ఓరి దేవుడో.. మీ ఇంట్లోని సబ్బులు, షాంపూలే మీకు శత్రువులా.. ఈ విషయాలు తెలిస్తే నోరెళ్లబెడతారు..
మనం రోజూ బట్టలు ఉతకడానికి ఉపయోగించే లాండ్రీ డిటర్జెంట్లు (Laundry Detergents) నెమ్మదిగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే విషతుల్యాలుగా మారుతున్నాయని ఒక క్యాన్సర్ నిపుణుడు హెచ్చరిస్తున్నారు. అవును మీరు విన్నది నిజమే.. దాదాపుగా మనం అందరం ఇల్లు లేదా బట్టలు శుభ్రం చేయడానికి ఉపయోగించే డిటర్జెంట్ పౌడర్లు, క్లీనర్లు పూర్తిగా సురక్షితమైనవని భావిస్తారు. అందుకే వాటిని ప్రతిరోజూ తరచుగా వాడుతుంటాము. అయితే, ఈ ఉత్పత్తులలో అధిక మొత్తంలో రసాయనాలు ఉంటాయని, అవి మీ హార్మోన్లకు అంతరాయం కలిగించి, తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతూ, నెమ్మదిగా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని క్యాన్సర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...

బట్టలు తెల్లగా, సువాసనగా రావాలని మనం వాడే ఖరీదైన డిటర్జెంట్లు వాస్తవానికి మన ఇంట్లోనే ఉండే ఒక నెమ్మదిగా పనిచేసే విషం (Slow Poison) అని క్యాన్సర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రసాయన ఉత్పత్తుల వెనుక ఉన్న భయంకరమైన నిజాలు ఇక్కడ ఉన్నాయని క్యాన్సర్ ఇమ్యునోథెరపీ నిపుణుడు, క్యాన్సర్ హీలర్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన డాక్టర్ తరంగ్ కృష్ణ, తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో, రోజువారీగా డిటర్జెంట్ పౌడర్, క్లీనర్ లేదా లిక్విడ్‌లను ఉపయోగించడం వల్ల ఆరోగ్యంపై కలిగే హానికరమైన ప్రభావాలను, వాటికి సురక్షితమైన ప్రత్యామ్నాయాలు ఏమిటో ఆయన వివరించారు. పూర్తి వివరాల్లోకి వెళితే…
ప్రమాదకర రసాయనాలు:
చాలా డిటర్జెంట్లలో 1,4-డయాక్సేన్ అనే రసాయనం ఉంటుంది. ఇది క్యాన్సర్ వచ్చే ముప్పును పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి నీటిలో పూర్తిగా కరగవు, బట్టలు ఉతికిన తర్వాత కూడా ఆ పిప్పి దుస్తులకు అంటుకునే ఉంటుంది. మనం ఆ బట్టలు వేసుకున్నప్పుడు, చర్మం ద్వారా ఈ రసాయనాలు రక్తంలోకి ప్రవేశిస్తాయి. ఇవి క్రమంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. దీంతో చర్మ సమస్యలు మొదలవుతాయి. దద్దుర్లు, దురద, అలర్జీలకు ఇవి ప్రధాన కారణంగా మారుతాయి. అంతేకాదు..హార్మోన్ల అసమతుల్యతకు కూడా దారి తీస్తుంది. ఇవి శరీరంలోని ఎండోక్రైన్ వ్యవస్థను దెబ్బతీస్తాయి. దీర్ఘకాలం పాటు ఈ రసాయనాలకు గురికావడం వల్ల కిడ్నీలు, కాలేయంపై ప్రభావం పడుతుంది.
సురక్షితమైన ప్రత్యామ్నాయాలు:
రసాయన డిటర్జెంట్లకు బదులుగా ఈ క్రింది వాటిని ప్రయత్నించవచ్చు:
కుంకుడు కాయలు (Soapnuts): ఇవి సహజ సిద్ధమైనవి, ఎటువంటి రసాయనాలు లేనివి. బట్టలు శుభ్రం చేయడానికి ఇది అత్యంత సురక్షితమైన మార్గం.
బేకింగ్ సోడా, వెనిగర్: బట్టలపై మొండి మరకలను తొలగించడానికి, దుర్వాసన పోగొట్టడానికి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి.
మొక్క సోపులు (Castile Soap): మొక్కల ఆధారిత నూనెలతో తయారయ్యే సబ్బులను వాడటం వల్ల చర్మానికి ఎటువంటి హాని కలగదు.
సువాసన లేని డిటర్జెంట్లు: వీలైనంత వరకు కృత్రిమ సువాసనలు, రంగులు లేని టాక్సిన్ ఫ్రీ డిటర్జెంట్లను ఎంచుకోండి. తెలుపు, సువాసన కంటే ఆరోగ్యమే ముఖ్యం. మన జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధుల నుండి మనల్ని, మన కుటుంబాన్ని కాపాడుకోవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




