AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paytm: పేటీఎమ్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఎన్‌పీసీఐ కీలక ప్రకటన..

పేటీఎమ్‌తో యూపీఐ సేవలను ఉపయోగిస్తున్న కోట్లాది మంది యూజర్లకు ఊరటనిచ్చే వార్తను తెలిపింది. పేటీఎమ్‌ ముందులాగే పనిచేస్తుందని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిషేధం కేవలం పేటీఎమ్‌ పేమెంట్స్ బ్యాంక్‌పై మాత్రమే ప్రభావం చూపుతుందిని, పేటీఎమ్‌ యూపీఐ సేవలు యథావిధిగా కొనసాగుతాయని...

Paytm: పేటీఎమ్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఎన్‌పీసీఐ కీలక ప్రకటన..
Paytm
Narender Vaitla
|

Updated on: Mar 14, 2024 | 8:28 PM

Share

ప్రముఖ యూపీఐ సంస్థ పేటీఎమ్‌పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సిషేధం విధించడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీంతో పేటీఎమ్‌ను ఉపయోగిస్తున్న కోట్లాది మంది యూజర్లు ఆందోళనలో పడ్డారు. పేటీఎమ్‌ సేవలు కొనసాగుతాయా లేదా.? అన్న సందిగ్ధత చాలా మందిలో ఎదురైంది. అయితే తాజాగా దీనిపై నేషనల్ పేమెంట్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) కీలక ప్రకటన చేసింది.

పేటీఎమ్‌తో యూపీఐ సేవలను ఉపయోగిస్తున్న కోట్లాది మంది యూజర్లకు ఊరటనిచ్చే వార్తను తెలిపింది. పేటీఎమ్‌ ముందులాగే పనిచేస్తుందని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిషేధం కేవలం పేటీఎమ్‌ పేమెంట్స్ బ్యాంక్‌పై మాత్రమే ప్రభావం చూపుతుందిని, పేటీఎమ్‌ యూపీఐ సేవలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. బహుళ-బ్యాంక్ మోడల్‌లో యూపీఐ చెల్లింపుల కోసం పేటీఎమ్‌ థర్డ్-పార్టీ యాప్ ప్రొవైడర్ లైసెన్స్ మంజూరు చేసిందని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. చేయబడిందని స్పష్టం చేసింది.

పేటీఎం కోసం పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్‌గా నాలుగు బ్యాంకులు పనిచేయనున్నాయి. యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యెస్ బ్యాంక్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ విషయమైన ఎన్‌పీసీఐ విడుదల చేసిన ప్రకటనలో.. ‘పేటీఎంలో ఇప్పటికే ఉన్న, కొత్త యూపీఐ వ్యాపారులకు మర్చంట్ కొనుగోలు బ్యాంకుగా యెస్ బ్యాంక్ వ్యవహరిస్తుంది. @Paytm” హ్యాండిల్ యస్ బ్యాంక్ కు రీడైరెక్ట్ చేస్తారు. ఇది ఇప్పటికే ఉన్న వినియోగదారులు, వ్యాపారులు యూపీఐ లావాదేవీలు, ఆటోపే ఆదేశాలు నిరంతరాయంగా కొనసాగించడానికి వీలు కల్పిస్తుందని తెలిపారు.

ఇదిలా ఉంటే నిబంధనలు ఉల్లంఘన కారణంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆర్బీఐ ఆంక్షలు విధించించిన విషయం తెలిసిందే. మార్చి 15 నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలను నిలిపివేస్తూ ప్రకటన చేశారు. అయితే తాజాగా ఎన్‌పీసీఐ ఇచ్చిన వెసులుబాటుతో యూపీఐ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us