Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TVS Fiero125: TVS పాత బైక్‌ ఇప్పుడు కొత్త మోడల్‌లో..! ధర ఎంతో తెలుసా..?

TVS Fiero 125: టీవీఎస్ ద్విచక్ర వాహన విభాగంలో మరో కొత్త బైక్‌ని లాంచ్‌ చేయడానికి సిద్దమైంది. 100 సిసి సెగ్మెంట్‌లో టీవీఎస్‌ కంపెనీకి మంచి పేరు ఉంది. త్వరలో

TVS Fiero125: TVS పాత బైక్‌ ఇప్పుడు కొత్త మోడల్‌లో..! ధర ఎంతో తెలుసా..?
Tvs Fiero
Follow us
uppula Raju

|

Updated on: Sep 13, 2021 | 8:15 PM

TVS Fiero 125: టీవీఎస్ ద్విచక్ర వాహన విభాగంలో మరో కొత్త బైక్‌ని లాంచ్‌ చేయడానికి సిద్దమైంది. 100 సిసి సెగ్మెంట్‌లో టీవీఎస్‌ కంపెనీకి మంచి పేరు ఉంది. త్వరలో125 సీసీ బైక్‌లలోకి ప్రవేశించబోతుంది. ప్రస్తుతం కంపెనీలో 100 సీసీ, 110 సీసీ సెగ్మెంట్లలో టీవీఎస్ స్పోర్ట్, స్టార్ సిటీ, రోడియన్ వంటి బైకులు ఉన్నాయి. కానీ ఒక్క బైక్ కూడా 125 సీసీలో లేదు. అయితే125 సీసీ బైక్‌ల సెగ్మెంట్‌లో తన పాత బైక్‌ టీవీఎస్ ఫియెరోను కొత్తగా లాంచ్‌ చేయనుంది. BikeDekho.com నివేదిక ప్రకారం.. TVS కొత్త ఫియెరో 125 ని సెప్టెంబర్ 16 న లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది.

ఏ బైక్స్‌కి పోటీ ఉంటుంది.. ఇప్పటికే మార్కెట్లో 125 సీసీ విభాగంలో చాలా పోటీ ఉంది. ఈ పరిస్థితులలో TVS ఫియెరో125 పోటీని ఎలా తట్టుకుంటుందో వేచి చూడాలి. హోండా ఎస్పి 125, హీరో గ్లామర్ ఎక్స్‌టెక్, బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్ 125 వంటి బైక్‌లు ఇప్పటికే 125 సిసి సెగ్మెంట్‌లో ఉన్నాయి. ఈ బైకులన్నీ మంచి విక్రయాలతో కంపెనీకి మంచి లాభాలు తెచ్చిపెడుతున్నాయి. అయితే ఫియెరో మార్కెట్లో ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలియడం లేదు.

పాత బైక్ కి భిన్నంగా.. TVS Fiero ఓల్డ్‌ బైక్‌. కానీ ఇప్పుడు ఈ బైక్ లుక్ ఇతర వాటి కంటే భిన్నంగా ఉంది. పల్సర్‌ రేంజ్‌లో తీసుకొస్తున్నారు. ఈ బైక్‌ కచ్చితంగా వినియోగదారులను ఆకర్షిస్తుందని కంపెనీ నమ్ముతోంది. ఫియెరోలో125 సిసి ఇంజిన్, 11 బిహెచ్‌పి పవర్,10.8 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ గురించి ఎక్కువ సమాచారం వెల్లడి కాలేదు. ధర గురించి మాట్లాడితే బైక్ యొక్క ఎక్స్-షోరూమ్ ధర దాదాపు 70 వేల రూపాయలుగా ఉంటుందని అంచనా.

Anikha Surendran: మైమరిపిస్తోన్న అనికా సురేంద్రన్ లేటెస్ట్ పిక్స్..

Railway SECR Recruitment 2021: ఐటీఐ విద్యార్థులకు గుడ్ న్యూస్‌..! పరీక్ష లేకుండానే ఉద్యోగ అవకాశం..

NEET: నీట్‌ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం.. అన్నాడీఎంకే పూర్తి మద్దతు