Online Jewellery Order ఆన్‌లైన్‌లో నగలను ఆర్డర్ చేస్తున్నారా..? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి
ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ పెరిగిపోయింది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న వినియోగదారులు ఎక్కువగా ఈ-కామర్స్ సైట్లను ఆశ్రయిస్తున్నారు. ఈ-కామర్స్ దిగ్గజాలు వినియోగదారులను మరింతగా ఆకర్షించేందుకు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అలాగే ప్రముఖ నగల వ్యాపారులందరూ..
ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ పెరిగిపోయింది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న వినియోగదారులు ఎక్కువగా ఈ-కామర్స్ సైట్లను ఆశ్రయిస్తున్నారు. ఈ-కామర్స్ దిగ్గజాలు వినియోగదారులను మరింతగా ఆకర్షించేందుకు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అలాగే ప్రముఖ నగల వ్యాపారులందరూ ఆన్‌లైన్‌లో బంగారు నగలను అమ్ముతున్నారు. ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో కనిపించే నగలు చూడగానే వెంటనే ఆర్డర్ చేసేలా ఉంటాయి. వినియోగదారులు కూడా చాలా మంది నగలు, క్వాలిటీ, హాల్‌మార్క్ లాంటివాటిపై పూర్తిగా అవగాహన ఉందా? అయితే మీరు ఏమాత్రం ఆలోచించకుండా ఆన్‌లైన్‌లో నగలు కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో నగలు ఆర్డర్ చేసే ముందు ఓసారి వివరాలన్నీ చెక్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ఆ వివరాలను స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవాలి. ఫోటో చూసి ఆర్డర్ చేయకుండా డిస్క్రిప్షన్‌లోని వివరాలన్నీ పూర్తిగా చదవకుండా ఎట్టి పరిస్థితుల్లో ఆర్డర్ చేయవద్దు. నగల క్వాలిటీ హాల్‌మార్క్, మేకింగ్ ఛార్జీల వివరాలు తప్పకుండా తెలుసుకోవాలి.
నగలు డెలివరీ అయిన తర్వాత అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. నగలను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయాలనుకుంటే చాలా రకాల వెరైటీలు ఉంటాయి. షాపులో అయితే కొన్ని డిజైన్లు మాత్రమే చూపిస్తారు. కానీ ఆన్‌లైన్‌లో బోలడన్నీ డిజైన్‌లు ఉంటాయి. వాటిలో మీకు నచ్చినది ఎంపిక చేసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేముందు గుర్తించుకోవాల్సిన విషయాలు..
ఆన్‌లైన్‌లో నగలు ఆర్డర్ చేసేముందు రిటర్న్, రీప్లేస్ ఆప్షన్స్ ఉన్నాయో లేదో అనే విషయాన్ని ముందుగా చెక్ చేసుకోవాలి. రిటర్న్, రీప్లేస్ పాలసీ నియమని బంధనలు పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. మీకు ఒకవేళ నగలు నచ్చకపోతే వెనక్కి పంపే అవకాశం ఉందా లేదా? అనే విషయాన్ని చూసుకోవాలి. అయితే షాపులో అయితే మీరు నగలను స్వయంగా పరిశీలించే అవకాశం ఉంటుంది. కానీ ఆన్‌లైన్‌లో అలాంటిదేమి ఉండదు. ఫోటోలను చూసి ఆర్డర్ చేయడం తప్ప ఇంకేమి ఉండదు. అందుకే నగల ఆర్డర్ చేసిన తర్వాత నచ్చకపోతే ఏ మాత్రం ఆలోచించకుండా రిటర్న్ పెట్టుకోవాలి.
ఆఫర్లను చెక్ చేసుకోండి..
ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్ చేసే ముందు డిస్కౌంట్లు, ఆఫర్ వివరాలను చెక్ చేసుకోవడం మంచిది. నగల షాపులన్నీ ఆఫర్స్ అందిస్తాయి. ముఖ్యంగా ధంతేరాస్, అక్షయ తృతీయ లాంటి సందర్భాల్లో ఈ ఆఫర్లు ఎక్కువగా ఉంటాయి. ఆన్‌లైన్‌లో నగలు కొనడానికి ఏ వెబ్‌సైట్ కనిపిస్తే ఆ వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేయవద్దు. కొన్ని మోసపూరితమైన సైట్లు కూడా ఉంటాయి. అలాంటి సైట్లలో ఆర్డర్ చేస్తే మోసపోయే ప్రమాదం ఉందని గుర్తించుకోండి. మంచి పేరున్న వెబ్‌సైట్ల నుంచి మాత్రమే చేసుకోవాలి. ప్రముఖ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి సంస్థలు కూడా ఆన్‌లైన్‌లో నగలను అమ్ముతున్నాయి. సెల్లర్స్ వివరాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆర్డర్ చేసేముందు ఆ ప్రోడక్ట్‌కు సంబంధించి రేటింగ్ చూసుకోవాలి. ఇన్నవి చూసిన తర్వాతే ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడం మంచిది. అవేమి చూడకుండా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తే నిలువునా మోసపోయే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి