Opec: ముడిచమురు ఉత్పత్తి స్థిరంగా కొనసాగించాలని ఒపెక్ నిర్ణయం.. మరి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?..

అంతర్జాతీయంగా ముడి చమురు ధర తగ్గితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయని అందరు భావించారు. కానీ అంతర్జాతీయంగా ముడి చమురు ఉత్పత్తిని స్థిరంగా కొనసాగించాలని ఒపెక్, ఒపెక్ అనుబంధ దేశాలు నిర్ణయించాయి....

Opec: ముడిచమురు ఉత్పత్తి స్థిరంగా కొనసాగించాలని ఒపెక్ నిర్ణయం.. మరి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?..
Opec
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 03, 2021 | 7:18 AM

అంతర్జాతీయంగా ముడి చమురు ధర తగ్గితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయని అందరు భావించారు. కానీ అంతర్జాతీయంగా ముడి చమురు ఉత్పత్తిని స్థిరంగా కొనసాగించాలని ఒపెక్, ఒపెక్ అనుబంధ దేశాలు నిర్ణయించాయి. దీంతో ఇప్పట్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం కనిపించట్లేదని తెలుస్తుంది. కొవిడ్‌ వైరస్‌ పరిణామాల నుంచి కోలుకుంటున్న అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు సరికొత్త ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఆందోళన కలిగిస్తున్నా, భవిష్యత్తు గిరాకీపై స్పష్టత లేకున్నా ఒపెక్‌ తన నిర్ణయం మార్చుకోలేదు.

సౌదీ అరేబియా ఆధ్వర్యంలోని ఒపెక్‌ దేశాలు, రష్యా ఆధ్వర్యంలోని ఒపెక్‌ అనుబంధ దేశాలు ఇంతకు ముందు నిర్ణయించిన విధంగానే నెలవారీ ఉత్పత్తికి కట్టుబడి ఉండడానికి జై కొట్టాయి. అమెరికాతో పాటు చమురును అధికంగా వినియోగించే దేశాలు మాత్రం ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, మరింత అధికంగా చమురు ఉత్పత్తి చేయాలని కోరుతున్నాయి. ధరల పెంపును అడ్డుకునేందుకు వ్యూహాత్మక నిల్వలను విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నిర్ణయంతో భారత్‌ కూడా ఇందులో భాగమవుతున్న సంగతి తెలిసిందే. వారం కిందట అమెరికా చమురు బ్యారెల్‌ ధర 78 డాలర్లు ఉండగా.. కొవిడ్‌ ఒమిక్రాన్‌ భయాలతో గురువారం 67 డాలర్లకు తగ్గింది.

మళ్లీ లాక్‌డౌన్‌ ఆంక్షలు విధిస్తారా, రాకపోకలు, ఆర్థిక కార్యకలాపాలు తగ్గి, చమురుకు గిరాకీ క్షీణిస్తుందా.. అనే అంచనాలే ఇందుకు కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్రెంట్‌ చమురు ధర కూడా 79 డాలర్ల నుంచి 70 డాలర్లకు తగ్గింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవిడ్‌ వ్యాక్సిన్లు కొత్త వేరియంట్‌పై ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయనే విషయమై స్పష్టత వచ్చాకే, చమురు ఉత్పత్తిపై నిర్ణయం తీసుకుంటామని ఒపెక్‌ అనుబంధ దేశాలు తెలిపారు.

Read Also.. Own House: ఇల్లు కట్టాలని అనుకుంటున్నారా.. వెంటనే కట్టేసుకోండి.. కొద్దిరోజులు ఆగితే కష్టమే.. ఎందుకంటే..

అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్