AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై టికెట్ కౌంటర్‌ వద్ద..

ఈ నేపథ్యంలోనే ఇండియన్‌ రైల్వేస్‌ కూడా డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించే దిశగా అడుగులు వేసింది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్న ఇండియన్‌ రైల్వేస్‌ తాజాగా డిజిటల్‌ చెల్లింపులను స్వీకరిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది...

Indian railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై టికెట్ కౌంటర్‌ వద్ద..
Indian Railway
Narender Vaitla
|

Updated on: Feb 06, 2024 | 5:00 PM

Share

ప్రస్తుతం డిజిటల్‌ పేమెంట్స్‌ హవా ఎంతలా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌ వరకు అందరూ డిజిటల్‌ పేమెంట్స్‌ను అంగీకరిస్తున్నారు. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు క్షణాల్లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం ఉంది. దీంతో అన్ని రంగాల్లో డిజిటల్‌ పేమెంట్స్‌ను స్వీకరించడం అనివార్యంగా మారింది.

ఈ నేపథ్యంలోనే ఇండియన్‌ రైల్వేస్‌ కూడా డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించే దిశగా అడుగులు వేసింది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్న ఇండియన్‌ రైల్వేస్‌ తాజాగా డిజిటల్‌ చెల్లింపులను స్వీకరిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా రైల్వే స్టేషన్‌లో టికెట్ కౌంటర్‌ వద్ద డబ్బుల విషయంలో ఇబ్బందులు పడడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చిల్లర విషయంలో ప్రతీ ఒక్కరం ఏదో ఒక సమయంలో ఇబ్బంది ఎదుర్కొని ఉంటాం. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే ఇండియన్‌ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై రైల్వే స్టేషన్స్‌లో ఉండే టికెట్‌ కౌంటర్ల వద్ద డిజిటల్‌ చెల్లింపులను స్వీకరించనున్నారు. సాధారణంగా రైల్వే టికెట్స్‌ను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సమయంలో క్రెడిట్, డెబిట్ కార్డులు మొదలు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, యూపీఐ సేవల ద్వారా టికెట్ బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. అయితే రైల్వేస్టేషన్స్‌లో టికెట్ కౌంటర్స్‌ వద్ద మాత్రం కచ్చితంగా నగదు రూపంలో డబ్బు చెల్లించాల్సిందే. దీంతో చిల్లర సమస్య తలెత్తడం సర్వసాధారణం. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే ఇండియన్‌ రైల్వేస్‌ ఇకపై టికెట్ కౌంటర్ల వద్ద యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కేవలం యూపీఐ మాత్రమే కాకుండా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులతో కూడా పేమెంట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..