MSME Loan: ఔత్సాహిక వ్యాపారవేత్తలకు SIDBI రాయితీ లోన్.. అవకాశం జూలై 31 వరకే.. పూర్తి వివరాలు..

MSME Loan: ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగం చేయటం కంటే సొంతంగా వ్యాపారాలు చేయాలని ఆలోచిస్తున్నారు. అలాంటి వారికి బ్యాంకులు సైతం అనేక పథకాల కింద లోన్స్ అందిస్తున్నాయి. ఇదే సమయంలో

MSME Loan: ఔత్సాహిక వ్యాపారవేత్తలకు SIDBI రాయితీ లోన్.. అవకాశం జూలై 31 వరకే.. పూర్తి వివరాలు..
Msme Loans
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 20, 2022 | 5:08 PM

MSME Loan: ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగం చేయటం కంటే సొంతంగా వ్యాపారాలు చేయాలని ఆలోచిస్తున్నారు. అలాంటి వారికి బ్యాంకులు సైతం అనేక పథకాల కింద లోన్స్ అందిస్తున్నాయి. ఇదే సమయంలో వ్యాపార స్థాపన తరువాత అవసరమైన సలహాలు సూచనలు వంటివాటిని కూడా అందిస్తున్నాయి. తాజాగా..స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) ‘ARISE’ చొరవ కింద.. MSME కేటగిరీ బ్రౌన్‌ఫీల్డ్ యూనిట్ల ఏర్పాటుకు సులభ నిబంధనలు, రాయితీపై రుణాలను అందిస్తోంది. కేవలం రుణాలు ఇవ్వటం మాత్రమే కాక వారి వ్యాపార వృద్ధికి కూడా సహాయపడుతోంది. ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఈ వెెసులుబాటును వినియోగించుకునేందుకు జూలై 31 వరకు గడువు ఉంది.

అర్హతలు: 

  • కంపెనీ కనీసం 24 నెలల పాటు పని చేయాలి
  • చివరిగా ఆడిట్ చేయబడిన ఆర్థిక ఫలితాల్లో కంపెనీ లాభాలను నమోదు చేసి ఉండాలి
  • ప్రమోటర్ CIBIL స్కోర్, కంపెనీ నగదు మార్జిన్ నిష్పత్తి బాగుండాలి

ప్రభుత్వ ప్రాధాన్యత, అధిక వృద్ధి రంగాల్లో వ్యాపారం ఉన్న MSMEలను లక్ష్యంగా చేసుకోవాలి. ఇందులో ఐటీ, హైడ్రోజన్ ఇంధనం, పెట్రోకెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాలు ఉన్నాయి. రుణం మొత్తం ప్రాజెక్ట్ మొత్తంలో గరిష్ఠంగా 80%కి లోబడి, ‘ARISE’ చొరవ కింద రూ.7 కోట్ల వరకు లోన్ మంజూరు అవుతుంది. ఈ లోన్ వడ్డీ రేటు ఫ్లోటింగ్ ప్రాతిపధికన ఉంటుంది. రిజర్వు బ్యాంక్ నిర్ణయించే రెపో రేటుకు అధనంగా 1.50 శాతం నుంచి 2.80 శాతం వరకు వడ్డీ రేటు ఉంటుంది. లోన్ కాలపరిమితి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. మారటోరియం రెండు సంవత్సరాలుగా ఉంటుందని SIDBI నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు