Flipkart: ఫ్లిప్ కార్ట్ సరికొత్త రికార్డులు.. ఆ కస్టమర్ల సంఖ్యను డబుల్ చేసుకున్న కంపెనీ.. కేవలం 7 నెలల్లోనే..

Flipkart: ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ సర్వీస్ ఉపయోగించుకునే కస్టమర్లు నిరంతరం పెరుగుతూనే ఉన్నారు. కేవలం 7 నెలల్లోనే వినియోగదారుల సంఖ్య డబుల్ అయింది.

Flipkart: ఫ్లిప్ కార్ట్ సరికొత్త రికార్డులు.. ఆ కస్టమర్ల సంఖ్యను డబుల్ చేసుకున్న కంపెనీ.. కేవలం 7 నెలల్లోనే..
Flipkart
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 20, 2022 | 4:23 PM

Flipkart: ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ సర్వీస్ ఉపయోగించుకునే కస్టమర్లు నిరంతరం పెరుగుతూనే ఉన్నారు. కేవలం 7 నెలల్లోనే రెండింతలు పెరిగి వినియోగదారుల సంఖ్య దాదాపు 60 లక్షలు దాటింది. 6 మిలియన్ల వినియోగదారులతో పే లేటర్ సింపుల్ తర్వాత ఫ్లిప్‌కార్ట్ రెండవ అతిపెద్ద బై నౌ పే లేటర్ ప్లేయర్‌గా అవతరించింది. ‘పే లేటర్’ సేవ షాపింగ్ అనుభవానికి సరసమైనది, సౌకర్యవంతంగా ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ అంటోంది. ప్రతి నెలా ఎక్కువ మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు చేరుతున్నారు. ప్లాట్‌ఫారమ్‌లో క్రెడిట్ లైన్ కోసం ఎటువంటి పేపర్ వర్క్ లేదా డౌన్ పేమెంట్ అవసరం లేనందున చాలా సౌకర్యవంతమైన చెక్‌అవుట్ అనుభవాన్ని అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

BNPL మార్కెట్ రానున్న 5 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుందని Flipkart ధీరజ్ అనెజా అంటున్నారు.  2026 నాటికి ఈ సంఖ్య 40 బిలియన్ డాలర్లు దాటుతుందని వారు అంచనా వేస్తున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే.. 45% మంది కస్టమర్లు క్రెడిట్ కార్డ్‌ ఉన్నప్పటికీ BNPLతో షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. బై నౌ పే లేటర్ కింద కంపెనీలు వినియోగదారులకు వస్తువులను కొనుగోలు చేయడానికి రుణాన్ని అందిస్తాయి. అంటే డబ్బు లేకపోయినా షాపింగ్ చేసుకోవచ్చు. మీరు ఇచ్చిన కాలవ్యవధిలో వాయిదాల పద్ధతిలో ఆ మెుత్తాన్ని చెల్లింపు చేసే సదుపాయం ఉంటుంది. కంపెనీ ఇచ్చిన గడువులోపు మీరు రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే, దానిపై వడ్డీ లెక్కించటం ప్రారంభమవుతుంది.

ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఆప్షన్‌లో రూ. లక్ష వరకు లోన్ అందుబాటులో ఉంటుంది. కస్టమర్ ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఆప్షన్‌లో గరిష్ఠంగా లక్ష రూపాయల వరకు లోన్‌ పొందుతారు. కస్టమర్ క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా ఈ లోన్ పరిమితి ఉంటుంది. రుణాన్ని పొందడం ద్వారా కస్టమర్ ఒక నెలలో అనేక కొనుగోళ్లు చేయవచ్చు. కంపెనీ పాలసీ ప్రకారం 30 రోజుల్లోపు రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుణాన్ని కొనుగోలుదారులు సులభమైన వాయిదాల్లో తిరిగి చెల్లించవచ్చు. దీని కారణంగా వినియోగదారులకు అనేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి