ప్రభుత్వ ఉద్యోగం వదిలేశాడు.. సాగు బాట పట్టాడు.. ఇప్పుడు సంవత్సరానికి 40 లక్షలు సంపాదిస్తున్నాడు..
Sudama Sahu: భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ఇప్పటికి గ్రామాల్లో చాలామంది సాగుని నమ్ముకునే జీవిస్తున్నారు. వ్యవసాయ రంగంలో కూడా భారీ అవకాశాలు ఉంటాయి.
Sudama Sahu: భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ఇప్పటికి గ్రామాల్లో చాలామంది సాగుని నమ్ముకునే జీవిస్తున్నారు. వ్యవసాయ రంగంలో కూడా భారీ అవకాశాలు ఉంటాయి. కృషి, పట్టుదలతో వ్యవసాయం చేస్తే కచ్చితంగా విజయం సాధించవచ్చు. ఎంతో మంది చేసి చూపించారు కూడా. తాజాగా ఒడిశాలోని బార్గఢ్ జిల్లాకు చెందిన యువరైతు సుదామా సాహు ప్రభుత్వం ఉద్యోగం వదులుకొని వ్యవసాయం చేసి ఇప్పుడు లక్షలు గడిస్తున్నాడు. అతడి విజయగాధ గురించి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సుదామ సాహు చిన్నతనంలో కుటుంబ బాధ్యతలు తీసుకునే పరిస్థితులు వచ్చాయి. దీని కారణంగా సాహు ఉన్నత విద్యను అభ్యసించలేకపోయాడు. 12వ తరగతి వరకు మాత్రమే చదివాడు. వ్యవసాయంపై మక్కువ ఉన్న సుదమ స్పోర్ట్స్ కోటా నుంచి ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాదించాడు. కానీ తండ్రి అసంతృప్తి వల్ల అతడు జాబ్ వదిలేసి వ్యవసాయం చేయడానికి సిద్దపడ్డాడు. మొదటగా ప్రారంభంలో సుదమ ఊరురా తిరిగి విత్తనాలను సేకరించేవాడు. కానీ అది ఎక్కువ కాలం కొనసాగించలేకపోయాడు.
తర్వాత మహారాష్ట్రలోని వార్ధాలో ఉన్న గాంధీ ఆశ్రమానికి వెళ్లి సేంద్రియ వ్యవసాయం, విత్తనాలను ఆదా చేయడంపై శిక్షణ తీసుకున్నాడు. తర్వాత విత్తన బ్యాంకును ఏర్పాటు చేశాడు. అతడి బ్యాంకులో ఎక్కువగా వరి రకాలు ఉంటాయి. మిగిలినవి పప్పుల రకాలు. సుదమ తయారుచేసిన విత్తనాలు భారతదేశంలోనే కాకుండా భూటాన్, శ్రీలంక, బ్రిటన్ సహా అనేక దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అనేక సంస్థలలో సుదామ విత్తనాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. సుదామ కష్టాల నుంచి పాఠాలు నేర్చుకొని నేడు దేశీయ విత్తన బ్యాంకును నడుపుతున్నాడు అతని వార్షిక టర్నోవర్ 40 లక్షల రూపాయలు. ఈరోజుకి అతడు వివిధ ప్రాంతాలకు వెళ్లి వ్యవసాయం, విత్తనాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తాడు.