Adani Group: సిమెంట్‌, హెల్త్‌కేర్‌ రంగంలోకి అదానీ గ్రూప్‌.. హెచ్‌ఎల్‌ఎల్‌ హెల్త్‌కేర్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి..

పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ(Gotham Adani) ఇప్పుడు సిమెంట్(Cement) వ్యాపారం తర్వాత హెల్త్‌కేర్(Healthcare) రంగంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు...

Adani Group: సిమెంట్‌, హెల్త్‌కేర్‌ రంగంలోకి అదానీ గ్రూప్‌.. హెచ్‌ఎల్‌ఎల్‌ హెల్త్‌కేర్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి..
Chairman Gautam Adani
Follow us

|

Updated on: May 20, 2022 | 5:06 PM

పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ(Gotham Adani) ఇప్పుడు సిమెంట్(Cement) వ్యాపారం తర్వాత హెల్త్‌కేర్(Healthcare) రంగంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందుకోసం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు అనుబంధంగా అదానీ హెల్త్ వెంచర్స్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా AHVL వైద్య, రోగనిర్ధారణ సౌకర్యాలను ఏర్పాటు చేయడం. నిర్వహించడమే కాకుండా ఆరోగ్య సాంకేతికత ఆధారిత సౌకర్యాలు, పరిశోధన కేంద్రాలు మొదలైనవాటిని ఏర్పాటు చేయనున్నారు. గ్రూప్ హెల్త్ కేర్ రంగంలో దాదాపు రూ.31,088 కోట్లు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీ హెచ్‌ఎల్‌ఎల్ హెల్త్‌కేర్‌ను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్, పిరమల్ హెల్త్‌కేర్ రేసులో ఉన్నాయి. అదానీ హెల్త్ వెంచర్స్ లిమిటెడ్ హెల్త్‌కేర్‌కు సంబంధించిన వ్యాపారాన్ని నిర్వహిస్తుంది.

ఇందులో మెడికల్, డయాగ్నస్టిక్ సేవలు కూడా ఉంటాయి. వైద్య, వైద్య పరీక్షలకు సంబంధించిన సేవలను అందించడమే కాకుండా ఆరోగ్య సాంకేతిక సౌకర్యాలను కూడా అందించనుంది. అదానీ గ్రూప్ సిమెంట్‌ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టనుంది. అంబుజా సిమెట్స్, ACC లను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. అదానీ గ్రూప్ స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్సిమ్ గ్రూప్ నుంచి ఈ రెండు కంపెనీలలో ప్రధాన వాటాను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు పూర్తయితే అదానీ గ్రూప్ దేశంలోనే రెండో అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారుగా అవతరించనుంది.

మరిన్ని బిజినెస్ వార్తలకు ఇక్కడ క్లిక్‌ చేయండి..