
ప్రపంచవ్యాప్తంగా ఎబోలా ఆందోళన రేకెత్తిస్తోంది. భారత్ కూడా అప్రపత్తమై ఎయిర్‌పోర్టుల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తోంది. భారత్‌లో ప్రభావం ప్రస్తుతానికి తక్కువగానే ఉండటంతో ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నాయి. అయితే ఎబోలాకు అరికట్టేందుకు వ్యాక్సిన్ తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మూడు నెలల్లో దీనికి వాక్సిన్ తీసుకొచ్చేందుకు ప్రయోగాలు జరుగుతున్నట్లు ఆక్స్‌ఫోర్డ్ సైంటిస్టులు తెలిపారు. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్‌ను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. వ్యాక్సిన్‌పై ఆ సంస్థ వేగంగా పనిచేస్తోంది. దీంతో రెండు లేదా మూడు నెలల్లో క్లీనికల్ గ్రేడ్ వ్యాక్సిన్ డోస్‌లను సిద్దం చేసే ప్రక్రియ చేపట్టింది.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు పూణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో కలిసి వ్యాక్సిన్ అభివృద్ది చేస్తున్నారు. ఉగాండా, దక్షిణ సూడాన్‌లో ప్రస్తుతం వ్యాక్తి చెందుతున్న ఎబోలా రకానికి వ్యాక్సిన్‌ను డెవలప్ చేస్తున్నారు. ఇప్పటికే జంతువులపై టెస్టులు జరుగుతున్నట్లు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ తెరెసా లాంబే ప్రకటించారు, సింగిల్ డోస్ ఎబోలా వ్యాక్సిన్‌ను తయారుచేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఎబోలా జైర్ వ్యాక్సిన్ లైసెన్స్ పొందగా.. అదే తరహాలో సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకొస్తున్నారు. కరోనాకు వ్యతిరేకంగా ఆక్స్‌ఫర్డ్ ఏ జెడ్ వ్యాక్సిన్ తయారు చేయగా.. దాని సృష్టికర కూడా ప్రొఫెసర్ లాంబే కావడం గమనార్హం.
కరోనా వ్యాక్సిన్ కోసం ఉపయోగించిన ChAdOx ప్లాట్‌ఫారం ఆధారంగా ఎబోలా వ్యాక్సిన్ అభివృద్ది చేస్తున్నారు. ఈ సాంకేతికత వేగంగా ముందుకు సాగేలా చేస్తుందని అంటున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ మాట్లాడూతు.. ఉగాండా, కాంగోలో ఎబోలా వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. మరణాల సంఖ్య ఇప్పటివరకు 220కి చేరుకుందన్నారు. ప్రస్తుతం బండిబుగ్యో వైరస్ రకంవల్ల మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ రకాన్ని నివారించేందుకు ఎలాంటి వ్యాక్సిన్, నిర్ధిష్ట చికిత్స విధానం లేదు. దీంతో దాని కోసం వేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యాధి సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉండే ఎక్కువ రిస్క్ ఉన్నవారి కోసం నివారణ ప్రయోగాలు చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యాధి నిర్ధారణ అయిన వ్యక్తి చుట్టూ ఉన్నవారికి టీకాలు వేయడం లేదా నివారణ చికిత్స అందిస్తారు. రక్షణ కోసం యాంటీబాడీలు, టి-కణాలు రెండూ ముఖ్యమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.