AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EV Scooter: మార్కెట్‌లో మరో నయా ఈవీ స్కూటర్ హల్‌చల్.. రూ.42 వేలకే మీ సొంతం

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా ప్రజలు రోజువారీ పనులకు వెళ్లడానికి ఈవీ స్కూటర్లను వాడేందుకు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ డిమాండ్‌ను ఉపయోగించుకునే విధంగా కొన్ని కంపెనీలు తక్కువ ధరకే అధునాతన ఈవీలను మార్కెట్‌లో లాంచ్ చేస్తున్నాయి. ఒడిస్సే కంపెనీ కూడా తాజాగా హైఫై పేరుతో మరో ఈవీ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

EV Scooter: మార్కెట్‌లో మరో నయా ఈవీ స్కూటర్ హల్‌చల్.. రూ.42 వేలకే మీ సొంతం
Odysse Hyfy
Nikhil
|

Updated on: May 07, 2025 | 8:17 PM

Share

భారతదేశంలో ప్రముఖ ఈవీ స్కూటర్ తయారీదారు అయిన ఒడిస్సే మధ్య తరగతి ప్రజలను టార్గెట్ చేస్తూ హైఫై పేరుతో కేవలం రూ.42 వేలకే ఓ కొత్త ఈవీ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ అయిన ఒడెస్సే మే 10 నుంచి తమ డీలర్ల వద్ద ఈ స్కూటర్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది. హైఫై స్కూటర్ లాంచ్‌పై ఒడిస్సే ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు నెమిన్ వోరా మాట్లాడుతూ తక్కువ వేగంతో వెళ్లే హైఫై స్కూటర్ పట్టణ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకుని లాంచ్ చేశామని స్పష్టం చేశారు. ఒడిస్సే హైఫై స్కూటర్ రెండు బ్యాటరీ ఎంపికలతో లాంచ్ చేశారు. 48 వాట్స్, 60 వాట్స్ బ్యాటరీ ఎంపికలతో ఈ స్కూటర్ కొనుగోలు చేయవచ్చు. 

ఒడిస్సే హైఫై స్కూటర్ 250 వాట్స్ ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందితుంది. ఈ స్కూటర్ కేవలం గంటకు 25 కిలో మీటర్ల గరిష్ట వేగంతో మాత్రమే వెళ్తుంది. ముఖ్యంగా పట్టణ ప్రయాణికులకు అనువుగా ఈ స్కూటర్ ఉంటుంది. ఈ స్కూటర్ అధునాతన లిథియం అయాన్, గ్రాఫేన్ బ్యాటరీ సాంకేతికతతో ఆకట్టుకుంటుంది. ఈ స్కూటర్‌ను ఓ సారి ఛార్జ్‌ చేస్తే 70 నుంచి 89 కిలోమీటర్ల మైలేజీను అందిస్తుంది. ఈ స్కూటర్‌ను ఫుల్ చార్జ్ చేయడానికి 4 నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఈ స్కూటర్ తేలికైన, కాంపాక్ట్ నిర్మాణంతో రావడం వల్ల ట్రాఫిక్‌లో కూడా సులభంగా వెళ్లిపోవచ్చు. 

ఒడిస్సే ఈవీ స్కూటర్‌లో క్రూయిజ్ కంట్రోల్, ఎల్ఈడీ డిజిటల్ మీటర్, రోజువారీ అవసరాలను అనుగుణంగా విశాలమైన బూట్ స్పేస్ ఆకట్టుకుంటాయి. ఈ స్కూటర్ ఐదు విభిన్న కలర్ వేరియంట్లలో లభిస్తుంది. రాయల్ మాట్టే బ్లూ, సిరామిక్ సిల్వర్, అరోరా మాట్టే బ్లాక్, ఫ్లేర్ రెడ్, జాడే గ్రీన్ రంగుల్లో ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ వీల్‌బేస్ 1325 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 215 మిమీగా ఉంది. ఈ స్కూటర్ బరువు కేవలం 88 కిలోలు (కర్బ్) మాత్రమే. సస్పెన్షన్ విధుల కోసం టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక మోనో-షాక్ అబ్జార్బర్‌తో ఆకట్టుకుంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..