OYO Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన ఓయో.. వారికి హోటల్లో ఉచిత బస..
దేశంలోని ప్రసిద్ధ హాస్పిటాలిటీ కంపెనీ OYO రూమ్స్ తన రెగ్యులర్ కస్టమర్ల కోసం ఒక ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఇందులో ఒక కస్టమర్ వారి హోటళ్ల(Hotel)లో వరుసగా 5 రోజులు బస చేస్తే, ఆరో రోజున ఉచిత బస ప్రయోజనం పొందుతారు...
దేశంలోని ప్రసిద్ధ హాస్పిటాలిటీ కంపెనీ OYO రూమ్స్ తన రెగ్యులర్ కస్టమర్ల కోసం ఒక ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఇందులో ఒక కస్టమర్ వారి హోటళ్ల(Hotel)లో వరుసగా 5 రోజులు బస చేస్తే, ఆరో రోజున ఉచిత బస ప్రయోజనం పొందుతారు. OYO లాయల్టీ ప్రోగ్రామ్ విజార్డ్ కింద గోల్డ్ కస్టమర్లు మాత్రమే ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందగలరని కంపెనీ పెర్కోంది. కరోనా(Corona) మహమ్మారి నుంచి కోలుకుంటున్న దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడమే ఈ ఆఫర్ ప్రధాన లక్ష్యమని కంపెనీ తెలిపింది. విజార్డ్ ప్రోగ్రామ్ కింద OYO విజార్డ్ హోటల్ బుకింగ్‌లపై 10% వరకు తగ్గింపును కూడా పొందవచ్చని OYO వెల్లడించింది. OYO 9.2 మిలియన్లకు పైగా సభ్యులతో, OYO విజార్డ్ దేశంలోని ప్రముఖ ట్రావెల్, ఫుడ్ బ్రాండ్‌లచే నిర్వహించబడే అతిపెద్ద లాయల్టీ ప్రోగ్రామ్‌లలో ఒకటి. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ OYO లాయల్టీ ప్రోగ్రామ్‌కు ప్రధాన నగరాలు.
కస్టమర్ల కోసం 13 కంటే ఎక్కువ కంపెనీలతో టై-అప్‌లు OYO విజార్డ్‌లో ప్రస్తుతం 3 తరగతులు ఉన్నాయి. విజార్డ్ బ్లూ, విజార్డ్ సిల్వర్, విజార్డ్ గోల్డ్. గోల్డ్ సభ్యులు మాత్రమే Oyoలో 5 బసలపై ఒక ఉచిత బస ప్రయోజనాన్ని పొందుతారు. సిల్వర్ సభ్యులు ఏడో బస తర్వాత, బ్లూ సభ్యులు ఎనిమిదో బస తర్వాత ఉచిత బసను పొందుతారు. ఇది కాకుండా, OYO తన విజార్డ్ క్లబ్ సభ్యుల కోసం 13కి పైగా టాప్ కంపెనీల నుంచి డిస్కౌంట్ కూపన్‌లు, వోచర్‌లను కూడా అందిస్తోంది. వీటిలో డొమినోస్, లెన్స్ కార్ట్, రెబెల్ ఫుడ్స్ కంపెనీలు ఉన్నాయి. వీటితో ఓయో టై-అప్ అయింది.
సరసమైన ధరలకు విలాసవంతమైన గదులను అందిస్తుంది OYO. భారతీయ హోటల్ మార్కెట్‌లో OYO వాటా కాలక్రమేణా క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రయాణమే కాకుండా ప్రజలు ఏదైనా వ్యాపారం, ఇతర అవసరాల కోసం ఓయో నుంచి గదులను బుక్ చేసుకోవడానికి ఇష్టపడతారు. OYO రూమ్స్ తన వినియోగదారులకు సరసమైన ధరలకు విలాసవంతమైన గదులను అందిస్తుంది. హోటల్ పరిశ్రమలో దీని ఔన్నత్యం రోజురోజుకూ పెరుగుతోంది.
మరిన్ని విషయాలకు ఇక్కడ క్లిక్ చేయండి..