AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola Electric: ఓలాకి బిగ్ షాక్.. రూ. 1.94లక్షలు ఫైన్ కట్టాలంటే ఆదేశాలు.. ఏం జరిగిందంటే..

ఇటీవల బెంగళూరులోని వినియోగదారుల కోర్టు ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై రూ. 1.94 లక్షల జరిమానా విధించింది. లోపభూయిష్ట ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ చేయడంతో పాటు వచ్చిన సమస్యను పరిష్కరించడంలో కంపెనీ వైఫల్యం కారణంగా ఈ జరిమానా విధించినట్లు కోర్టు పేర్కొంది.

Ola Electric: ఓలాకి బిగ్ షాక్.. రూ. 1.94లక్షలు ఫైన్ కట్టాలంటే ఆదేశాలు.. ఏం జరిగిందంటే..
Ola Electric Scooters
Madhu
|

Updated on: Jul 17, 2024 | 3:23 PM

Share

మన దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఓలా బ్రాండ్ స్కూటర్లు అత్యంత ప్రజాదరణ పొందాయి. ఓలా ఎలక్ట్రిక్ నుంచి అందుబాటులో ఉన్న అన్ని వేరియంట్లకు మార్కెట్లో మంచి డిమాండే ఉంది. దానిలోని ఫీచర్స్, అత్యాధునిక సాంకేతిక, ఈజీ రైడింగ్ వంటివి వినియోగదారులను అమితంగా ఆకర్షస్తుంటాయి. అటువంటి కంపెనీకి అనుకోసి షాక్ తగిలింది. ఓ వినియోగదారుడు చేసిన ఫిర్యాదుతో ఏకంగా రూ. 1.94లక్షలు జరిమానా కట్టాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

బెంగళూరులో జరిగిన ఘటన..

ఇటీవల బెంగళూరులోని వినియోగదారుల కోర్టు ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై రూ. 1.94 లక్షల జరిమానా విధించింది. లోపభూయిష్ట ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ చేయడం, సమస్యను పరిష్కరించడంలో కంపెనీ వైఫల్యం కారణంగా ఈ జరిమానా విధించినట్లు కోర్టు పేర్కొంది. ఫుల్ పేమెంట్ చేసిన తేది నుంచి 6 శాతం వార్షిక వడ్డీతో బాధితుడికి రూ. 1.62 లక్షలను తిరిగి చెల్లించాలని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఓలా ఎలక్ట్రిక్‌ని ఆదేశించింది. అదనంగా బాధితుడి మానసిక వేదనకు పరిహారంగా రూ. 20,000, వ్యాజ్యం ఖర్చుల కోసం రూ. 10,000 చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది.

వినియోగదారుడి ఫిర్యాదు ఇది..

బెంగళూరులోని ఆర్‌టీ నగర్‌కు చెందిన దుర్గేష్ నిషాద్ అనే వ్యక్తి ఓలా ఎస్1 ప్రో స్కూటర్‌ను డిసెంబరు 12, 2023న కొనుగోలు చేశాడు, పలు తగ్గింపులతో బండిని రూ. 1.47 లక్షలు, రిజిస్ట్రేషన్, ఇతర ఛార్జీల కోసం రూ. 16,000 చెల్లించాడు. జనవరి 2024లో స్కూటర్‌ను స్వీకరించిన తర్వాత, అతను వెనుక ఎగువ ప్యానెల్ దెబ్బతిన్నట్లు గమనించి , దానిని ఓలా ఎలక్ట్రిక్‌కి నివేదించాడు. అది సమస్యను రికార్డ్ చేసింది. ప్యానెల్ రీప్లేస్‌మెంట్ అవసరమని పేర్కొంది. అంతేకాక హారన్ కూడా పనిచేయడం లేదని, ప్యానెల్ బోర్డ్ డిస్‌ప్లేతో సహా మరిన్ని లోపాలను గుర్తించినట్లు పేర్కొన్నాడు. దీంతో ఈ సమస్యలను జనవరి 23న ఓలా షోరూమ్‌కు నివేదించాడు. అయితే వాటిపై ఓలా కంపెనీ సానుకూలంగా స్పందించలేదు. తన ఎలక్ట్రిక్ వాహన సమస్యలను పరిష్కరించలేదు. దీంతో దీంతో నిషాద్ వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు.

కంపెనీ నిర్లక్ష్యంపై కోర్టు స్పందన..

వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడంలో ఓలా ఎలక్ట్రిక్ నిర్లక్ష్యాన్ని కోర్టు నొక్కి చెప్పింది. లోపభూయిష్ట స్కూటర్‌ను రిపేర్ చేయడంలో లేదా కొత్తది భర్తీ చేయడంలో కంపెనీ విఫలమైనందున, నిషాద్‌కు కలిగిన అసౌకర్యానికి పరిహారం చెల్లించాలని, ఆర్థిక నష్టాన్ని కూడా అందించాలని కోర్టు ఆదేశించింది. నాణ్యత నియంత్రణ, కస్టమర్ సేవకు ప్రాధాన్యత ఇవ్వడానికి కంపెనీలకు ఈ తీర్పు కీలకమైన రిమైండర్‌గా పనిచేస్తుందని వెల్లడించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..