AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. స్టేషన్లలో ఫుడ్‌ రేట్స్ పెంపు.. ఇదిగో కొత్త లిస్ట్!

Central Railway Food Price Hike: రైళ్లలో ప్రయాణించే వారికి ఇదో బిగ్‌ అలర్ట్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే జూన్ 1 నుంచి రైల్వే స్టేషన్లలో దొరికే వడా పావ్, సమోసా, దోశ, ఇడ్లీల వంటి ఆహార పదార్థాల ధరలు పెరగనున్నాయి. రైల్వే స్టేషన్‌లో ఉండే చిన్న స్టాల్‌ వ్యాపారులను ప్రోత్సహించేందుకు రైల్వేశాఖ ధరల పెంపునకు ఆమోదం తెలిపింది. అయితే ఫుడ్‌ క్వాలిటీలో ఏ మాత్రం తేడా వచ్చినా చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ హెచ్చరించింది. ప్రతి స్టాల్‌లో ధరలకు సంబంధించిన బోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపింది.

Anand T
|

Updated on: May 27, 2026 | 7:48 PM

Share
సెంట్రల్ రైల్వే ప్రకారం.. రైల్వే స్టేషన్‌లలోని చిరు వ్యాపారులను ప్రోత్సహించేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. స్టేషన్లలో ఈ చిరు వ్యాపారులు అమ్మే ఆహారాల ధరల పెంపునకు ఆమోదం తెలిపింది. ఈ కొత్త రేట్ లిస్ట్ జూన్ 1 నుండి అన్ని స్టేషన్లలో అమలులోకి వస్తుందని రైల్వేశాఖ స్పష్టం చేసింది. తాజాగా పెరిగిన ధరలు చూసుకుంటే.. 50 గ్రాముల ఆలూ వడ ధర రూ. 15 కు చేరనుంది. దీనితో పాటు ఇచ్చే ఒక పావ్ ధర రూ. 5 గా ఉంటుంది. అంటే, ప్రతి స్టేషన్‌లో ఇకపై మీరు వడపావ్ కొనేందుకు గతంలో కంటే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

1 / 5
కొత్త ధరల ప్రకారం.. వెజ్ సమోసా, వెజ్ పఫ్, సాబుదానా వడ ధరలు రూ. 20 కి పెరిగాయి. అలాగే పావ్ భాజీ ధర రూ. 50 కి చేరింది. వెజ్ పిజ్జా కూడా ఇప్పుడు రూ. 50 కే ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. రైల్వే స్టేషన్లలో ప్రయాణ సమయంలో ఈ ఐటమ్స్ చాలా పాపులర్. కొత్త ధరలు అమలులోకి వచ్చిన తర్వాత ప్రయాణికుల ఆహార బడ్జెట్ కొంత పెరిగే అవకాశం ఉంది.

2 / 5
ఇక నార్త్ ఇండియన్ ఫుడ్‌తో పాటు మన సౌత్ ఇండియన్ ఫుడ్ ధరలు కూడా పెరిగాయి. ఇప్పుడు రైల్వే స్టేషన్‌లో ఒక మసాలా దోశ కొనాలంటే రూ. 35 చెల్లించాలి. అలాగే సాంబార్, చట్నీతో కూడిన 2 ఇడ్లీలు కొనాలంటే రూ. 30 చెల్లించాలి. రైల్వే స్టేషన్లలో దోశ, ఇడ్లీలను ప్రయాణికులు ఎంతో ఇష్టంగా తింటారు. అటువంటి పరిస్థితిలో ఈ మార్పు చాలా మంది ప్రయాణికుల జేబులపై ప్రభావం చూపవచ్చు.

3 / 5
అయితే రైల్వే శాఖ అన్ని రకాల ఆహారాల ధరలను పెంచలేదు. కేవలం కొన్నింటిపై మాత్రమే ధరలను పెంచింది. గతంలో మాదిరిగానే మిసల్ పావ్ రూ. 35 కే లభిస్తుంది. కచోరీ కూడా పాత రేటు అంటే రూ. 15 లకే లభిస్తుంది. అలాగే దాబేలీ గతంలో మాదిరే రూ. 20 గా ఉంది. అంటే కొన్నింటిపై మాత్రమే ధరలు పెరిగాయి, మిగతా ఆహార పదార్థాలు పాత రేట్లకే ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి.

4 / 5
అయితే ఇక్కడ ప్రయాణికులకు ఊరట కల్పించే విషయం కూడా ఒకటి ఉంది. ధరలు పెంచినందున ఆహార నాణ్యతను ఖచ్చితంగా పెంచాలని రైల్వే స్పష్టం చేసింది. నాణ్యతను తనిఖీ చేయడానికి రైల్వే అధికారులు రెగ్యులర్‌గా వస్తారని తెలిపింది. అలాగే ప్రయాణికుల నుండి అదనపు వసూళ్లను అరికట్టడానికి, ప్రతి స్టాల్ యజమాని రెండు భాషలలో స్పష్టంగా కనిపించేలా రేట్ లిస్ట్‌ను బోర్డుపై ఏర్పాటు చేయాలని తెలిపింది.

5 / 5
Follow Us
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. స్టేషన్లలో ఫుడ్‌ రేట్స్ పెంపు

అప్పట్లోనే మణికొండలో ఇల్లు కట్టా.. ఇఫ్పుడు ధర ఎంతంటే..

రోల్డ్‌గోల్డ్‌ నగలు వేసుకుంటే చర్మంపై దురద వస్తోందా? ఇలా చేస్తే..

ఇవి తింటే మీ బాడీ ఇమ్యూనిటీకి పవర్ హౌస్‌లా మారిపోతుంది!

'నాన్న ఎందుకో వెనకబడ్డాడు'.. హృదయాలను తాకే కవిత

పెరుగన్నంలో మామిడిపండు వేసుకుని తింటున్నారా?.. ఎంత డేంజరో..

ఐపీఎల్‌లో ఎంత బాదినా భారత జట్టులో పటిదార్‌కు చోటు కష్టమే ?

మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాలో హీరోయిన్‏గా నేనే చేయాల్సింది.. కానీ..

పాన్ ప్రియులరా హెచ్చరిక! కిళ్లీ అందరికీ సెట్ కాదు,వీరికి డేంజర్

టాలీవుడ్‏లో ఆ ముగ్గురు హీరోలు అంటే చాలా ఇష్టం..