Ola Electric Offers: ఓలా.. ఆఫర్లు అదిరిపోలా.. ఈ ఒక్క రోజే అవకాశం.. మిస్ చేసుకోవద్దు..

దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీదారు ఓలా ఎలక్ట్రిక్ అదిరే ఆఫర్లను అందిస్తోంది. ఇయర్ ఎండింగ్ సేల్లో భాగంగా అనేక ప్రయోజనాలతో కూడిన ఆఫర్లను ప్రకటించింది. బెంగళూరుకు చెందిన ఈ ఈవీ మేకర్ తన కస్టమర్లకు ఇచ్చే వారంటీలపై పలు డిస్కౌంట్లను అందిస్తోంది. అలాగే రివార్డులు, క్యాష్ బ్యాక్ లు కూడా ఇస్తోంది. ఈ బెనిఫిట్స్ కి కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే అవకాశం ఉంది. అంటే డిసెంబర్ 10 వరకూ ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి.

Ola Electric Offers: ఓలా.. ఆఫర్లు అదిరిపోలా.. ఈ ఒక్క రోజే అవకాశం.. మిస్ చేసుకోవద్దు..
Ola S1 X Plus Electric Scooter

Edited By:

Updated on: Dec 10, 2023 | 2:14 PM

దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీదారు ఓలా ఎలక్ట్రిక్ అదిరే ఆఫర్లను అందిస్తోంది. ఇయర్ ఎండింగ్ సేల్లో భాగంగా అనేక ప్రయోజనాలతో కూడిన ఆఫర్లను ప్రకటించింది. బెంగళూరుకు చెందిన ఈ ఈవీ మేకర్ తన కస్టమర్లకు ఇచ్చే వారంటీలపై పలు డిస్కౌంట్లను అందిస్తోంది. అలాగే రివార్డులు, క్యాష్ బ్యాక్ లు కూడా ఇస్తోంది. ఈ బెనిఫిట్స్ కి కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే అవకాశం ఉంది. అంటే డిసెంబర్ 10 వరకూ ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇంతకీ ఎంటా ఆఫర్స్ తెలుసుకుందాం రండి..

  • ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ఎక్స్ టెండెడ్ వారంటీని కొనుగోలు చేసిన వారికి 50శాతం వరకూ డిస్కౌంట్ ను ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. ఇది ఈ ఆదివారం(డిసెంబర్ 10)లోపు వినియోగించుకున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది.
  • అలాగే కొత్త కొనుగోలుదారులకు రిఫరల్ ఇస్తే వారికి ప్రతి రిఫరల్ పై రూ. 2000 క్యాష్ ప్రైజ్ ఇస్తారు.
  • అంతేకాక మీరు ఇప్పటికే వినియోగదారు అయి ఉండి.. కొత్త వినియోగదారుకు రిఫర్ చేస్తే పై రూ. 2000తో పాటు మరో రూ. 3000 వరకూ క్యాష్ బ్యాక్ ఉండే అవకాశం ఉంది.

ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ పై రూ. 20,000 తగ్గింపు..

ఇయర్ ఎండింగ్ సేల్లో భాగంగా ఓలా ఇవి ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇదే కాక ఈ ఈవీ మేకర్ తన లేటెస్ మోడల్ స్కూటర్ ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ స్కూటర్ పై రూ. 20,000 తగ్గింపు అందిస్తోంది. దీనిని కేవలం రూ.90,000 ఎక్స్ షోరూం ధరకే అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్ ఈ నెలాఖరు వరకూ అందుబాటులో ఉంటుంది. వాస్తవానికి ఈ స్కూటర్ లాంచింగ్ అప్పుడు రూ. 1,09,999(ఎక్స్ షోరూం)గా పేర్కొంది.

ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ స్పెస్పిఫికేషన్స్..

ప్రస్తుతం ఓలా నుంచి అందుబాటులో ఉన్న అతి తక్కువ బడ్జెట్ స్కూటర్ ఇదే. దీనిలో 3కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. ఇది 151కిలోమీటర్ల రేంజ్ సింగిల్ చార్జ్ పై ఇస్తుందని సర్టిఫై చేస్తోంది. మోడ్లను బట్టి రేంజ్ మారుతుంది. ఎకో మోడ్లో 125కిలోమీటర్లు, నార్మల్ మోడ్లో 100కిలోమీటర్లు తప్పనిసరిగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. 500కిలోవాట్ల హోమ్ చార్జర్ తో కేవలం 7.4గంటల్లో బ్యాటరీ ఫుల్ చార్జ్ అవుతుంది. ఈ స్కూటర్ మూవ్ ఓఎస్ 4 తో సాఫ్ట్ వేర్ తో వస్తుంది. అయితే దీనిని అప్ డేట్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ నెల తర్వాత ఈ అప్ డేట్ పొందుతారని కంపెనీ తన వినియోగదారులకు సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం కొత్త సాఫ్ట్ వేర్ బీటా వెర్షన్ అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..