Home Loan: పాత ప్రాపర్టీపై లోన్ వస్తుందా? బ్యాంక్ ఏ విషయాలు పరిశీలిస్తుంది?

రుణం ఇవ్వడానికి ముందు, బ్యాంక్ ఇల్లు ఉన్న ప్రదేశం అలాగే దాని ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తుంది. నిర్మాణాన్ని లోకల్ అధరిటీస్ ఆమోదంతో నిర్మించినట్టయితే.. లోన్ మంజూరు చేయడంలో ఎటువంటి సమస్యలు ఉండవు. లోన్ మొత్తాన్ని నిర్ణయించడంలో ఇంటి వయస్సు ఎలాంటి పాత్ర పోషించదు. అమోదించిన హోమ్ లోన్ మొత్తం రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదట, ఆస్తి మార్కెట్ విలువ అలాగే రెండవది కొనుగోలుదారు ఆర్థిక స్థితిపై ఆధార..

Home Loan: పాత ప్రాపర్టీపై లోన్ వస్తుందా? బ్యాంక్ ఏ విషయాలు పరిశీలిస్తుంది?
Home Loan
Follow us
Subhash Goud

|

Updated on: Aug 18, 2023 | 6:32 PM

కొత్త ఇల్లు గానీ, పాత ఇల్లు గానీ తీసుకోవాలని భావించే వారికి ఆర్థిక సమస్య అడ్డు వస్తుంది. కానీ బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం వల్ల కొంత వెసులుబాటు కలుగుతుంది. అయితే పాత ఇంటికి లోన్‌ వస్తుందా ? లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. లోన్ కోసం ప్రాపర్టీ పాతదా.. కొత్తదా అనే పట్టింపు ఉండదు. పాత సొసైటీలో ఫ్లాట్ కొనడానికి హోమ్ లోన్ పొందవచ్చు. అయితే, ఎవరైనా హోమ్ లోన్ పొందగలరా? లేదా? అనే దానిపై ప్రభావం చూపే కొన్ని అంశాలు ఉన్నాయి.

రుణం ఇవ్వడానికి ముందు, బ్యాంక్ ఇల్లు ఉన్న ప్రదేశం అలాగే దాని ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తుంది. నిర్మాణాన్ని లోకల్ అధరిటీస్ ఆమోదంతో నిర్మించినట్టయితే.. లోన్ మంజూరు చేయడంలో ఎటువంటి సమస్యలు ఉండవు. లోన్ మొత్తాన్ని నిర్ణయించడంలో ఇంటి వయస్సు ఎలాంటి పాత్ర పోషించదు. అమోదించిన హోమ్ లోన్ మొత్తం రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదట, ఆస్తి మార్కెట్ విలువ అలాగే రెండవది కొనుగోలుదారు ఆర్థిక స్థితిపై ఆధార పడి ఉంటుంది అని బ్యాంకింగ్ నిపుణుడు సురేశ్ బన్సాల్ చెబుతున్నారు. వయస్సు, క్రెడిట్ హిస్టరీ, నెలవారీ ఆదాయం, కొనుగోలుదారుడు రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించగల సామర్థ్యం అన్నిటినీ బేరీజు వేసిన తరువాత వారు ఎంత లోన్ కోసం అర్హులో నిర్ణయిస్తారు. అయితే, బ్యాంకు మొదటగా ఆస్తికి సంబంధించిన వాల్యుయేషన్, చట్టపరమైన విచారణను నిర్వహిస్తుంది. వీటిలో ఎ ఒక్కదాన్నీ వదలకుండా బ్యాంకులు పరిశీలిస్తాయి.

వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది?

పాత ప్రాపర్టీ విలువను నిర్ధారించడానికి బ్యాంకులు నిపుణుల సహాయాన్ని కోరుతాయి. ఇందుకోసం వారు ఏజెన్సీలను నియమించుకున్నారు. కొన్ని బ్యాంకులు తమ ప్రొఫెషనల్ ప్యానెల్‌లో కనస్ట్రక్షన్ ఎక్స్ పర్ట్ ని కూడా ఉంచుతాయి. రుణం మంజూరు చేయడానికి ముందు, బ్యాంకులు వాటి ద్వారా ప్రాపర్టీ వాల్యూ నిర్ణయిస్తాయి. సమీపంలోని ప్రాపర్టీల పరిస్థితి ఆ ప్రదేశం.. అక్కడి ధరలు నిర్దిష్ట ప్రాపర్టీ వాల్యూ అంచనా వేయడానికి ఆధారంగా ఉంటాయి. వాల్యుయేషన్ టీం రిపోర్ట్ ఆధారంగా లోన్ మొత్తం ఆమోదిస్తారు.

ఇవి కూడా చదవండి

లీగల్ రిపోర్ట్ కూడా ఉండాలి

బ్యాంకింగ్ – హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు లోన్ ఇచ్చే ముందు లోన్ రీపేమెంట్ నిర్ధారించుకుంటాయి. వివాదాస్పదమైన లేదా మోసపూరితమైన ఆస్తిని ఏ వ్యక్తి తాకట్టు పెట్టడం లేదనీ.. అలాగే అటువంటి ప్రాపర్టీ తీసుకుని లోన్ కోసం ప్రయత్నం చేయడం లేదనీ బ్యాంకులు నిర్ధారించుకుంటాయి. అందుకోసం ప్రాపర్టీ పై పూర్తి స్థాయిలో విచారణ చేస్తాయి. దీని కోసం ప్రత్యేకంగా లీగల్ ఎడ్వైజర్లను బ్యాంకులు ఏర్పాటు చేసుకుంటాయి. వీరి ద్వారా బ్యాంకులు లోన్ కోసం వచ్చిన ప్రాపర్తీపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాయి. ఈ చట్టపరమైన టీం ప్రాపర్టీ లింక్ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. సేల్ డీడ్ వెరిఫై చేస్తుంది. అలాగే ప్రాపర్టీ ఎన్నిసార్లు ఇంతకూ ముందు అమ్మకానికి వెళ్ళింది. ఎక్కడైనా చట్టపరమైన వివాదాలతో చిక్కుకుందా వంటి అంశాలనూ పరిశీలిస్తుంది. ఇవన్నీ క్లియర్ గా ఉంటె లీగల్ టీం ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా మాత్రమే బ్యాంక్ లోన్ ఫైల్‌ ముందుకు వెళుతుంది. ప్రాపర్టీ మార్కెట్ విలువ రూ.50 లక్షలు. సర్కిల్ రేటు ప్రకారం ఫ్లాట్ ధర రూ.40 లక్షలు. మీకు చక్కటి నెలవారీ జీతం, మంచి క్రెడిట్ హిస్టరీ అలాగే ఇతర EMIలు లేనప్పుడు అందువల్ల బ్యాంక్ ప్రాపర్టీ విలువలో 85% వరకు రుణాన్ని అందించవచ్చు.

మీకు 40 సంవత్సరాలు అనుకుందాం. అటువంటప్పుడు సులభంగా 20 సంవత్సరాల రీపెమేంట్ షెడ్యూల్ తో లోన్ పొందవచ్చు. మంజూరు అయిన లోన్ మొత్తాన్ని ఫ్లాట్ వయస్సు ప్రభావితం చేయదు. మీరు కూడా పాత ప్రాపర్టీని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే మీరు ఇప్పుడు కొంత ఊపిరి పీల్చుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇప్పటికే ఉన్న సొసైటీలో ఫ్లాట్ కొనుగోలు చేయడానికి కూడా హోం లోన్ పొందవచ్చు. అయితే మీరు ఇంటిని కొనుగోలు చేసే ముందు దాని పరిస్థితి అలాగే అది ఉన్న ప్రదేశాన్ని క్షుణ్ణంగా అంచనా వేసుకున్నారని నిర్ధారించుకోండి. తద్వారా మీరు మీ నిర్ణయానికి తర్వాత బాధపడే అవసరం రాదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు