ 97 నుంచి తొలగించారు

-ఫామ్ 60,61 స్థానంలో ఫామ్ 97,98 తీసుకొచ్చారు

-కొత్త ఫామ్స్‌లో సరళమైన బాష ఉంటుంది. తప్పులు, పొరపాట్లకు తావులేకుండా ఉంటుంది

-కొత్త ఫామ్స్‌లో టెక్నాలజీ ఆధారిత ప్రాసెస్ అనేది ఉం టుంది.

Follow Us
వీటికి ఇకపై పాన్ కార్డు తప్పనిసరి.. కేంద్రం కొత్త రూల్స్
వీటికి ఇకపై పాన్ కార్డు తప్పనిసరి.. కేంద్రం కొత్త రూల్స్
పిల్లల చదువు కోసం.. ఇదే బెస్ట్‌ ప్లాన్‌!
పిల్లల చదువు కోసం.. ఇదే బెస్ట్‌ ప్లాన్‌!
Vastu Tips: గడియారం ఈ దిశలో ఉందా? ఆర్థిక సమస్యలు తప్పవు! సరైన దిశ
Vastu Tips: గడియారం ఈ దిశలో ఉందా? ఆర్థిక సమస్యలు తప్పవు! సరైన దిశ
బ్యాట్ పట్టుకుని కోహ్లీ దగ్గరకు.. ఆటోగ్రాఫ్ ఇవ్వలేదని ఏం చేశాడంటే
బ్యాట్ పట్టుకుని కోహ్లీ దగ్గరకు.. ఆటోగ్రాఫ్ ఇవ్వలేదని ఏం చేశాడంటే
తాతయ్య పెట్టెలో దొరికిన లైసెన్స్! సైకిల్ తొక్కాలంటే రూల్స్ ఇలా
తాతయ్య పెట్టెలో దొరికిన లైసెన్స్! సైకిల్ తొక్కాలంటే రూల్స్ ఇలా
పుచ్చకాయ తింటే ప్రాణాలు పోతాయా..? ముంబైలో ఫ్యామిలీ మరణాలపై..
పుచ్చకాయ తింటే ప్రాణాలు పోతాయా..? ముంబైలో ఫ్యామిలీ మరణాలపై..
రాత్రంతా హాయిగా నిద్రపోయినా ఉదయం లేవగానే నీరసంగా ఉంటోందా? కారణాలి
రాత్రంతా హాయిగా నిద్రపోయినా ఉదయం లేవగానే నీరసంగా ఉంటోందా? కారణాలి
వేసవి ఎండల వల్ల ముఖం నల్లబడిందా? కేవలం 10 నిమిషాల్లో మీ ముఖాన్ని
వేసవి ఎండల వల్ల ముఖం నల్లబడిందా? కేవలం 10 నిమిషాల్లో మీ ముఖాన్ని
టెక్‌ ఉద్యోగులకు బిగ్‌ అలర్ట్‌..!
టెక్‌ ఉద్యోగులకు బిగ్‌ అలర్ట్‌..!
3 వారాల్లోనే మొండి పొట్ట కొవ్వు ఐస్ క్యూబ్ లాగా కరిగిపోవాలా? ఈ ట
3 వారాల్లోనే మొండి పొట్ట కొవ్వు ఐస్ క్యూబ్ లాగా కరిగిపోవాలా? ఈ ట