AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Small Cap Multibagger Stocks: ఆరు నెలల కాలంలో 1700శాతం రాబడి.. స్టాక్‌ మార్కెట్లో సెన్సేషన్‌..

అనేక స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో భారీ పెరుగుదల కనిపించింది. ఈ క్రమంలో గత ఆరు నెలల్లో పెట్టుబడిదారులను ఆశ్చర్యపరుస్తూ.. అమాంతం తమ విలువను పెంచుకున్న కొన్ని స్మాల్‌ క్యాప్‌ మల్టీబ్యాగర్‌ స్టాక్‌లకు మీకు పరిచయం చేస్తున్నాం. ఈ షేర్లు కేవలం ఆరు నెలల్లో పెట్టుబడిదారులకు 1700 శాతం వరకు లాభాలను అందించాయి.

Small Cap Multibagger Stocks: ఆరు నెలల కాలంలో 1700శాతం రాబడి.. స్టాక్‌ మార్కెట్లో సెన్సేషన్‌..
Multibagger Stocks
Madhu
|

Updated on: Mar 15, 2024 | 6:53 AM

Share

అనిశ్చితికి మారుపేరు స్టాక్‌ మార్కెట్‌. ఎప్పుడు ఎవరిని కోటీశ్వరులను చేస్తుందో.. ఎవరిని బికారులుగా మారుస్తుందో అంచనా వేయడం కష్టం. అయితే మార్కెట్‌ అవగాహన ఉండి, ఎప్పుడు ఏ స్టాక్‌ కొనుగోలు చేయాలి? ఎలా పెట్టుబడులను డైవర్సిఫై చేయాలనే దానిపై పట్టు ఉంటే.. అధిక రాబడులు సొంతం చేసుకోవచ్చు. గత కొంత కాలంగా భారత స్టాక్ మార్కెట్ బుల్లిష్‌గా ఉంది. గత ఏడాది బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 27 శాతం పెరిగింది. ఈ మార్కెట్ బూమ్ నుంచి స్మాల్ క్యాప్ షేర్లు కూడా బాగా లాభపడ్డాయి. నివేదికల ప్రకారం, గత ఏడాది నుంచి బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ సుమారు 61 శాతం పెరిగింది. అనేక స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో భారీ పెరుగుదల కనిపించింది. ఈ క్రమంలో గత ఆరు నెలల్లో పెట్టుబడిదారులను ఆశ్చర్యపరుస్తూ.. అమాంతం తమ విలువను పెంచుకున్న కొన్ని స్మాల్‌ క్యాప్‌ మల్టీబ్యాగర్‌ స్టాక్‌లకు మీకు పరిచయం చేస్తున్నాం. ఈ షేర్లు కేవలం ఆరు నెలల్లో పెట్టుబడిదారులకు 1700 శాతం వరకు లాభాలను అందించాయి. తక్కువ ట్రేడింగ్ వాల్యూమ్‌లు ఉన్నప్పటికీ, ఈ షేర్లు అంచనాలకు మించి రాబడులను ఇస్తున్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి..

  • డైమండ్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్ ధర గత ఆరు నెలల్లో 1700 శాతం పెరిగింది. సెప్టెంబర్ 18, 2023న, ఈ షేర్ విలువ కేవలం రూ. 23.30. అది ఇప్పుడు రూ. 420.40గా మారింది. గత నెలలోనే ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు 45 శాతం రాబడిని ఇచ్చింది.
  • టైన్ ఆగ్రో షేర్లలో గత ఆరు నెలల్లో డబ్బు ఇన్వెస్ట్ చేసిన వారికి ఈ మల్టీబ్యాగర్ షేర్ 1000 శాతం రాబడిని ఇచ్చింది. ఆరు నెలల క్రితం ఈ షేరు ధర రూ.34 ఉండగా, ప్రస్తుతం రూ.408.40కి పెరిగింది. గత నెల రోజుల్లో ఈ షేరు ధర 46 శాతం పెరిగింది.
  • డాల్ఫిన్ ఆఫ్‌షోర్ ఎంటర్‌ప్రైజెస్ (ఇండియా) షేర్లు కూడా గత ఆరు నెలల్లో పెట్టుబడిదారులకు భారీ లాభాలను అందించాయి. ఈ కాలంలో ఈ మల్టీబ్యాగర్ షేర్ ధర 1100 శాతం పెరిగింది. నేడు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో ఈ షేరు రూ.336.30 వద్ద ట్రేడవుతోంది.
  • క్యుపిడ్ లిమిటెడ్ షేర్ రూ.2442 వద్ద ట్రేడవుతోంది. ఆరు నెలల క్రితం ఈ షేరు ధర రూ.427 కాగా.. తాజా సమాచారం ప్రకారం ఈ షేరు ఆరు నెలల్లో 471 శాతం రాబడిని, గత నెలలో 26 శాతం లాభాన్ని ఇచ్చింది.
  • న్యూటైమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్ ధర గత ఆరు నెలల్లో ఇన్వెస్టర్ల డబ్బును రెట్టింపు చేసింది. ఈ కాలంలో ఈ మల్టీబ్యాగర్ షేర్ 277 శాతం రాబడిని ఇచ్చింది. ఆరు నెలల క్రితం ఈ షేరు ధర దాదాపు రూ.12 ఉండగా.. ఇప్పుడు రూ. 45గా ఉంది.
  • ఆల్గోక్వాంట్ ఫిన్‌టెక్ లిమిటెడ్ షేర్లు కూడా గత ఆరు నెలల్లో పెట్టుబడిదారుల డబ్బును రెట్టింపు చేశాయి. ఆరు నెలల క్రితం, ఈ షేరు ధర రూ. 657. ఇప్పుడు ఈ మల్టీబ్యాగర్ షేర్ ధర రూ. 1500 అయింది. 2024 సంవత్సరంలో ఇప్పటివరకు ఈ స్టాక్ 35 శాతం పెరిగింది.
  • ఐఎల్‌అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ కన్సల్టెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ పెట్టుబడిదారులకు 150 శాతం రాబడిని ఇచ్చింది. ఆరు నెలల క్రితం ఈ షేరు ధర రూ.15.70కాగా ఇప్పుడు ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు రూ.39.40 వద్ద ట్రేడవుతోంది. ఈ స్టాక్ కేవలం 2024 సంవత్సరంలో 25 శాతం పెరిగింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us