AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Online Shopping: భారత్‌లో ఆన్‌లైన్ షాపింగ్ గురించి విస్తుపోయే విషయాలు..! తెలిస్తే అవాక్కే..

భారతదేశ మొత్తం రిటైల్ అమ్మకాలలో ఈ-కామర్స్ వాటా 7శాతం. ఇంటర్నెట్ ఉపయోగించే 850 మిలియన్ల మందిలో 25శాతం కంటే తక్కువ మంది ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ రాబోయే కాలంలో మరింత వృద్ధి చెందుతుందని మెకిన్సే నివేదిక తెలిపింది.

Online Shopping: భారత్‌లో ఆన్‌లైన్ షాపింగ్ గురించి విస్తుపోయే విషయాలు..! తెలిస్తే అవాక్కే..
Online Shopping
Krishna S
|

Updated on: Jul 28, 2025 | 8:48 PM

Share

ఇప్పుడు అంతా ఆన్‌లైన్ మయం. ఏది కొనాలన్న, ఏది తినాలన్న ఆన్‌లైన్‌నే ఆశ్రయిస్తున్నారు జనాలు. ఆన్‌లైన్ షాపింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు ఈ కామర్స్ సంస్థలు, కొన్ని యాప్స్ మంచి మంచి ఆఫర్స్ ఇస్తుండడంతో ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే కొంటున్నారు. అయితే ఆన్‌లైన్ షాపింగ్‌కు సంబంధించి మెకిన్సే నివేదిక సంచలన విషయాలను బయటపెట్టింది. కేవలం 20 నుంచి 25 శాతం మంది మాత్రమే ఆన్‌లైన్ షాపింగ్‌ చేస్తున్నారని తేలింది. అంటే 850 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులలో 200 మిలియన్ల కంటే తక్కువ మంది మాత్రమే ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారు.

ఇతర దేశాలతో పోలిస్తే..?

అమెరికా, చైనా మొదలైన అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే, మన దేశంలో ఈ-కామర్స్ వ్యాపారం తక్కువ స్థాయిలోనే ఉంది. ఆ దేశాలలో 85 శాతం కంటే ఎక్కువ మంది ఇంటర్నెట్ యూజర్స్ ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారు. కానీ మన దగ్గర అది 20-25 శాతం మాత్రమే ఉంది. అయితే భవిష్యత్ లో ఇది భారీగా పెరిగే అవకాశం ఉందని మెకిన్సే నివేదిక అంచనా వేస్తోంది. దీనికి నిదర్శనమే గత కొన్నేళ్లుగా దేశంలో ఈ-కామర్స్ కార్యకలాపాలు బలంగా పెరుగడం. ఇప్పుడిప్పుడే ఆన్‌లైన్ షాపింగ్ బాగా పెరుగుతోంది. అలాగే ఈ రంగంలో కొత్త కొత్త ఆవిష్కరణలు కనిపిస్తున్నాయి. వస్తువులను చాలా త్వరగా డెలివరీ చేసే క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి వచ్చాయి.

భారత్‌లో 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రిటైల్ అమ్మకాలలో ఈ-కామర్స్ వాటా 7 నుండి 9 శాతం మాత్రమే ఉంవది. 2024 – 25కు వచ్చేసరికి అది పెరిగింది. ఇక రానున్న నాలుగు నుండి ఐదేళ్లలో రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. 2030 నాటికి రిటైల్ అమ్మకాలలో ఈ-కామర్స్ వాటా 15 నుండి 17 శాతం ఉంటుందని అంచనా. ఇప్పటికే ఎన్నో సంస్థలు వేగంగా డెలివరీ చేస్తున్నాయి. టైర్-టూ, టైర్-త్రీ నగరాల నుండి ఆన్‌లైన్ షాపింగ్‌కు డిమాండ్ పెరుగుతోంది. మెట్రో, టైర్-వన్ నగరాల కంటే ఈ నగరాల్లో వేగంగా ఆదాయ వృద్ధి ఉంది. టైర్-టూ నగరాల్లో నెలవారీ ఆదాయాలు 2023-2024 మధ్య 18 శాతం పెరిగాయి. ఇది పెద్ద నగరాల్లో కనిపించే వృద్ధి కంటే ఎక్కువ.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..